
గోషామహల్ హిందీనగర్‌లో 31 రకాల పప్పు దినుసులతో తయారుచేసిన బాల యువమండలి గణనాథుడు
ఈ సంవత్సరం వినూత్న తరహాలో 31 రకాల పప్పుదినుసులతో గణనాథుడిని తీర్చిదిద్దారు.
అబిడ్స్: ప్రతి సంవత్సరం వెరైటీ గణనాథులను ప్రతిష్టిస్తున్న గోషామహల్‌లోని హిందీనగర్ బాల యువమండలి ఈ సంవత్సరం వినూత్న తరహాలో 31 రకాల పప్పుదినుసులతో గణనాథుడిని తీర్చిదిద్దారు. గత 35 రోజులుగా యువ మండలి యువకులు పప్పులు, ఇతర ఆహార ధాన్యాలతో 8.7 అడుగుల విఘ్నేశ్వరునికి రూపకల్పన చేశారు. గతంలో అమెరికన్ డైమండ్స్‌తో గణనాధున్ని నెలకొల్పగా...
ఈ సంవత్సరం కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు, ఎర్రపప్పు, శెనగలు, రాజ్మా పప్పు, జొన్నలు, కాబూద్ చెన, పల్లీలతో పాటు పలు రకాల ఆహార ధాన్యాలతో విఘ్నేశ్వరుడిని తయారుచేశారు. యువ మండలి అధ్యక్షులు ఆకాష్ అగర్వాల్, మండలి యువకులు హితేష్ అగర్వాల్, కృష్ణసేన్, సంతోష్‌కుమార్, శుభం అగర్వాల్, యశ్ అగర్వాల్, శుభంలు ఈ గణనాధున్ని రేయింబవళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.