salma hayek
-
దర్శకుడు టవల్ తీసేయమన్నాడు : నటి
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయాక్ ‘డస్పెరాడో’ మూవీలో హీరోతో ఓ శృంగార సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ మూవీ ఆమె ప్రముఖ నటుడు ఆంటోనియో బాండెరాస్కు జోడీగా నటించారు. ఇటీవల ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆమె ఈ సందర్భంగా ‘డెస్పెరాడో’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1995లో దర్శకుడు రాబర్ట్ రోడ్రీగ్యూజ్ రూపొందించిన ఈ మూవీలో ఆంటోనియో, సల్మాలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ.. ఈ మూవీలో హీరోకు తనకు మధ్య ఉండే గ్రాఫికల్ సెక్స్ సీన్ చిత్రీకరణ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, దర్శకుడు నా టవల్ తీసేయమని చెప్పినప్పుడల్లా ఏడ్చానన్నారు. ‘దర్శకుడు రాబర్ట్ ఈ మూవీ కథ వివరించినప్పుడు హీరోకు నాకు మధ్య ఉండే ఈ శృంగార సన్నివేశం గురించి ప్రస్తావించలేదు. మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యాక రొమాంటిక్ సీన్ కోసం సెట్స్ సిద్ధం చేస్తున్నారు. ఇది చూసి నేను షాకయ్యాను. వెంటనే దర్శకుడిని అడగ్గా ఆయన మీకు, హీరోకు మధ్య కాస్తా రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఇందులో భాగాంగా మీరు ఈ శృంగార సన్నివేశంలో నటించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ సన్నివేశం చిత్రీంచే సమయంలో అక్కడ కేవలం హీరో, దర్శకుడు, మూవీ నిర్మాత, రాబర్ట్ భార్య ఎలీజబెత్ అవెల్లాన్లు మాత్రమే ఉండాలని డిమాండ్ చేశాను. దీనికి వారు కూడా అంగీకరించారు. ఇక ఈ సీన్ షూట్ చేసే సమయంలో ఇక నేను ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకంటే హీరో ఆంటోనియో నాకంటే చాలా పెద్దవాడు. మంచి వ్యక్తి, షూటింగ్లో ఆయన నేను మంచి స్నేహితులం కూడా అయ్యాం. కానీ ఈ సీన్లో నటించేందుకు ఆయన ఏమాత్రం భయపడటం లేదు. అసలు ఏం జరగనట్లుగా వ్యవహరించారు. అలా అయనను చూసి నాకు చాలా భయమేసింది. దీంతో ఒక్కసారిగా ఏడవడం ప్రారంబంభించాను. ఈ నన్ను సముదాయించడానికి వారు కాస్తా బ్రేక్ ఇచ్చి తిరిగి షూట్ చేసేవారు. అయితే అప్పుడు నేను టవల్‌పై ఉన్నాను. దీంతో సీన్లో నా టవల్ తీసేయాలని చెప్పినప్పడు మళ్లీ ఏడవడం మొదలు పెట్టాను. దీంతో నన్ను నవ్వించేందుకు దర్శకుడు రాబర్ట్, హీరో ఆంటోనియో కాస్తా బ్రేక్ ఇచ్చేవారు. తర్వాత కూడా ఈ సీన్లో మళ్లీ మళ్లీ ఏడ్చేను. అలా ఈ ఒక్క సీన్‌కే చాలా టేక్‌లు తీసుకున్నాను. అయిన హీరో కానీ, డైరెక్టర్ కానీ నా మీద ఒత్తిడి తేలేదు. ఆ సమయంలో వారు చాలా సహనంతో వ్యవహిరించారు. ఇది నిజంగా అద్బుతమైన విషయం కదా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఆమె నటించిన ‘ది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెక్సికో’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ‘ది ఎటర్నల్స్’తో పాటు ‘ది హిట్మన్స్ వైఫ్ బాడిగార్డు’లో నటిస్తున్నారు. ‘ఎటర్నల్స్’ మూవీ గతేడాది నవంబర్ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దర్శకుడు చోలే జావో దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆమెతో పాటు ప్రముఖ నటి ఏంజెలినా జోలీ, రిచర్డ్ మాడెన్, కిట్ హోరింర్టన్, గెమ్మచాన్ తదితరులు కూడా నటించారు. (చదవండి: లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి) (ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..!) (తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం) -
ఆ ఫోటో ఆత్మశక్తితో నింపుతుంది..
ఇంగ్లిష్ సినిమాలు చూసే ఆసక్తి లేని వారు కూడా, ఎక్కడైనా ఫొటో కనిపిస్తే ఆసక్తిగా ఆగి చూసే హాలీవుడ్ కథానాయిక సల్మా హైక్. 54 ఏళ్లు అని గూగుల్ తనకేదో తెలుసున్నట్టు సల్మా గురించి చెప్పొచ్చినా ఆ యాభై నాలుగు అనేది ఆమెకు బాగా వదులైన గౌను లానే కనిపిస్తుంది. ఈ మెక్సికన్ బ్యూటీకి వయసన్నది ఎప్పటికీ చిన్న పిల్లలు తొడుక్కుని నడిచే పెద్దవాళ్ల చెప్పుల జతే! అలసిపోవడానికి సిద్ధపడితేనే సల్మా అందాన్ని వర్ణించడానికి ఎవరైనా మాటలు వెతుక్కునే ప్రయత్నం చేయాలి. అంతగా కష్టపడలేని బద్ధకస్తులు ‘అమృతం కానీ తాగిందా!’ అనే ఒక పొంతన లేని ఆశ్చర్యంతో మూడంటే మూడే మాటల ఏక వచన కవిత్వాన్ని ఆమె కోసం ధారపోయొచ్చు. అమృతం తాగితే అలా ఎన్నేళ్లయినా పడి ఉంటారని చెప్పిన వాళ్లు అమృతం దీర్ఘాయుష్షుతో పాటు పనిలో పనిగా అందాన్ని కూడా ప్రసాదిస్తుందని ఎక్కడా చెప్పినట్లయితే లేదు. అందం, అమృతం రెండూ వేర్వేరు గ్రూపుల సబ్జెక్టులు. ఆర్ట్స్, సైన్సు లా. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం. సల్మా హైక్! రోజూ అద్దంలో చూసుకున్నట్లే ఒక్కోసారి తనకు తన అంతః సౌందర్యాన్ని చూసుకోవాలని అనిపిస్తుందట సల్మాకి! ‘అప్పుడు నేను వెళ్లి, ధ్యానంలో కూర్చుంటాను. నాలోకి నేను ప్రయాణిస్తాను. నన్ను నేను సాక్షాత్కరింపజేసుకుంటాను. ఆ దివ్యలోకంలో నేను ఎలా ఉంటానో తెలుసా! పద్మపీఠంపై పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాను. పట్టుచీర, పట్టు జాకెట్ ధరించి ఉంటాను. తలపై ధగధగా మెరిసే కిరీటం ఉంటుంది. ఒంటి నిండా ఆభరణాలు ఉంటాయి. నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో కలువపూలు ఉంటాయి. ఒక అరచేతి నుంచి బంగారు నాణేలు జలజలా కురుస్తుంటాయి. ఇంకొకటి అభయహస్తం. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అదే నా ఆత్మ సౌదర్యం. సంపద, అదృష్టం, కరుణ, సంతోషం కలగలిసిన స్వరూపం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆత్మ సౌందర్యం ఫొటోను పోస్ట్ చేశారు సల్మా హైక్! మన శ్రీమహాలక్ష్మి..లక్ష్మీదేవి పటమే ఆ ఫొటో. ‘గాడెస్ లక్ష్మి ఫొటో నన్ను ఆత్మశక్తితో, అపురూప అంతస్సౌందర్యంతో నింపుతుంది’ అని పోస్ట్ పెట్టారు సల్మా హైక్! -
లక్ష్మీ దేవిని ఆరాధిస్తాను: హాలీవుడ్ నటి
మెక్సికో: హిందూయిజంను ఇష్టపడనివారు ఉండరు. వీదేశీయులు కూడా భారత సంస్కృతిని, ఇక్కడి హిందూ దేవుళ్లను ఎంతగానో ఆరాధిస్తారు. భారత్‌లోని ప్రముఖ దేవాలయాలను కూడా వారు తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయెక్ కూడా హిందూయిజంపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రకటించారు. తను ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మి దేవిపై దృష్టి పెట్టడం ద్వారా ఇన్నర్ బ్యూటీతో కనెక్ట్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించారు. సల్మా లక్ష్మీ దేవి ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఫొటో తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ‘నేను నా అంతర్గత సౌందర్యంతో కనెక్ట్ అవ్వాలనుకున్నపుడు ధ్యానం చేస్తాను. ఆ సమయంలో హిందూ దేవత అయిన లక్ష్మీ దేవిని స్మరించుకుంటాను. అది నాకు ఎంతో ఆనందం, ప్రశాంతను ఇస్తుంది. అప్పుడే మీ అంతర్గత సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది’ అంటూ సల్మా రాసుకొచ్చారు. (చదవండి: ‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత) సల్మా పోస్టు చూసిన బాలీవుడ్ నటి బిపాస బసు ‘అద్భుతం’ అంటూ కామెంటు చేశారు. అంతేగాక సల్మా ఇండియన్ ఫ్యాన్స్ కూడా తను లక్ష్మీ దేవతను ఆరాధిస్తానని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఇండియాకు రండి ఇక్కడ మీకు మరింత అంతర్గత శాంతి లభిస్తుంది. అంతేకాదు భారతీయుల ప్రేమను కూడా పొందుతారు’ అంటూ ఆమె పోస్టుకు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే హిందు దేవతలను ఆరాధించే వారిలో సల్మాతో పాటు జూలియా రాబర్ట్, రస్సెల్ బ్రాండ్, మిలే సైరస్ వంటి అంతర్జాతీయ ప్రముఖు నటులు కూడా ఉన్నారు. కాగా మెక్సికో దేశానికి చెందిన సల్మా మెక్సీకన్, అమెరికన్ సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఆమె హాలీవుడ్లో ‘డెస్పరాడో’, ‘వైల్డ్ వైల్డ్ వెస్ట్’, ‘ఫ్రిడా’, ‘స్పై కిడ్స్-3’ వన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో’ వంటి చిత్రాలతో నటించారు. (చదవండి: క్యాన్సర్‌తో దిగ్గజ రాక్‌స్టార్ కన్నుమూత) View this post on Instagram When I want to connect with my inner beauty, I start my meditation focusing on the goddess Lakshmi, who in Hinduism represents wealth, fortune, love, beauty, Māyā (literally meaning "illusion" or "magic”), joy and prosperity. Somehow her image makes me feel joyful, and joy is the greatest door for your inner beauty. Cuando quiero conectarme con mi belleza interior, comienzo mi meditación enfocándome en la diosa Lakshmi, quien en el hinduismo representa la riqueza, la fortuna, el amor, la belleza, Māyā (que literalmente significa "ilusión" o "magia"), alegría y prosperidad. De alguna manera su imagen me trae alegria, y piensa que la alegría es la puerta más directa para tu belleza interior. #innerbeauty #hinduism #lakshmi #meditation A post shared by Salma Hayek Pinault (@salmahayek) on Oct 7, 2020 at 6:39am PDT -
హాలీవుడ్ నిర్మాత వీన్‌స్టీన్ అరెస్ట్
న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను రేప్ చేయడంతో పాటు మరో మహిళపై లైంగికదాడికి యత్నించినట్లు కేసులు నమోదయ్యాయి. వీన్‌స్టీన్ తమను రేప్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్సహా 80 మందికిపైగా హాలీవుడ్ నటీమణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వీన్‌స్టీన్.. అధికారులకు సరెండర్ అయ్యాడు. తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. -
హీరోలూ... పారితోషికం తగ్గించుకోండి!
‘‘సినిమా బడ్జెట్ 10 మిలియన్ డాలర్లు అనుకుందాం. అందులో 9.7 శాతం హీరోలు పట్టుకుపోతుంటే ఇక మాకేం మిగులుతుంది’’ అంటున్నారు హాలీవుడ్ తార సల్మా హయక్. ఫ్రాన్స్ దేశంలో జరుగుతోన్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. స్త్రీ–పురుష సమానత్వం గురించి ఈ ఉత్సవాల్లో పలువురు ఇప్పటికే మాట్లాడారు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీటూ’, ‘టైమ్ ఈజ్ అప్’ ఉద్యమానికి మద్దతు పలుకుతూ 82 మంది మహిళలు కాన్స్ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే వేదిక సాక్షిగా హీరో, హీరోయిన్ల పారితోషికం గురించి సల్మా హయక్ మాట్లాడారు. సినిమాకి పెడుతున్న బడ్జెట్లో దాదాపు 9 శాతానికి పైగా హీరోలు తీసేసుకుంటే.. ఇక హీరోయిన్లకు ఎంత దక్కుతుందన్నారామె. ఇంకా సల్మా హయక్ మాట్లాడుతూ – ‘‘హీరోలకు సమానంగా హీరోయిన్లకూ పారితోషికం దక్కాలి. అది జరగాలంటే హీరోయిన్లకు కూడా నిర్మాతలు ఎక్కువ పారితోషికం ఇస్తే సరిపోదు. హీరోలు తమ పారితోషికం తగ్గించుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా సమానం అవుతుంది’’ అన్నారు. అటు హీరోకీ ఇటు హీరోయిన్‌కీ ఎక్కువ పారితోషికం ఇస్తే.. ఇక నిర్మాతకు ఏం మిగులుతుంది? దానికి బదులు హీరోలే పారితోషికం తగ్గించుకుంటే బాగుంటుందన్నది సల్మా అభిప్రాయం. పాయింటే కదా. ఆ సంగతలా ఉంచితే... పలువురు నటీమణుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ తనను కూడా హెరాస్ చేశాడని అన్నారామె. సల్మా నటించి, నిర్మించిన చిత్రం ‘ఫ్రిడా’ (2002). ‘‘ఈ సినిమా అప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్ ఇచ్చిన అడ్వాన్స్‌ని తిరస్కరిస్తే నా మోకాలి చిప్పలను పగలగొడతానని బెదిరించాడు. ఇలాంటివాళ్లను తరిమికొట్టాలి’’ అని సల్మా ఘాటుగా స్పందించారు. -
అతడో మానవ మృగం: నటి
లాస్ ఏంజెలిస్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ తనను లైంగిక వేధించడంతో పాటు చంపేస్తానంటూ కొన్నిసార్లు బెదిరించాడని నటి సల్మా హయక్ తెలిపారు. ఇప్పటికే 50కి పైగా నటీమణులు హార్వే వీన్‌స్టీన్ లైంగిక వేధింపులు, అత్యాచారాలపై నోరు విప్పిన సంగతి తెలిసిందే. ధైర్యంగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. వారి బాటలోనే తాను ముందుకు వచ్చినట్లు హయక్ చెప్పారు. అతడో మానవ మృగమని, ఎందరో ఆడవాళ్ల జీవితాలతో చెలగాటమాడిన ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఏళ్ల తరబడి హర్వే వీన్‌స్టీన్ వేధించాడని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. 'అతడి ముందు స్నానం చేసేందుకు, మసాజ్ చేసేందుకు, నగ్నంగా ఫొటోలు పంపేందుకు, మరో మహిళతో నగ్నంగా సన్నిహితంగా ఉండేందుకు.. ఇలా పలు పనులకు మీరు నో చెప్పాలంటూ' హార్వే వీన్‌స్టీన్ చర్యలకు వ్యతిరేకంగా ఆమె పిలుపునిచ్చారు. వీన్‌స్టీన్ చెప్పినట్లుగా చేయకపోతే తన అశ్లీల వీడియోలు, ఫొటోలు తీశానని వాటిని అప్లోడ్ చేస్తానంటూ వేధించేవాడని సల్మా హయక్ వివరించారు. ప్రస్తుతం ఎంతో మార్పు వచ్చిందని.. బాధితురాళ్లు ఇదే విధంగా తిరుగుబాటు చేస్తే వీన్‌స్టీన్ లాంటి మానవ మృగాల ఆట కట్టించవచ్చన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్ననిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ)జీవిత కాల నిషేధం విధించింది. వీన్‌స్టీన్ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట... పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. 1970వ దశకం నుంచీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడెమీ కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే. -
ఇది జీవితకాల సెల్ఫీ!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ సెల్ఫీని తన అభిమానుల కోసం షేర్ చేశారు. హాలీవుడ్ నటి సల్మా హయక్తో కలిసి తీసుకున్న 'సెల్ఫీ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్' అని ఆయన అభివర్ణించారు. ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన అక్షయ్ కుమార్.. అక్కడ సల్మాతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీచర్లను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ఇదే విషయాన్ని అక్షయ్ తన ట్వీట్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్‌తో పాటు బాలీవుడ్ నటీ నటులు పరిణీతి చోప్రా, అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఎప్పటినుంచో హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్కానెగీతో కలిసి ఫొటో తీయించుకోవాలనుకున్న పరిణీతి కల కూడా అనుకోకుండా నెరవేరింది. ఆ ఫొటో తీయించుకుంటుంటే.. మధ్యలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా అందులో దూరిపోయారు. దీనికి పరిణీతి కూడా మంచి కాప్షన్ పెట్టింది. ''రబ్ నే బనా దీ జోడీ.. నేను, మాథ్యూ ఫొటో తీసుకున్నాం. కానీ ఫొటోబాంబ్ (అనుకోకుండా ఒక ఫొటోలో వేరేవాళ్లు రావడం)! అభిషేక్, అక్షయ్ దూరారు'' అని తెలిపింది. Selfie of a lifetime... Honouring all the Teachers around the World, #TeachersMatter in Dubai! @salmahayek pic.twitter.com/Py89zgc6y1 — Akshay Kumar (@akshaykumar) March 13, 2016 Rab ne bana di jodiiiii .. Me and @McConaughey !!! But photobombed !!! @juniorbachchan @akshaykumar pic.twitter.com/77RQnjsWW9 — Parineeti Chopra (@ParineetiChopra) March 13, 2016