Uday Kumar Reddy
-
AP: సీఐ తిట్టాడని రాజీనామా.. కట్ చేస్తే సివిల్స్ ర్యాంకర్‌గా ఉదయ్..
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఓ యువకుడు సివిల్స్ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్ ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు. దీంతో, 2013లో ఉదయ్ మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. అయితే, తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, సివిల్స్ ప్రేపర్ అవడానికి గల కారణాలను ఉదయ్ వెల్లడించారు. Telugu Police Constable resigns police job after humiliation, cracks UPSC "CI humiliated me in front of 60 policemen. I resigned from the job the same day and started preparing for UPSC Civil Services." - Uday Krishna Reddy (780th rank in 2023 UPSC Civil Services) Uday Krishna… pic.twitter.com/J9AB5diasa — Sudhakar Udumula (@sudhakarudumula) April 17, 2024 కాగా, తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒక సీఐ తనను అకారణంగా 60 మంది పోలీసుల ముందు తిట్టారని చెప్పుకొచ్చారు. తన తప్పు లేకున్నా అలా తిట్టడంతో అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. దీంతో, అప్పటి నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్టు స్పష్టం చేశారు. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదవినట్టు చెప్పారు. ఐఆర్ఎస్ వస్తుందని.. ఆ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్..సీబీఐకి హై కోర్టు కీలక ఆదేశాలు
-
సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారు..
కడప అర్బన్: ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఆఫీసులో, ఇంటి వద్ద అవమానించారు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం’ అని వైఎస్సార్ జిల్లా పులి వెందుల నివాసి, యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గౌరవంగా జీవిస్తున్న సామాన్య కుటుంబం మాది. కానీ, సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట ఏడాదిగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆయన హత్య గురించి అందరికీ తెలిసినట్లుగానే మాకూ తెలిసింది. అయితే ఈ ఏడాదిలో విచారణ పేరిట నన్ను 22 సార్లు పిలిచారు. ఆరేడు సార్లు నోటీసులు ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో వాట్సాప్ కాల్ చేసి పిలిచారు. వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకంతో అన్నిసార్లూ వెళ్లాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. కానీ సీబీఐ అదనపు ఎస్పీ రాంసింగ్ ఆయన చెప్పినట్లు చెప్పాలంటూ బెదిరిస్తూ భౌతికదాడి చేశారు. హత్య జరిగిన రోజు ఉదయం నేను, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కలిసి శివశంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అనంతరం శివశంకర్‌రెడ్డితో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అక్కడ శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఏదో మాట్లాడుకున్న ట్లు చెప్పాలంటున్నారు. నేను ఆ రోజు ఉదయం ఎక్కడికీ వెళ్లలేదు. సురేంద్రనాథ్‌రెడ్డిని, శివశంకర్‌రెడ్డిని కలవలేదు. గంగిరెడ్డి ఇంటికి కూడా వెళ్లలేదు. చేయని పని చేసినట్టుగా చెప్పలేను. ఇదే విషయాన్ని రాంసింగ్‌కు ప్రతిసారీ చెబుతున్నాను. కానీ ఆయన చెప్పినట్లు చెప్పకపోతే నన్నూ, నా కుటుంబాన్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారు. శనివారం బ్యాంక్ అకౌంట్స్ పేపర్లు ఇచ్చా ను. సోమవారం కూడా పిలిపించారు. వారు చెప్పినట్టు చెప్పకపోతే మా నాన్నను ఈ కేసులో ఇరికిస్తానని బెదిరించారు. కుటుంబమంతా ఆందోళనలో ఉన్నాం. మీరు వెంటనే విచారించి నిజానిజాలు తెలుసుకొని, రాంసింగ్, సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అని అదనపు ఎస్పీని కోరారు. -
Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఎస్సైగా పోస్టింగ్ పొందిన చోటే ఎస్పీ హోదాలో విధుల్లో చేరడం ఆనందంగా ఉందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీతో సోమవారం ‘సాక్షి’ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. 1991లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరా. ఉట్నూర్ ఏరియాలో తుపాకీ భుజాన వేసుకుని అడవులను జల్లెడ పట్టా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరి పట్టా పొందా. ఉట్నూర్ పోలీసు స్టేషన్లో ప్రొహిబిషన్ ఎస్సైగా కడెం పోలీసు స్టేషన్లో ఎస్సైగా పనిచేశా. మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించి జిల్లా నుంచి వారిని తరిమివేయడంతో ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ హోదాలో జిల్లాకు వచ్చా. 18 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. సాక్షి: శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను సందర్శిస్తా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటా. నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తాం. సాక్షి: గుట్కా, మట్కా, పేకాటపై ఏవిధంగా దృష్టి సారిస్తారు? ఎస్పీ: గుట్కా, మట్కా, పేకాట, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు చట్టపరిధిలో ఉంటే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఫోన్ ద్వారా, నేరుగా కలిసే అవకాశం కల్పించి వారి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా. చదవండి: (పోలీస్ వర్సెస్ పార్టీస్: న్యూఇయర్ వేడుకలపై ఉత్కంఠ) సాక్షి: జిల్లాలో పనిచేసిన 18 ఏళ్లలో మీ అనుభవం ఎలా ఉంది? ఎస్పీ: 1991లో ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సైగా విదుల్లో చేరా. మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అటవీ ప్రాంతాలన్నీ కలియతిరిగా. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపూరం. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు సుబ్బారెడ్డి, సామ్రాజ్యం. నాతో పాటు ఓ సోదరి ఉంది. నా భార్య అరుణ. ఇద్దరు సంతానం. కుమారుడు సంతోష్, కూతురు సాధన ఉన్నారు. ఇటీవలే వీరి వివాహం జరిగింది. ఎస్సైగా ప్రారంభమైన నా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ స్థాయికి చేరా. ఇదే నెలలో నాన్ క్యాడర్ ఐపీఎస్ హోదా రావడం సంతోషంగా ఉంది. సాక్షి: జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు? ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతా. గతంలో ఎస్సైగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాం. అందుకే ప్రభుత్వం నాకు సీఐగా పదోన్నతి సైతం కల్పించింది. ఆ అనుభవంతో జిల్లాలో వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ప్రతీ కదలికపై నిఘా పెంచుతాం. సాక్షి: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉన్నాయా? ఎస్పీ: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. సోమవారం నుంచి జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధం. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలు ఒకేచోట గుమిగూడి ఉండరాదు. భౌతిక దూరం పాటించాలి. వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్పీ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చూస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతాం. సాక్షి: మహిళల భద్రత, నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: షీ టీమ్ ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. నేరాల అదుపునకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తాం. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తాం. రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చిన్నపాటి ప్రమాదాలు, నేరాలు జరిగితే సాక్ష్యం లేకుండా పోతోంది. వీటిపై మీ స్పందన ఏమిటి? ఎస్పీ: కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపడతాం. జిల్లా కేంద్రంలో ఎక్కడెక్కడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదనే వివరాలు సేకరిస్తాం. ఏయే ప్రాంతంలో సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయో గుర్తించి ఏర్పాటు చేస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తాం. -
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారిత వైజ్లీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇది రోజుకు 100 కోట్ల దాకా మెసేజీలను సురక్షితంగా, వేగవంతంగా ప్రాసెస్ చేయగలదని బుధవారం వైజ్లీ ఆవిష్కరించిన సందర్భంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్, సీఈవో డి. ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది కంపెనీలు, మొబైల్ క్యారియర్స్, ఓటీటీ సంస్థలు, మార్కెటర్లు, పరిశ్రమ నియంత్రణ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలు తమ కస్టమర్లకు పంపే మెసేజీలు, ఓటీపీలు, మెయిల్స్ మొదలైనవి డెలివరీ అయ్యే క్రమంలో వివిధ ప్రక్రియల కారణంగా జాప్యం జరగడం, పూర్తి స్థాయిలో ఎన్క్రిప్షన్ లేకపోవడం వంటి సవాళ్లు ఉంటున్నాయని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్క్రిప్షన్, డేటా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రారంభం నుంచి చివరి దాకా గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు వైజ్లీ తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సంబంధిత సాంకేతికతలతో కంపెనీలు సర్వీసుల నాణ్యతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడగలదని పేర్కొన్నారు. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చెయిన్ ప్రాసెస్‌లకు సంబంధించి వైజ్లీ ఇప్పటికే మూడు పేటెంట్లు దక్కించుకుందని ఉదయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. డేటాకు ప్రైవసీ, భద్రత అత్యంత కీలకమైనవని, వీటికి వైజ్లీ తోడ్పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. వైజ్లీలో మార్కెట్ ప్లేస్ విధానం .. ఇప్పటికే ట్రూబ్లాక్ ప్లాట్‌ఫాం ద్వారా దేశీయంగా వివిధ సంస్థలకు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నామని ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడిక వైజ్లీతో ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని ఆయన వివరించారు. దీనిలో ప్రప్రథమంగా మార్కెట్‌ప్లేస్ విధానాన్ని కూడా పొందుపర్చామని పేర్కొన్నారు. టెలికం సంస్థలు తదితర సర్వీస్ ప్రొవైడర్లను తమ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు పారదర్శకంగా ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్ (సీపాస్) విభాగంలో ఇలాంటిది అందించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమమని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. క్లౌడ్ ద్వారా వైజ్లీ ప్లాట్‌ఫాంను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్ అనుభవం .. దీని రూపకల్పనలో ఉపయోగపడిందని వివరించారు. ఇక, వైజ్లీ విక్రయంలో రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు కూడా భాగస్వామ్యం తోడ్పడగలదన్నారు. 40 బిలియన్ డాలర్లకు గ్లోబల్ సీపాస్ ... ప్రస్తుతం అంతర్జాతీయంగా సీపాస్ వ్యాపార విభాగం సుమారు 20 బిలియన్ డాలర్లుగా ఉందని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. గార్ట్నర్ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపై 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు. ఇక భారత మార్కెట్ విషయానికొస్తే 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందన్నారు. పలు దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా సర్వీసులు అందిస్తూ దేశీయంగా తాము ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల తర్వాత డిజిటైజేషన్ మరింత వేగవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పుంజుకుంటుందని, తద్వారా అవకాశాలు మరింత పెరగగలవని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
విగ్రహాం 10 అడుగులకు మించరాదు
వినాయక విగ్రహాల ఎత్తు పది అడుగులకు మించి ఉండరాదని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఫిలింనగర్ సెక్టారు పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకుల సమావేశం అవుట్‌పోస్టు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో పనుల సందర్భంగా విగ్రహాల ఎత్తును నిర్దేశించిన ఎత్తులోనే ఏర్పాటుచేయాలని, లారీలో ఎక్కించిన తరువాత విగ్రహం, లారీ ఎత్తు 20 అడుగులకు మించరాదని చెప్పారు. మండపాల వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సిఐ శ్రీనివాస్, సెక్టారు ఎస్సై గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.