లెక్క తగ్గదు | Akshay Kumar announces 'Kesari' release date | Sakshi
Sakshi News home page

లెక్క తగ్గదు

Published Thu, Dec 20 2018 12:33 AM | Last Updated on Thu, Dec 20 2018 12:34 AM

Akshay Kumar announces 'Kesari' release date - Sakshi

అక్షయ్‌ కుమార్‌, పరిణీతీచోప్రా

ఐదేళ్లుగా ఏడాదికి కనీసం మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. ఈ ఏడాది ఆల్రెడీ ‘ప్యాడ్‌మ్యాన్, గోల్డ్, 2.ఓ’ చిత్రాలతో థియేటర్స్‌లోకి వచ్చి అలరించారు. ఆల్రెడీ నెక్ట్స్‌ ఇయర్‌కు కూడా లెక్క తగ్గకుండా ఇంకో మూడు సినిమాలను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘కేసరి’ అనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారాయన.

‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ కనిపిస్తారు.‘‘కేసరి చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం చేసినందుకు నా ఛాతీ గర్వంతో నిండిపోయింది’’ అన్నారు అక్షయ్‌. ఇందులో పరిణీతీ చోప్రా కథానాయిక. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 31న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాను కంప్లీట్‌ చేసిన అక్షయ్‌ ప్రజెంట్‌ ‘గుడ్‌న్యూస్, మిషన్‌ మంగళ్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement