ఇది జీవితకాల సెల్ఫీ! | Akshay Kumar shares 'selfie of a lifetime' with Salma Hayek | Sakshi
Sakshi News home page

ఇది జీవితకాల సెల్ఫీ!

Published Mon, Mar 14 2016 2:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ఇది జీవితకాల సెల్ఫీ!

ఇది జీవితకాల సెల్ఫీ!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ సెల్ఫీని తన అభిమానుల కోసం షేర్ చేశారు. హాలీవుడ్ నటి సల్మా హయక్‌తో కలిసి తీసుకున్న 'సెల్ఫీ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్' అని ఆయన అభివర్ణించారు. ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన అక్షయ్ కుమార్.. అక్కడ సల్మాతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీచర్లను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ఇదే విషయాన్ని అక్షయ్ తన ట్వీట్‌లో తెలిపారు.

ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్‌తో పాటు బాలీవుడ్ నటీ నటులు పరిణీతి చోప్రా, అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఎప్పటినుంచో హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్‌కానెగీతో కలిసి ఫొటో తీయించుకోవాలనుకున్న పరిణీతి కల కూడా అనుకోకుండా నెరవేరింది. ఆ ఫొటో తీయించుకుంటుంటే.. మధ్యలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా అందులో దూరిపోయారు. దీనికి పరిణీతి కూడా మంచి కాప్షన్ పెట్టింది. ''రబ్‌ నే బనా దీ జోడీ.. నేను, మాథ్యూ ఫొటో తీసుకున్నాం. కానీ ఫొటోబాంబ్ (అనుకోకుండా ఒక ఫొటోలో వేరేవాళ్లు రావడం)! అభిషేక్, అక్షయ్ దూరారు'' అని తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement