ganesha
-
ఆకట్టుకుంటున్న ‘ఘన’ గణనాథుడి రూపాలు (ఫొటోలు)
-
‘గణేష్ మహరాజ్ కి జై బోలో’.. భక్తుల సందడి (ఫొటోలు)
-
ఆయతనం
ఆయతనం అంటే రూపం. ఆయతనం అనే మాటకు ఆలయం, గర్భగృహం అనే పేరు కూడా శాస్త్రంలో ఉంది. ఆయతనం అనే పదంతో మనకు బాగా పరిచయమైన పదం పంచాయతనం. ఆదిశంకరులు షణ్మతాలను స్థాపించి, పంచాయతన పూజను ఆచరించమని ప్రబోధించారు. నేటికీ ఈ పంచాయతన పూజను ఆచరించే వారెందరో ఉన్నారు. శివుడు, నారాయణుడు, గణేశుడు, సూర్యుడు, దేవి. వీరైదుగురు పంచాయతన దేవతలు. వీరిలో ఎవరికి ఇష్టమైన దేవతను మధ్యలో ఉంచి పూజిస్తే అది ఆ దేవతా పంచాయతనం అవుతుంది. ఉదాహరణకు శివుణ్ణి మధ్యలో ఉంచి ఈశాన్యంలో విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు, నైఋతిలో వినాయకుడు, వాయువ్యంలో దేవి ఉంటే అది శివపంచాయతనం. ఇలా ఈ దేవతలు స్థానమార్పులతో పూజింపబడతారు.ఇది ఆత్మార్థంగా ఎవరికి వారు ఇంటిలో చేసుకునే పూజ. ఇదే పద్ధతిని అవలంబిస్తూ నిర్మించిన ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. వీటిలో గర్భగుడిలో బ్రహ్మస్థానం(మధ్య)లో.. ఆగ్నేయం మొదలైన నాలుగు మూలాల్లో ఆయా దేవతా విగ్రహాలు ఉంటాయి. అందరికీ పరిచయం అయిన పంచాయతనాలు ప్రాసాదమండనం.. మరికొన్ని చోట్ల కనిపిస్తే.. హయశీర్షసంహిత, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణాలలో పంచాయతన దేవతలు విభిన్నంగా కనిపిస్తారు. బ్రహ్మాయతనం, చండాయతనం, రామపంచాయతనం, కృష్ణపంచాయతనం వంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రమైన అన్నవరం విష్ణు పంచాయతన దేవాలయం. తమిళనాడు కంచి కామాక్షీదేవి ఆలయం దేవీపంచాయతన ఆలయం. ఒక ఆయతనం(గర్భగుడి) నిర్మిస్తే స్వర్గఫలం, మూడు ఆలయాలతో బ్రహ్మలోకప్రాప్తి, ఐదు ఆలయాలతో శివలోకం, ఎనిమిది ఆలయాలతో విష్ణులోకం, తొమ్మిది, పన్నెండు, పదహారు ఆలయాలను నిర్మిస్తే ఇహంలో సుఖం, పరంలో మోక్షం కలుగుతుందని కపింజల సంహిత చెప్పింది. ఇక్కడ ఆలయం అంటే గర్భగుడి అని అర్థం చేసుకోవాలి. సృష్టికి మూలమైన పంచభూతస్వరూపాలనుండి ఒక్కో అంశాన్ని తీసుకుని నిర్మించిన పంచాయతన దేవతల్నీ.. వారిని ప్రతిష్ఠించిన పంచాయతన దేవాలయాల్ని దర్శించడం..పూజించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
‘రొమాన్స్‌లో శిక్షణ పొందాలి’
రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానని సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని చెప్పారు. తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం ‘తిమిరు పుడిచ్చవన్’(తెలుగులో రోషగాడు). నటి నివేదా పేతురాజ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గణేశా తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తిమిరు పుడిచ్చవన్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 6న తెరపైకి రానుంది. శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన హిజ్రా సింధుజా మాట్లాడుతూ తమిళ సినిమాలో ఒక హిజ్రాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం కల్పించిన విజయ్‌ఆంటోనికి, దర్శకుడు గణేశాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో తాను తొలి హిజ్రా ఎస్ఐ ప్రీతిక పాత్రను పోషించానని చెప్పింది. అందరూ భయపడి టచ్ చేయని ఒక విషయాన్ని ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఈ చిత్రంలో చూపించారన్నారు. హిజ్రాల జీవితంలోనే తిమిరు పుడిచ్చవన్ ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని సింధుజా పేర్కొంది. చిత్ర కథానాయకి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడే భయపెట్టారన్నారు. మోటార్‌బైక్ నడపాలి, చేపల బండి తొక్కాలి అంటూ భయపెట్టారని చెప్పారు. ఆయన చెప్పినట్లే మోటార్‌బైక్ నడపడం నేర్చుకుని.. చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకున్నానని తెలిపారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు దర్శకుడు తనతో చాలా విషయాలు చేయించినట్లు తెలిసిందన్నారు. నటిగా తన కేరీర్‌లోనే తిమిరు పుడిచ్చవన్ ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని నివేదా పేతురాజ్ వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత, కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఏక వృక్షం.. తోట అవ్వదు అన్నట్లు ఈ చిత్రంలో తన భాగం చాలా తక్కువేనని చెప్పారు. ఈ చిత్రం కోసం దర్శకుడు గణేశా ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఏ చిత్రానికైనా హీరో దర్శకుడేనని అన్నారు. తన గత రెండు చిత్రాలు వ్యాపార పరంగా బాగా రాలేదన్నారు. ఆర్థిక సమస్యల మధ్య ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు ఉండవని, అందువల్ల హీరోయిన్ నివేదా పేతురాజ్‌తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని చెప్పలేనని అన్నారు. ఈ చిత్రం తరువాత రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకుని అలాంటి సన్నివేశాల్లో నటిస్తానని అన్నారు. ఇకపోతే చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో దర్శకుడు కోరిక మేరకు దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు విజయ్‌ఆంటోని తెలిపారు. -
వ్యాధులు నయం చేసే పాలజ్ కర్ర గణే శుడు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి గ్రామం పాలజ్. ఈ చిన్న మారుమూల పల్లె 15 ఏళ్లుగా లక్షలాది మంది నోళ్లల్లో నానుతోంది. ఇక్కడి ప్రత్యేకతే ఈ కుగ్రామానికి ప్రతిఏటా లక్షలాదిమందిని రప్పిస్తోంది. ఎక్కడా లేని విధంగా వినాయక నవరాత్రుల్లో ఈ గ్రామస్తులు కర్ర గణేశుని ప్రతిష్ఠించి.. పూజించడమే ఈ పాలజ్ ప్రత్యేకత. ఇక్కడ కొలువుదీరే కర్రగణేశుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పేరొందాడు. పాలజ్‌లో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారి లేకపోయినా ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సమష్టిగా లక్షలాది భక్తులకు సౌకర్యాలను సమకూరుస్తుంటారు. గణేశ్ ఉత్సవాలన్ని రోజులూ ఈ ఊరి పేరు ఉత్తర తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతుంది. తెలంగాణ సరిహద్దు మండలమైన కుభీర్‌కు పక్కనే మహారాష్ట్రలోని బోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంటుంది. ఇక్కడ 1948లో నిర్మల్‌కు చెందిన నకాషీ కళాకారుడు పోలకొండ గుండాజీ వర్మ కర్రతో మలిచిన వినాయకుడికి ప్రతిష్ఠాపన చేసి ప్రతియేటా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి వినాయకచవితి సందర్భంగా కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి, చివరిరోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు. కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో మాత్రమే ఉంటుంది. ఊరంతా మంచం పట్టిందని... స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కర్రగణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకోసం నిర్మల్‌లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీవర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామపెద్దలు చెబుతారు. అలా అప్పటి నుంచి కర్ర గణేశుడిని మాత్రమే వినాయక ఉత్సవాల్లో కొలువడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఇక్కడ పూజలు చేసి, ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న నమ్మకం ఉంది. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా కర్రగణేశుడి మహిమ ఇతర గ్రామాలకు తెలిసింది. అలా ఊరూరా పాలజ్ ప్రత్యేకత విస్తరిస్తూ ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర అంతా వ్యాపించింది. సుందర రూపుడిగా కర్రతో చేసిందైనా.. నకాషీ కళాకారుడైన గుండాజీవర్మ చేతుల్లో సుందరంగా రూపుదిద్దుకున్నాడు ఇక్కడి లంబోదరుడు. అసలు.. కర్రతో ఇంత అందంగా విగ్రహాన్ని మలచవచ్చా.. అనేంత నునుపుగా గణపయ్యను తీర్చిదిద్దాడు. సింహాసనంపై ఆసీనుడైన గణపయ్యకు పెద్ద చెవులు ఉంటాయి. నాలుగుచేతుల వాడిగా.. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకోచేతిలో లడ్డులతోపాటు కుడిచేత్తో ఆశీర్వదిస్తుంటాడు. కలిసికట్టుగా లక్షల్లో తరలివచ్చే భక్తులతో పాలజ్ ఆలయానికి ఆదాయమూ లక్షల్లోనే వస్తోంది. ఈ గ్రామస్తులు కలిసికట్టుగా కర్రగణేశుడి సేవలో పాల్గొంటారు. గత ఏడాది 11 రోజుల ఉత్సవాల్లో ఆలయానికి రూ. 80 లక్షల ఆదాయం వచ్చింది. రూ. 11 లక్షల ఖర్చులు పోను రూ. 69 లక్షల కానుకలు మిగిలాయి. పదేళ్ల కింద సాదాసీదాగా ఉండే పాలజ్ ఆలయం ఇప్పుడు సరికొత్త హంగులతో ఇరుగుపొరుగు జిల్లాలవారినీ ఆకట్టుకుంటోంది. 2004 ప్రాంతంలో ఆలయ కమిటీ వద్ద మొత్తానికి, గ్రామస్తులు చందాలు పోగు చేసి సేకరించిన మరో రూ. 2 లక్షలు కలిపి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందంగా నిర్మించిన ఆలయం పూర్తయిన తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామస్తులే కోటి రూపాయలతో అన్నదాన సత్రాలు, స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకూ ఇక్కడి నుంచి శుద్ధ నీరు అందిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చారు. పాలజ్ వెళ్లడం ఇలా... హైదరాబాద్ నుంచి వచ్చేవారు నిజామాబాద్, బాసరల మీదుగా భైంసా చేరుకుంటే దూరభారం తగ్గుతుంది. నిర్మల్ మీదుగా వచ్చేవాళ్లు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్ ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. వాహనాల కోసం ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. – పుప్పాల హన్మాండ్లు సాక్షి, భైంసా, నిర్మల్ జిల్లా అన్ని ఏర్పాట్లు చేశాం.. పాలజ్‌లో భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం. బారికేడ్లు, తాగునీరు, తీర్థప్రసాదాలు అందిస్తున్నాం. వాహనాలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భక్తులకు అల్పాహారాన్నీ అందిస్తాం. – గంధం గణేశ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు -
చిన్న రిక్వెస్ట్ బాస్!
మా కోరికలేవీ పెద్దవి కావు బాస్. చిన్న చిన్న విఘ్నాలు తొలగిస్తే చాలు. ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఉండ్రాళ్లు పెడుతూ తరిస్తాం. విపత్తులు, ఉత్పాతాలు, విలయాలు... వాటి పని మీరే చూసుకుంటారు. చికాకులు, చిర్రుబుర్రులు, చివాట్లు, చిక్కులు... ఇవి మా ప్రాబ్లమ్స్. ఇవే విఘ్నాలు. నిన్ను దేవుడూ అని పిలుస్తూ ఎక్కడో దూరంగా ఉంచాలని లేదు. మనసుకు దగ్గరగా ఉంటావ్... బాగా క్లోజ్‌గా అనిపిస్తావ్. ఏదైనా చెప్పేసుకోవచ్చు... అన్నంత క్లోజ్‌గా అనిపిస్తావ్ బాస్. మా విన్నపం మన్నించండి. కొంచెం కన్సిడర్ చేయండి బాస్. ఇది ఓ ఫ్యామిలీకి కంబైన్డ్‌గా వచ్చిన కల. వినాయకుణ్ణి ఏం కోరుకున్నారో సరదాగా చదవండి. పత్రితో నీకు పూజలు చేస్తాం. పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు. గొడుగు నీకు అమరుస్తాం. ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు. ఉండ్రాళ్లు సమర్పిస్తాం. ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు. అత్తగారు ఊరి నుంచి ఆవకాయతో దిగుతుంది. తెల్లారి లేచే సరికి కొడుకు కిచెన్‌లో కేరెట్ తరుగుతుంటాడు. ‘అదేమిటే అమ్మాయ్. అబ్బాయి చేత కూరగాయలు తరిగిస్తున్నావ్. రేపటి నుంచి విమ్ సోప్ చేతిలో పెట్టి అంట్ల ముందు కూర్చోబెడతావా ఏంటి? వాడు ఉద్యోగానికి వెళ్లొద్దూ?’ అంటుంది అత్తగారూ. ‘నేనూ బేవార్సుగా లేను కదా అత్తయ్యా. నేనూ జాబ్‌కు వెళ్లాలి కదా. ఇంట్లో ఆ మాత్రం సాయం చేయకపోతే పనులెలా అవుతాయ్’ అంటుంది కోడలు. అక్కడి నుంచి ఆ ఇంట్లో శాంతికి విఘ్నం. అలా కాకుండా అత్తగారు కిచెన్‌లో కష్టపడుతున్న కోడలిని చూసి ‘ఏరా అబ్బాయ్. అమ్మాయి ఒక్కత్తే ఎంత పనని చేసుకుంటుంది. కూర్చుని పేపర్ చదువుకోకపోతే ఆ కేరెట్ కాస్త కట్ చేసి పెట్టరాదూ’ అనంటే ఎంత బాగుంటుంది.నువ్వు స్నానానికి వెళ్లమ్మాయ్. ఈలోపు నేను కేరేజీ కట్టేస్తానుగా’ అంటే ఎంత బాగుంటుంది. ‘సాయంత్రం ఉరుకులు పరుగుల మీద వచ్చేయకండి. కలిసి సినిమాకెళ్లి హోటల్లో ఏదైనా తినేసి రండి. నాదేముంది ఈ పూట శనివారం. నేను ఉపవాసం. వస్తూ నాకేదైనా లైట్‌గా పట్రండి’ అంటే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. పిల్లలు పిడుగులు. తండ్రి ఆఫీసుకు వీరభక్తుడు. ఆదివారం పూటైనా కృష్ణకాంత్ పార్క్‌కు వెళ్లి కోన్ ఐస్‌క్రీమ్ తినిపించు డాడీ’ అని వాళ్ల మారాము. మా బాస్ కొంటె కృష్ణుడు. పెండింగ్ వర్క్ పూర్తి చేయకపోతే మెమోతో ముద్దిస్తాడు’ అని తండ్రి హైరానా. పిల్లల అలక. తండ్రి ఆగ్రహం. తల్లి పీచుపీచు. ఇక ఆ ఇంటి మనశ్శాంతికి విఘ్నం. అలా కాకుండా ఆ బాస్‌ను ఏ అండమానో చెక్కేసేలా చేస్తే ఎంత బాగుంటుంది. డాడీగారు జాంజామ్మని సాయంత్రానికే ఇల్లు చేరుకుని బైక్ మీద ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని జి.వి.కె మాల్లో మాలామాల్ చేయిస్తే ఎంత బాగుంటుంది. మళ్లీ రెండు వారాల దాకా అడక్కుండా ఉండేలా ఫన్ జోన్లో ఆడించి, ఫుడ్ కోర్ట్‌లో తినిపించి, బిగ్ స్క్రీన్ మీద మహేశ్‌బాబు మాస్ మూవీ చూపించి తెస్తే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. భర్తగారికి ఊరుకూరికే ఆకలేస్తుంటుంది. భార్యగారికి చీటికి మాటికి నిద్ర కమ్ముకొస్తోంది. షుగరా అని భర్తకు డౌటు. థైరాయిడ్డేమో అని భార్య నలుగుబాటు.శనివారం ఎర్లీమార్నింగ్ ల్యాబ్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పటి నుంచి రిపోర్ట్సు వచ్చేంత వరకూ అనుక్షణంఆత్మశాంతికి విఘ్నం. ఆనందానికి విఘ్నం. ఆలోచనకు విఘ్నం.అలా కాకుండా అది షుగరూ కాదూ పాడూ కాదు మనిషి గుమ్మటంలా ఉన్నావ్ అని రిపోర్టు వస్తే? థైరాయిడ్డు లేదూ ఏమీ లేదు మనిషి దంగల్ లేడీలా ఉందని కౌంట్ తేల్చి చెప్తే?ఎంత హాయిగా ఉంటుంది. మరెంత హొయలుగా అనిపిస్తుంది. వానాకాలంలో జలుబు, ఎండాకాలంలో కాసిన్ని చెమటకాయలు, చలికాలంలో చుండ్రు తప్ప జీవితంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం రాకుండా ఉంటే? అలా అని కరుణించు స్వామీ. ఈ లైఫ్‌ను హాస్పిటల్ మెట్లక్కనీయకుండా ఆశీర్వదించు స్వామీ. జూబ్లీహిల్స్‌లో కలిగిన వారి కల్యాణానికి వెళ్లాం. బెంగుళూరు నుంచి వచ్చిన చిట్టిరోజాలతో కట్టిన మండపం. ఒక సెల్ఫీ. ఒక మూలగా మద్రాస్ అయ్యంగార్ వయొలిన్ కన్సర్ట్. ఒక సెల్ఫీ. ఆహూతులలో సన్నాసన్నని తమన్నా. ఒక సెల్ఫీ. బఫే దగ్గర డబుల్ బిరియానీతో ఒక సెల్ఫీ. ఆలూ అల్బత్తాతో ఒక సెల్ఫీ. ఇవన్నీ తీసుకుని ఇంటి కొచ్చి ‘ఫ్యామిలీ గ్రూప్’లో వాట్సప్ చేసి వాట్ యార్ అని పోజు కొడదామంటే వైఫై పని చేయకపోతే? దేర్ ఈజ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని మెసేజ్ చూపిస్తుంటే? ఆ యొక్క అతిశయానికి ఆ యొక్క ప్రదర్శనానందానికి ఎంతటి విఘాతం. మరెంతటి విఘ్నం. అలా కాకుండా ఆల్వేస్ వైఫై పని చేసేలా ఉంటే? నట్టింట నెట్ కళకళలాడుతుంటే?అలా అని హండ్రెడ్ ఎంబిపిఎస్తో ఆశీర్వదించు స్వామీ. అబ్బాయికి మీసం కర్వ్ తిరిగే ఏజ్ వచ్చింది. అమ్మాయికి ఊరికూరికే నవ్వొచ్చే ప్రాయం వచ్చింది. అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో తెలియదు.అమ్మాయిని ఎవరు తనవైపు తిరిగేలా చేసుకుంటారో తెలియదు. అది కాదూ..’ అని తల్లి ఏదో చెప్పబోతుంది. నీకేం తెలియదు ఊర్కో’ అని విసురు.అది కాదురా’ అని తండ్రి ఏదో అనబోతాడు. నస ఆపు డాడీ’ అని రుసురు.ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాల్సి వున్నా అది హద్దు అదుపుల్లో ఆరోగ్యకరమైన అంచుల్లో లేకపోతే మరి ఆ తల్లిదండ్రులకు ఎంతటి ఘాతం. మరెంత విఘాతం.అలా కాకుండా పిల్లలు తమ మంచి చెడ్డలను తల్లిదండ్రులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. వారిని తమ జర్నీలో తోడుగా ఉంచుకుంటే మరెంత అందంగా ఉంటుంది. అలా అని ప్రతి సంతానానికీ వారి కన్నవారికీ వెలుగు పంచు స్వామీ.నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ. ఒక భర్తగారికి వాటర్ అలెర్జీ. అతను వైన్ షాప్‌లో దొరికేదానినే వాటర్ అనుకుని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక హజ్బెండ్ గారికి ఇల్లంటే రోత. వారు పేకాట క్లబ్బునే తన ఆవాసం చేసుకుంటూ ఉంటారు. ఒక మొగుడు మహాశయునికి కరెన్సీయే ఆక్సిజన్. దాని వేటలో ఇంటికే రారు. ఒక పురుషుడు వేళ్లతో వాట్సప్‌లో ఎవరెవరితోనో మాట్లాడటం తప్ప ఇంట్లో నోరు తెరవడు. ఒక మగ అతనికి నిలువెల్లా అనుమానం. మరో మగపురుగుకి చేయి దురుసు జాస్తి.ఏ ఇంటికైనా ఇంతకు మించిన విఘ్నం ఉంటుందా?ఆ ఇంటి ఇల్లాళ్లకు పిల్లలకు అంతకు మించిన విఘాతం ఉంటుందా?సరదాలు వ్యసనాలుగా మారని, విసుగులు ఉత్పాతాలుగా రూపాంతరం చెందని, అసంతృప్తులు ఆజ్యంగా మారి పైకప్పులను తగలబెట్టని ఇళ్లు కావాలి. దంపతులు మార్నింగ్ పూట కలిసి చిర్నవ్వుతో టీ సేవించే, పిల్లలు నవ్వుకుంటూ స్కూలు విషయాలు చెబుతూ ఒడిలో కూర్చునే, అమ్మానాన్నలూ తరుచూ వచ్చిపోయే లేదంటే పిల్లల దగ్గరే ఉండిపోయే, నెలకోసారైనా ఆత్మీయులు చేయి కడిగే, ఆనందానికి తప్ప దుఃఖానికి చెమర్చని కళ్లు ఉండే, ఇరుగు పొరుగులతో సామరస్యం ఉండే, చక్కని వంట కుదిరే, పండే పక్క కుదిరే, తృప్తిగా నిదుర పట్టే, నిర్మలమైన వేకువ తట్టి లేపే ఇళ్లు ఉంటే ఎంత బాగుంటుంది?అలాంటి ఇళ్లను కటాక్షించు స్వామీ.బయట జోళ్ళు, ఇంట్లో వెచ్చాలు, అవసరాలు తీర్చగల డబ్బు ఉండే ఏటీఎం కార్డులు, బాల్కనీలో పూలు పూసే కుండీలు, అవసరానికి సాయం చేసే చేతులు, దేవుని ఆశీర్వాదాలు, చెదరని దరహాసాలు... ఇవి ఉండే ఇళ్లను ప్రసాదించు స్వామీ. పత్రితో నీకు పూజలు చేస్తాం.పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.గొడుగు నీకు అమరుస్తాం.ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు.ఉండ్రాళ్లు సమర్పిస్తాం.ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు.నిన్ను చల్లగా నిమజ్జనం చేస్తాం.సకల అసంతృప్తులను అసమానతలను అమానవీయ ఆలోచనలను ఏటిలో కలుపు.అస్తు దేవా. తథాస్తు గణేశా. – కె -
వినాయకుడి చేతిలోని 25 కేజీల లడ్డూ మాయం
హైదరాబాద్: దేవుడి మండపంలో దొంగలు పడ్డారు. అన్నీ వదిలేసి ఏకంగా గణపతి చేతిలోని 25 కేజీల లడ్డూను ఎత్తుకెళ్లారు! హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటుచేశారు. వినాయకుడి చేతిలో 25 కేజీల భారీ లడ్డూను ఉంచారు. బుధవారం రాత్రి ఆ లడ్డూ మాయమైంది. టిఫిన్ సెంటర్ నిర్వాహకుడైన రాకేశ్ ఈ విషయాన్ని మండపం వద్ద కాపలా ఉండే వ్యక్తికి చెప్పాడు. కాగా, దొంగతనం జరిగిన రోజు రాత్రి 2:30 గంటల సమయంలో రాకేశ్ మండపం దగ్గర్లో తచ్చాడాడని మరో యువకుడు చెప్పడంతో నిర్వాహకులు రాకేశ్ ను నిలదీశారు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. కుషాయిగూడ పోలీసులు అనుమానితుడు రాకేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాకేశ్ ను పోలీసులు పట్టుకుపోయారన్న విషయం తెలుసుకున్న కాలనీ వాసులు స్టేషన్ వద్దకు చేరుకుని.. రాకేశ్ అలాంటివాడు కాదని, కష్టపడి పనిచేసుకునే రకమని చెప్పారు. కాలనీ వాసులు ఎంత చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం రాకేశ్ ను వదలిలిపెట్టలేదు. విచారణ పూర్తయిన తర్వాతే పంపిస్తామని చెప్పారు. లడ్డూ దొంగ ఎవరనేది తెలియాల్సిఉంది. -
ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు
హ్యూమర్ ప్లస్ వినాయక యాత్రా స్పెషల్ ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు.‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ కైలాసంలో చలి ఎక్కువై వినాయకుడికి భూలోకం చూడాలని కోరిక పుట్టింది. లైవ్ వెహికిల్ మూషికానికి వాట్సప్ మెసేజ్ పెట్టాడు.‘‘ఎర్న్డ్ లీవ్‌లో ఉన్నాను’’ అని రిప్లయ్ వచ్చింది. ‘‘లీవ్ క్యాన్సిల్. దిసీజ్ గణేష్ ఆర్డర్’’ ‘‘ఆర్డర్లు ఎక్కువైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. మా వాహన సంఘం అధ్యక్షుడు ఆదిశేషుడు గారికి కంప్లయింట్ చేస్తా. ఆయన పడగ విప్పి కోర్టులో వాదిస్తాడు.’’ ‘‘వైకుంఠ చట్టాలు కైలాసంలో పనికిరావు. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’’. ‘‘నేను చీమని కాను ఎలకని. అయినా నందీశ్వరుడే ఈమధ్య రంకెలేసి శివయ్య మీద స్ట్రయిక్ చేశాడు. ఈశ్వరుడంతటివాడే నడవలేక టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. కింద మంచు, నెత్తిన గంగ... పెద్దాయనే తడిసి ముద్దవుతున్నాడు. ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు. ‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్‌కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ ‘‘కైలాసానికి క్యాబ్ వస్తుందా?’’ ‘‘లాభం వస్తుందనుకుంటే నరకానికి కూడా వచ్చి యముడి దున్నపోతుని కూడా రిప్లేస్ చేస్తారు. గ్లోబలైజేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తప్ప ఇక దేనికీ అకౌంటబులిటీ వుండదు.’’ కుబేరుడి దగ్గర రోజువారీ వడ్డీకి అప్పు తీసుకుని క్యాబ్ బుక్ చేశాడు వినాయకుడు. ‘‘ఇన్‌టైంలో అప్పు తీర్చకపోతే తొండం, ఏకదంతం రెండూ లాక్కెళతా’’ అని హెచ్చరించి మరీ ఇచ్చాడు కుబేరుడు. ఎలుక ఫుల్ సూట్లో వినాయకుడి దగ్గర ప్రత్యక్షమైంది. ‘‘ఈ డ్రస్సేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు వినాయకుడు. ‘‘డ్రస్సుని బట్టి మన అడ్రస్ని అంచనా వేస్తారు. సూట్‌ని, సూట్‌కేస్‌ని గౌరవించే కాలమిది. గ్రాస్ గురించి తప్ప, మీకు గ్రాస్ రూట్స్ తెలియవు కదా’’ క్యాబ్వాడు వచ్చాడు. ‘‘ఇంత తొందరగా ఎలా వచ్చావ్?’’ అడిగాడు వినాయకుడు. ‘‘పక్కనే వైకుంఠంలో డ్రాప్ వుండింది సార్. విష్ణువు గారిని తిరుపతి నుంచి పికప్ చేసుకొచ్చా’’ చెప్పాడు డ్రయివర్.‘‘గరుడ సర్వీస్ వుందిగా?’’ ‘‘పొల్యూషన్ ఎక్కువై ముక్కుల్లో ఎలర్జీ వచ్చింది. పొడుగాటి ముక్కులుంటే ఇదే సమస్య’’ చెప్పింది మూషికం. ‘‘దేవుళ్ళకి కూడా సమస్యలొస్తాయా?’’ అడిగాడు వినాయకుడు. ‘‘మనుషులు తమ సమస్యలు చెప్పుకుని చెప్పుకుని దేవుళ్ళని కూడా సమస్యలపాలు చేశారు. ఈమధ్య బ్రహ్మకి తలపోటు ఎక్కువై ఒక తలకి అల్జిమర్స్ వ్యాధి వచ్చింది. దాంతో ఆయన మనుషుల్ని జంతువుల్ని కలగలిపి తయారుచేసేశాడు. కాంబినేషన్ మిస్ కావడం వల్ల మనిషే సాటి మనిషిని జంతువులాగా పీక్కు తింటున్నాడు’’ వివరించింది మూషికం. ‘‘అయినా అందరూ ఆయన్ని చూడడానికి తిరుపతికెళితే, విష్ణువు ఎవర్ని చూడడానికి తిరుపతికెళ్లాడు’’? ‘‘సార్‌ని అక్కడెవరూ గుర్తుపట్టలేదు. ఆయన విగ్రహాన్ని చూడడానికి తోసుకుని తొక్కుకున్నారు గానీ, సాక్షాత్తూ ఆయనే ఎదురై పలకరించినా ఎవరూ పట్టించుకోలేదు. హర్టయ్యి వెంటనే క్యాబ్ ఎక్కేశారు’’ చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ‘‘వాళ్ళంతే, మీ బొమ్మ కనిపిస్తే దండం పెడతారు. మీరే కనిపిస్తే వేషం అనుకుంటారు’’ చెప్పింది మూషికం. జిపిఎస్ ప్రకారం భూలోకంలో దింపాడు డ్రైవర్. ఎక్కడ చూసినా తన విగ్రహాలే కనిపించేసరికి వినాయకుడికి సంతోషమేసింది. ఇంతలో జనం పాలగ్లాసులతో పోలోమంటూ పరిగెత్తుతూ కనిపించారు. ‘‘వినాయకుడి విగ్రహం పాలు తాగుతూ వుందని పరిగెత్తుతున్నారు. మీరు అడిగి చూడండి. ఒక చుక్క కూడా ఇవ్వరు’’ చెప్పింది మూషికం. ఒకరిద్దరిని ఆపి వినాయకుడు అడిగి చూశాడు. పట్టించుకోకుండా విగ్రహాల వైపు పారిపోయారు. వినాయకుడు చిన్నబుచ్చుకున్నాడు. ‘‘దేవుడు రాయే తప్ప మనిషి కాదని వాళ్ళ నమ్మకం’’ చెప్పింది మూషికం. ఇంతలో ఒక పిల్లి కనిపించి ఎలుకతో షేక్‌హ్యాండ్ తీసుకుని వెళ్లింది. ‘‘ప్రపంచీకరణ అంటే శత్రువులు చేతులు కలుపుకోవడం, మిత్రులు కత్తులు దూసుకోవడమే. పిల్లికి ఎలుకకి మధ్య అమెరికా వాళ్లు స్నేహ ఒడంబడికని కుదిర్చారు’’ చెప్పింది మూషికం. ‘‘అమెరికా అంటే?’’ ‘‘మీకు తెలియకుండా మిమ్మల్ని అమ్మడం.’’ ‘‘నీకింత నాలెడ్జి ఎలా వచ్చింది?’’ ‘‘క్యాట్ కోర్స్ చదివాను’’ ఒక రాజకీయ నాయకుడు కనిపించి వినాయకుడికి దండం పెట్టాడు. ‘‘షూటర్ కంటే నేను ఓటరుకే ఎక్కువ భయపడతా. మీ ఓటు నాకే’’ అన్నాడు. ‘‘నేను వినాయకుణ్ణి’’ ‘‘నేను నాయకుడ్ని. వి అంటే మీ ఇంటిపేరా?’’ ‘‘వీడు అజ్ఞానిలాగున్నాడు’’ మూషికంతో అన్నాడు వినాయకుడు. ‘‘అందుకే రాజకీయాల్లో ఉన్నాడు’’ ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతూ కనిపించింది. ‘‘మూషికా, నాకు ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని కోరిక’’ ‘‘సినిమాల్లోకంటే బయటే జనం బాగా నటిస్తున్నారు. అలా నడుస్తూ వెళితే బోలెడు సినిమాలు చూడొచ్చు.’’ ‘‘వినాయకుడు నేరుగా డెరైక్టర్ దగ్గరికెళ్లి వేషమడిగాడు. ‘‘మనుషులంతా మారువేషాలతో జీవిస్తున్న ఈరోజుల్లో వేషం అడిగావంటే నీకు ఆవేశం ఎక్కువని అర్థమైంది. మేకప్ లేకుండా వేస్తే వేషమిస్తా’’ అన్నాడు డెరైక్టర్. ‘‘ఇది మేకప్ కాదు, నాచురల్’’ ‘‘నాచురాలిటీ, తెలుగు సినిమా రెండూ వేర్వేరు విషయాలు. మాకింకా అంత మెచ్యూరిటీ రాలేదు.’’ వినాయకుడు, మూషికం నడుస్తూ వెళుతూ వుంటే ఒకాయన లాప్టాప్ చూస్తూ తనలో తాను గొణుక్కుంటూ కనిపించాడు ‘‘ఆయన జోలికెళ్లకండి. అతను కవి. కాశ్మీర్లో బుల్లెట్లు పెల్లెట్లు గురితప్పుతాయేమో కానీ ఆయన అక్షరాలు విసిరితే గురి తప్పవు. గరళాన్ని మింగిన మీ డాడీ శివయ్యే, కవి కనిపిస్తే చాలు పులి చర్మం సర్దుకుని, త్రిశూలం చంకన పెట్టుకుని నందికి కూడా చెప్పకుండా పారిపోతాడు. పార్వతి మేడం గూగుల్ సెర్చ్‌లో వెతికివెతికి పట్టుకుంటారు’’ వినాయకుడి చెవులు వణికాయి. దారిలో మొగుడు పెళ్లాం గొడవపడుతూ కనిపించారు. ‘‘సంసారమనేది గొడవల పడవ. మునిగినప్పుడు తేలిందనుకుంటాం. తేలినప్పుడు మునిగిందనుకుంటాం’’ అన్నాడు వినాయకుడు. ‘‘పంచ్ వేశారా స్వామీ’’ అడిగింది ఆశ్చర్యంగా మూషికం. ‘‘చిన్నప్పటినుంచి పంచె కట్టినవాణ్ణి. ఆమాత్రం పంచ్ వేయలేనా?’’ ఇంతలో ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు. అక్కడ్నుంచి ఇద్దరు పారిపోయి క్యాబ్ బుక్ చేసుకుని కైలాసం చేరారు. కుబేరుడి రికవరీ ఏజెంట్లు వచ్చి వడ్డీ కట్టమన్నారు. ‘‘ఓనర్‌కి మించిన తెలివితేటలు డ్రైవర్‌కి వుంటే డేంజర్. వడ్డీ కట్టేవరకూ ష్యూరిటీగా మూషికాన్ని తీసుకెళ్ళండి’’ అన్నాడు వినాయకుడు. ‘‘అన్యాయం’’ అని అరిచింది ఎలుక. ‘‘జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ డైలాగులు చెప్పకూడదు. ఏనుగు ముందు ఎలుక ఎలుకలాగే వుండాలి.’’ ‘‘ఒక్క ట్రిప్పుకే మీకు భూలోకం బుద్ధులు వచ్చాయి’’ అని ఆక్రోశించింది మూషికం. - జి.ఆర్. మహర్షి -
ఎకో దంతుడికి జై
వాడవాడలా కొలువుదీరనున్న గణనాథులు తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు పా్లస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జలవనరులకు హాని మట్టి వినాయకులే మేలంటున్న పర్యావరణవేత్తలు పోచమ్మమైదాన్ విఘ్నాలు తొలగించే వినాయకుడు.. పార్వతీపుత్రుడు.. రేపు వాడవాడలా కొలువుదీరనున్నాడు. కోరిన వారి కోర్కెలు తీర్చి.. మహా నాయకుడిగా పూజలందుకోనున్నాడు. అయితే భక్తి శ్రద్ధలతో కొలిచే వినాయకుడి విగ్రహాల తయారీలో హానికరమైన రసాయన రంగుల వాడకం ఎక్కువవుతుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. గణనాథుల నిమజ్జనం తర్వాత చెరువులన్నీ టన్నుల కొద్దీ కరగని వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు, నీటి వనరులు పాడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యానికి ఏ మాత్రం హాని కలిగించకుండా ఉండే ఎకో దంతుడి విగ్రహాలనే పూజించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.వినాయకచవితి పూజలో చెరువు మట్టితో తయారుచేసిన విఘ్నేశ్వరుడినే పూజించాలని పండితులు చెబుతుంటారు. పంచభూతాల్లో ఒకటైన మట్టితో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఫలితం ఉంటుందని వారి అభిప్రాయం. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, ఇతర సుద్దలతో చేసిన ప్రతిమలతో ప్రాణప్రతిష్ట చేసినా ప్రయోజనం ఉండదని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. కాగా, ఆలయాల్లోనూ స్వయం భూదేవత ఆలయాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మట్టితో చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమకు కూడా విశేష శక్తి ఉంటుందనే విషయం అందరు గ్రహించాలని వారు సూచిస్తున్నారు. మట్టితో ప్రకృతికి›మేలు చెరువులు, కాల్వల్లో దొరికే బంక మట్టి వినాయకుడి ప్రతిమ తయారీకి నాణ్యంగా ఉంటుంది. ఆ మట్టిని తీసుకొచ్చి ప్రతిమను తయారు చేసి పూజించి, తిరిగి చెరువులు, కాల్వల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటిలో ఔషధగుణాలు పెంపొందుతాయి. ప్రతిమ నీటిలో త్వరగా కరిగి పోవడంతో ఎలాంటి హానీ ఉండదు. మట్టి విగ్రహాలను పూజించడం మన సంప్రదాయ పూజ విధానం. పా్లస్టర్ ఆఫ్ పారిస్‌తో ముప్పు దేవుడికి పూజ చేస్తున్నామంటే మన కు, మన చుట్టూ ఉన్నవారికి మేలు జరగాలనేదే ప్రధాన సంకల్పం. దీని ని ప్రస్తుతం ఎవరూ పాటించడం లేదు. ప్రధానంగా గణపతి నవరాత్రుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇను ముతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూజల అనంతరం సమీపంలోని చెరువుల్లో వాటిని నిమజ్జనం చేస్తుండడంతో రసాయన పదార్థాలు నీటిలో కరగడం లేదు. రంగులు ప్ర మాదకరంగా మారి నీటిని విషతుల్యం చేస్తున్నాయి. రసాయనాలు కలిసిన నీటిని ఎంత ఫిల్టర్ చేసిన విషనమూనాలు అలాగే ఉంటాయ ని పర్యావరణవేత్తలు చెబుతున్నా రు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల్లో లెడ్, క్యాడ్మియం, కాపర్, క్రోమి యం, మెర్కురీ వంటి హానికారక రసాయనాలు ఉంటున్నాయి. వీటిని నీటిలో ఉన్న చేపలు తినడం ద్వారా కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉం దని వైద్యులు చెబుతున్నారు. -
రూ.2 లక్షల అగరుబత్తి
సాక్షి,హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి ఏటా దూపం చూపించే అగరుబత్తి ఇదే.. ఈ ఏడాది కూడా అంబికా దర్బార్ బత్తి కంపెనీ దీనిని సమర్పిస్తోంది. 30 మంది సభ్యుల బృందం నెల రోజులు శ్రమించి తయారీ చేసింది. రోజుకు అడుగు చొప్పున కాలుతూ ఇది ఆది దేవుడికి ధూపం వెదజల్లుతుంది. అగరుబత్తి.. ఎత్తు : 10 అడుగులు ఖర్చు : రూ.2 లక్షలు -
31 రకాల పప్పులతో..
అబిడ్స్: ప్రతి సంవత్సరం వెరైటీ గణనాథులను ప్రతిష్టిస్తున్న గోషామహల్‌లోని హిందీనగర్ బాల యువమండలి ఈ సంవత్సరం వినూత్న తరహాలో 31 రకాల పప్పుదినుసులతో గణనాథుడిని తీర్చిదిద్దారు. గత 35 రోజులుగా యువ మండలి యువకులు పప్పులు, ఇతర ఆహార ధాన్యాలతో 8.7 అడుగుల విఘ్నేశ్వరునికి రూపకల్పన చేశారు. గతంలో అమెరికన్ డైమండ్స్‌తో గణనాధున్ని నెలకొల్పగా... ఈ సంవత్సరం కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు, ఎర్రపప్పు, శెనగలు, రాజ్మా పప్పు, జొన్నలు, కాబూద్ చెన, పల్లీలతో పాటు పలు రకాల ఆహార ధాన్యాలతో విఘ్నేశ్వరుడిని తయారుచేశారు. యువ మండలి అధ్యక్షులు ఆకాష్ అగర్వాల్, మండలి యువకులు హితేష్ అగర్వాల్, కృష్ణసేన్, సంతోష్‌కుమార్, శుభం అగర్వాల్, యశ్ అగర్వాల్, శుభంలు ఈ గణనాధున్ని రేయింబవళ్లు శ్రమించి తీర్చిదిద్దారు. -
వినాయకుడి విగ్రహం చోరీ
నల్లబెల్లి : పురాతన కాలం నాటి వినాయకుడి విగ్రహం చోరీకి గురైన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసులు, గ్రా మస్తుల కథనం ప్రకారం.. గుండ్లపహాడ్ గ్రా మానికి చెందిన పడాల పురుషోత్తమరావు ఇం టి వెనుకాల వ్యవసాయ భూమిలో 8 ఏళ్ల క్రి తం వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన కాలం నాటి వినాయక విగ్రహం బయటపడిం ది. గ్రామస్తుల నిర్ణయం మేరకు పురుషోత్తమరావు వ్యవసాయ భూమిలోనే విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి స్థానికులతోపాటు పలు గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం గ్రామస్తులంతా సమావేశమై ఈ విగ్రహాన్ని గ్రామంలోని శివాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పున ప్రతిషా్ఠపన చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం పురుషోత్తమరావు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం తిరిగి గుండ్లపహాడ్ చేరుకున్నాడు. బుధవారం పూజలు చేసేందుకు దేవాలయానికి వెళ్లగా వినాయక విగ్రహం కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. సర్పం చ్ పడాల భాగ్యశ్రీరమణరావు, గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై మేరుగు రాజమౌళి తెలిపారు. -
విగ్రహాం 10 అడుగులకు మించరాదు
వినాయక విగ్రహాల ఎత్తు పది అడుగులకు మించి ఉండరాదని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఫిలింనగర్ సెక్టారు పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకుల సమావేశం అవుట్‌పోస్టు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో పనుల సందర్భంగా విగ్రహాల ఎత్తును నిర్దేశించిన ఎత్తులోనే ఏర్పాటుచేయాలని, లారీలో ఎక్కించిన తరువాత విగ్రహం, లారీ ఎత్తు 20 అడుగులకు మించరాదని చెప్పారు. మండపాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సిఐ శ్రీనివాస్, సెక్టారు ఎస్సై గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడుగో ఆది దేవుడు..
సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే.. ఎంత ఎత్తులో ఉంటాడు.. ఎప్పుడు దర్శనమిస్తాడని చర్చించుకుంటారు. ఇదిగో ఈ చిత్రం ఉన్నది ఆ వినాయాకుడే. కర్రల బందిఖానాలో ఉన్నట్టు కనిపిస్తూన్నా తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.. ఇక దర్శనమే తరువాయి. బుధవారం ఆదిదేవుడికి కళాకారులు తుది మెరుగులు దిద్దుదున్నారు. -
గ్రీన్ గణేషా
సాక్షి, సిటీబ్యూరో: భక్త కోటి ఇష్టదైవం...బొజ్జ గణపయ్య ఈ ఏడాది పర్యావరణ ప్రియమైన రంగులతో కనువిందు చేసేందుకు ముస్తాబవుతున్నాడు. పూలు, పండ్లు, దుంపల నుంచి రూపొందించే ఆకర్షణీయమైన...సహజసిద్ధమైన రంగులతో కొలువుదీరనున్నాడు. రెండు లక్షలకు పైగా చిన్న విగ్రహాలకు, మరో 10 వేల పెద్ద విగ్రహాలకు సహజమైన రంగులు అద్దేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారీ ప్రాజెక్టును చేపట్టింది. కాలుష్యనియంత్రణ మండలి సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు మొదటి వారం నాటికి 30 టన్నుల సహజ రంగులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటి తయారీ..ప్రజల్లో చైతన్యం...పీసీబీ ఏర్పాట్లు తదితర అంశాలు నేటి సండే స్పెషల్‌లో... ప్రమాదకరమైన రసాయనాల నుంచి జలవనరులను, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో వ్యవసాయ వర్సిటీలో ఈసారి గణపతి విగ్రహాలకు ఉపయోగించే సహజ రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మహోద్యమంలో మట్టి విగ్రహాలను రూపొందించే సంస్థలు, వ్యక్తులు, భాగస్వాములు కానున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్, సింథటిక్ రంగుల స్థానంలో సహజమైన రంగుల వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, స్వచ్చందసంస్థలు కూడా భాగం పంచుకోనున్నాయి. ఇప్పటి వరకు కేవలం మట్టి విగ్రహాలను రూపొందించి ప్రజలకు అందజేసిన కాలుష్య నియంత్రణ మండలి ఈసారి వాటిని సహజమైన రంగులతో రూపొందించి పంపిణీ చేయనుంది. మరోవైపు ప్రజలు తాము స్వయంగా రూపొందించే మట్టి విగ్రహాలకు సహజ రంగులను అద్దేందుకు కూడా తక్కువ ధరల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు. అందుబాటు ధరల్లో సహజ రంగులు.... నగరంలోని అన్ని ప్రాంతాల్లో సహజమైన రంగులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. విగ్రహాలను తయారు చేసే కళాకారులకు ఇప్పటికే అవగాహన కల్పించిన కాలుష్య నియంత్రణ మండలి...ప్రజల్లో సైతం అవగాహనను పెంపొందించేందుకు సన్నద్ధమవుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు, సైఫాబాద్‌లోని హోంసైన్స్ కళాశాలలోనూ, ఎంపిక చేసిన హస్తకళా కేంద్రాలు, సూపర్ మార్కెట్లలోనూ ఈ రంగులను విక్రయిస్తారు. ఒక లీటర్ రంగు ధర రూ.200 నుంచి రూ.300ల వరకు ఉంటుంది. బేసిక్ కోసం వినియోగించే తెలుపు రంగును రూ.100 కు లీటర్ చొప్పున విక్రయిస్తారు. ధూల్‌పేట్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తయారు చేసే విగ్రహాలకు కూడా సహజమైన రంగులను వినియోగించేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రోత్సహిస్తోంది. తయారీదారులకు అవగాహన కల్పిస్తోంది. సహజ రంగులకు ఇలా శ్రీకారం... ప్రమాదకరమైన రసాయనాల కారణంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులన్నీ కాలుష్య కాసారాలయ్యాయి. పర్యావరణానికి కూడా ఈ రసాయనాలు పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో 2006 లో యునెస్కో సహకారంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. సహజమైన రంగుల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ ఈ సదస్సు లక్ష్యం. ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్ అగ్రికల్చరల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులో భాగంగా హోమ్‌సైన్స్ కళాశాల సహజరంగులను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. మొదట వస్త్రాలకు ఈ సహజమైన రంగులను అద్దారు. ఆ తరువాత హోలీ రంగులను సిద్ధం చేశారు. క్రమంగా వినాయక విగ్రహాలను సైతం సహజమైన రంగులతో అలంకరించేందుకు పండ్లు, పూలు, ఆకులు, బెరళ్లు, వివిధ రకాల దుంపల నుంచి రంగులను తయారు చేయడంపైన దృష్టి సారించారు. ఈ రంగుల నాణ్యత, ఆకర్షణపై హోమ్‌సైన్స్ కళాశాల ఎమిరిటస్ సైంటిస్ట్ శారదాదేవి ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2008లో 500 విగ్రహాలతో ప్రారంభమైన ఉద్యమం 2014లో 5000 దాటింది. చిన్న చిన్న విగ్రహాలతో పాటు, 5 నుంచి 6 ఫీట్లు ఉన్న వినాయక విగ్రహాలకు సైతం సహజరంగులను సిద్ధం చేశారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రూ.కోటితో అతి పెద్ద ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. తెలుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు, గులాబీ వంటి 12 ప్రాథమిక రంగులు, వివిధ రకాల రంగుల కాంబినేషన్లతో మొత్తం 56 రకాల రంగులతో విగ్రహాలను అలంకరించే విధంగా ఈ సహజరంగులను తయారు చేస్తున్నారు. 2 లక్షల చిన్న విగ్రహాలకు, 10 వేలకు పైగా పెద్ద విగ్రహాలకు రంగులను సిద్ధం చేయడం ఇదే మొట్టమొదటిసారి. నగరంలో వినాయకుడి మండపాలు ఇలా... ప్రధాన మండపాలు : లక్ష చిన్న విగ్రహాలు : 8 లక్షలు ఈ ఏడాది సహజ రంగులతో పెద్ద విగ్రహాలు : 10 వేలు చిన్న విగ్రహాలు : 2 లక్షలు సహజ రంగుల కోసం ప్రజలు, సంస్థలు, కళాకారులు సంప్రదించాల్సిన నెంబర్లు : 04023241059, హోంసైన్స్ కళాశాల. ఎప్పటి నుంచి అందుబాటులోకి : ఆగస్టు మొదటి వారం. -
కరీంనగర్లో రక్తదాన గణపయ్య
-
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఉత్సవం
-
వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!
గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో క్షమాపణలు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పలు ట్వీట్స్ పై వర్మ క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి. ఎలాంటి ఉద్దేశం లేకుండా గణేషుడుపై ట్విటర్ లో పెట్టిన అన్ని ట్విట్స్ ఎవరినైనా బాధిస్తే అందుకు నా క్షమాపణులు తెలుపుతున్నానని వర్మ ట్విటర్ లో వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే -
చావులోనూ వీడని బంధం
విద్యుత్ షాక్‌కు భార్యాభర్తల బలి వల్లూరుపాలెంలో ఘటన వైఎస్సార్సీపీ నేతల నివాళి గ్రామంలో విషాదఛాయలు తోట్లవల్లూరు : బలంగావీచిన ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగ దంపతుల జీవితాలను అనంతవాయువుల్లో కలిపేసింది. విద్యుత్‌షాక్ కారణంగా వల్లూరుపాలెంలో భార్యా, భర్తలు దుర్మరణం చెందిన ఘటన పలువరిని కంట తడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే...మండలంలోని వల్లూరుపాలెం ఊరి చివర బస్‌షెల్టర్ ఎదురుగా మరీదు విఘ్నేశ్వరావు(45) కుటుంబం నివాసం ఉంటోంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి పనులకు ఉపక్రమించాడు. పశువుల పాకలో శుభ్రం చేసి, పశువులను కడిగేందుకు నీళ్లు పట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కొబ్బరిమట్టలతో ఉన్న దడి పక్కనే విద్యుత్ మెయిన్‌లైన్ తీగపడి ఉంది. దీనిని గమనించని విఘ్నేశ్వరావు దడిపై చేయి వేయటంతో విద్యుత్‌షాక్ బలంగా కొట్టింది. భర్త కేకలు వేస్తూ పడిపోవటాన్ని గమనించిన భార్య వెంకటేశ్వరమ్మ(40) ఏం జరిగిందో అర్థం కాక, అతనిని లేపే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు కూడా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వీరిద్దరినీ తప్పించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా స్వల్పషాక్‌కు గురయ్యారు. విద్యుత్‌షాక్ తీవ్రతకు విఘ్నేశ్వరావు, భార్య వెంకటేశ్వరమ్మ క్షణాల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. భార్యా, భర్తలు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతులకు కుమారుడు జీవన్‌బాబు, కుమార్తె దీప్తి ఉన్నారు. నేతల పరామర్శ.... సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బందరు నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ మంత్రి కె.పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన,తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, జెడ్పీ ఫ్లార్ లీడర్ తాతినేని పద్మావతి, ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ మాజీ సభ్యులు మోర్ల రామచంద్రరావు, సర్పంచి మాదల రంగారావు, చింతలపూడి గవాస్కర్‌రాజు, దేవరపల్లి చంద్రశేఖర్‌లు మృతదేహాలను సందర్శించి, నివాళులు అర్పించారు. ట్రాన్స్‌కో డిఈఈ మురళీమోహన్, ఏడిఏ గోవిందరాజులు, తహ సీల్దార్ జి.భద్రుతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణ, ఎస్ఐ డి.సురేష్ బందోబస్తు నిర్వహించారు. -
వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు...
నివృత్తం వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నా తల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకుని రమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో పడ్డారు. కానీ పార్వతీదేవిలాంటి అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పట్నుంచీ ఈ మాట పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదురవుతుంటే ‘వినాయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారైంది పరిస్థితి’ అనడం రివాజుగా మారింది! -
ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని..
ఖైరతాబాద్ వినాయకుడి పేరు చెప్పగానే ఆకాశమెత్తు గణనాథుడు కళ్లముందు దర్శనమిస్తాడు. అంతెత్తు వినాయకుడిని చూడగానే ఆ విగ్రహానికి రూపాన్నిచ్చిన రాజేందర్‌ను చాలామంది తలచుకుంటారు. నిజమే మరి... మూడునెలలపాటు కృషి చేస్తేగాని ఆ బొజ్జగణపయ్య మన ముందుకు రాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలే ఈరోజు మన కళాత్మకం. ప్ర: ఇప్పటివరకూ మీ చేతిలో ఎన్ని ఖైరతాబాద్ వినాయక విగ్రహాలు తయారయ్యాయి? జ: ఇప్పటివరకూ నేను పాతిక విగ్రహాలు చేశాను. ప్రస్తుతం మన కళ్లముందున్నది 59 అడుగుల విగ్రహం. 1978 నుంచి నేను చేస్తున్నాను. మధ్యలో తొమ్మిదేళ్లు చేయలేకపోయాను. 1978కి ముందు ధూల్‌పేట్ నుంచి విగ్రహాన్ని తెచ్చిపెట్టేవారు. నా చేతిలో తయారైన పాతిక విగ్రహాలకు పాతిక రకాల రూపాలు ఇచ్చాను. ప్ర: అన్ని విగ్రహాల్లోకి మీకు బాగా పేరు తెచ్చిన రూపం..? జ: 1982వ సంవత్సరంలో ఎలుక రూపంలో తయారుచేసిన గణేశవిగ్రహం నాకు బాగా పేరు తెచ్చింది. దర్శకులు కె విశ్వనాథ్‌గారు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఆయన దర్శకత్వం వహించిన ‘సాగరసంగమం’ సినిమా షూటింగ్ కూడా ఆ విగ్రహం ముందు తీశారు. కమలహాసన్ నృత్యం చేస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు. అలాగే విశ్వరూపం ఆకారంలో చేసిన వినాయకుడికి కూడా చాలా ప్రశంసలు వచ్చాయి. ‘ఆది నేనే... అంతం నేనే’ అనే అర్థం వచ్చేట్టు విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ విగ్రహం ప్రతిక్షణం నా కళ్లలోనే ఉంటుంది. ప్ర: ప్రస్తుతం విగ్రహం రూపం ఏమిటి? జ: గో నాగచతుర్ముఖ వినాయకుడు. ఈ వినాయకుడు విగ్రహం తయారుచేయడానికి మూడు నెలల సమయం పట్టింది. రూపం తేవడానికి ఎంత కృషి చేస్తామో రూపాన్ని ఎన్నుకోవడానికి అంతే ఆలోచిస్తాం. ఏటా ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రూపాన్ని నిర్ణయిస్తాం. ఈ ఏడాది గోవధ గురించి వచ్చిన వార్తలు మా మనసుని కలచివేశాయి. అందుకే ఆవుని రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈసారి గోనాగ చతుర్ముఖ విగ్రహాన్ని తయారుచేశాను. కనీసం ఈ విగ్రహాన్ని చూసైనా గోవుని రక్షించుకుంటారని మా ఆశ. ప్ర: ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ‘ఎత్తు’ సమస్య గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. మీరేమంటారు? జ: 2000 సంవత్సరంలో 63 అడుగుల అతి ఎత్తై విగ్రహం తయారుచేశాం. కొన్ని ఇబ్బందుల కారణంగా తర్వాతి ఏడాది నుంచి పొడవు తగ్గించేశాం. ప్రస్తుత విగ్రహం పొడవు 59 అడుగులు. వచ్చే ఏడాదికి ఖైరతాబాద్ విగ్రహానికి 60 ఏళ్లు. అందుకే వచ్చే ఏడాది 60 అడుగుల విగ్రహం తయారుచేసి ఆ పై ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించి తయారుచేస్తాను. ఏటా ఒక అడుగు తగ్గించుకుంటూ అరవై ఏళ్లనాటికి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా ఇంట్లో వినాయకుడిలా ఒక్క అడుగులో దర్శనమివ్వాలనేది నా కోరిక. ప్ర: వినాయకుడి ‘రంగుల’ మాటేమిటి జ: వాతావరణాన్ని కలుషితం చేసే రంగులకి నేను వ్యతిరేకినే. పూర్వం వాడిన రంగులు నిజంగానే హానికరమైనవి. ఎప్పుడైతే వీటి గురించి ఆలోచించడం మొదలెట్టామో... అంటే... 2000 సంవత్సరం నుంచి కేవలం వాటర్పెయింట్స్ మాత్రమే వాడుతున్నాం. - భువనేశ్వరి -
శ్రీకరా..శుభకరా...క్షేమకరా..!
శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది. దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే! వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు. తొలిపూజతో ఆరాధనా ఫలం వినాయకుడిని పూజించడం వలన శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వశుభాలనూ చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయకచవితినాడు గణపతిని ఆరాధించేవారు ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్బుద్ధినీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దే వుడు గణనాథుడు. నిమజ్జనలోని ఆంతర్యం తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది. - ఇట్టేడు అర్కనందనాదేవి గణేశుడికి గరిక పూజ అంటే ఇష్టం ఎందుకు? ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. యమధర్మరాజుకు అనలాసురుడనే కొడుకు ఉన్నాడు. అతను తన రాక్షస ప్రవృత్తితో దేవతలను అనేక విధాల బాధలకు గురిచేస్తున్నాడు. దేవతల ప్రార్థనను ఆలకించిన గణపతి ఆ రక్కసుని ఒక ఉండగా చేసి మింగివేశాడు. ఆ అనలాసురుడు గణపతి గర్భంలో చేరి ఆయనకు అధిక తాపం కలిగించగా, ఆ తాప నివారణార్థం దేవతలు ఎంతగానో శీతలోపచారాలు చేశారు కాని ఫలితం లేకపోయింది. వారందరూ గంగాధరుని ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి ఒక్కొక్కరు ఇరవైఒక్క గరిక పోచలు తెచ్చి ఇరవై ఒక్క మార్లు వినాయకుని శరీరంపై కప్పమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా చేసిన తర్వాత గణపతికి తాపం తగ్గింది. నాటినుండి వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రంగా మారిందని పురాణగాథ. అంతేగాక గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే. - డి.ఎస్.ఆర్. ఆంజనేయులు -
గణేశ్ మండపాలపై విద్యుత్ విజి‘లెన్స్’
సాక్షి, గుంటూరు: గణేశ్ మండపాల ఏర్పాటు, విద్యుత్వాడకంపై విద్యుత్ విజిలెన్సు అధికారులు దృష్టిసారించారు. విద్యుత్ చౌర్యం చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ చౌర్య నిరోధక విభాగాన్ని ఏర్పాటుచేశారు. గణేశ్ మండపాల దగ్గర విద్యుత్ చౌర్యం జరగకుండా ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యేక రుసుం వసూలుకు నిర్ణయించారు. అటు విద్యుత్తు సంస్థకు నష్టం రాకుండా, గణేశ్ మండప నిర్వాహకులకు భారం కాకుండా ఉండేలా ప్రతి 2 కిలోవాట్ల లోపు వాడకానికి రూ.1325 వంతున నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆపైన వాడే ప్రతి కిలోవాట్‌కు రూ.1500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొ త్తాన్ని ముందే డీడీ రూపంలో వసూలు చేస్తున్నారు. ఏటా జిల్లావ్యాప్తంగా 10 నుంచి 12 వేల గణేశ్ మండపాల ఏర్పాటు జరుగుతుంది. మండపాలను ఏర్పాటు చేసే గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు 9 రోజులకు మైక్ పర్మిషన్, ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లించి కరెంటు వాడకాన్ని అధికారికం చేసుకుంటారు. ఈ విధంగా రుసుం చెల్లించివారు నిరభ్యంతరంగా ఉత్సవాలు జరిగిన 9 రోజులూ కరెంటును వాడుకోవచ్చు. రుసుం చెల్లించకుండా ఏటా 500పైగా మండపాలు ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి. దీనివల్ల విద్యుత్‌శాఖకు ఎంతో నష్టం వాటిల్లుతోంది. కరెంటు వాడకం జరిగినా అందుకు సరిపడ ఆదాయం మాత్రం అందక ఆ శాఖ అధికారులు తలమునకలయ్యేవారు. ఏటా ఎదురయ్యే ఈ విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న విద్యుత్ అధికారులు ఈ ఏడాది 2 కిలోవాట్స్ లోపు వాడకానికి విధిగా రూ.1325 చెల్లించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఒకవేళ ఎవరైనా చెల్లించకపోతే విద్యుత్ వాడకాన్ని అక్కడికక్కడే నిలిపివేయమే కాకుండా నిర్వాహకులపై కేసులు నమోదు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకున్నారు. మండపాల నిర్వాహకులు రుసుం చెల్లించేందుకు వీలుగా గుంటూరు నగరంలోని టీజేపీఎస్ కళాశాల వద్ద వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ విద్యుత్ ఏఈ దగ్గర డీడీ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా 1000 మందికి పైగా మండపాల నిర్వాహకులు ఇప్పటికే డీడీలను చెల్లించారు. ఆదివారం, సోమవారాల్లో కూడా రుసుం వసూలుకు కౌంటర్లు తెరిచే ఉంటాయని విద్యుత్ అధికారులు చెపుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ అక్రమ వాడకంపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ సంతోషరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులు విద్యుత్ వాడకాన్ని సక్రమమైన పద్ధతిలోనే జరపాలనీ, లేకుంటే కేసులు ఖాయమని స్పష్టం చేశారు.