విగ్రహాం 10 అడుగులకు మించరాదు | The idols should not exceed 10 feet | Sakshi
Sakshi News home page

విగ్రహాం 10 అడుగులకు మించరాదు

Published Sun, Aug 21 2016 7:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

The idols should not exceed 10 feet

వినాయక విగ్రహాల ఎత్తు పది అడుగులకు మించి ఉండరాదని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఫిలింనగర్ సెక్టారు పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకుల సమావేశం అవుట్‌పోస్టు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో పనుల సందర్భంగా విగ్రహాల ఎత్తును నిర్దేశించిన ఎత్తులోనే ఏర్పాటుచేయాలని, లారీలో ఎక్కించిన తరువాత విగ్రహం, లారీ ఎత్తు 20 అడుగులకు మించరాదని చెప్పారు. మండపాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సిఐ శ్రీనివాస్, సెక్టారు ఎస్సై గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement