వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు... | Lord Ganesh see the wedding of a thousand vighnalu ... | Sakshi
Sakshi News home page

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు...

Published Sat, May 31 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు...

వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు...

నివృత్తం
 
వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నా తల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకుని రమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో పడ్డారు.

కానీ పార్వతీదేవిలాంటి అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పట్నుంచీ ఈ మాట పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదురవుతుంటే ‘వినాయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారైంది పరిస్థితి’ అనడం రివాజుగా మారింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement