శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి | Akshay Kumar And Parineeti Chopra Kesari Movie Official Trailer | Sakshi
Sakshi News home page

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

Published Thu, Feb 21 2019 11:27 AM | Last Updated on Thu, Feb 21 2019 11:27 AM

Akshay Kumar And Parineeti Chopra Kesari Movie Official Trailer - Sakshi

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్‌ మూవీ కేసరి. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌ హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్‌ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్‌ ఒరక్‌జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, అజుర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement