
పప్పుధాన్యాలు పోషకాల గనులు. ఇవి తీసుకోకపోయినా..లేక అవి లేకపోతే పర్యావరణ పరంగానే కాదు మానువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అవి తీసుకోకపోతే జీవనమే అస్తవ్యస్తంగా అయిపోతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌తో కూడిన పోషక కేంద్రాలివి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి మద్దతిస్తాయి. అలాగే స్థిరమైన వ్యవసాయానికి కీలకం ఇవి. పోషకాహారంలో వాటి పాత్ర అపారమైనది. అవి లేకుండా జీవనం అంటే.. ఊహకే అందని విషయం. ఇవి మానవ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దామా..
ప్రోటీన్లు కోల్పోతాం.
పప్పుధాన్యాలు తీసుకోకపోతే కండరాల నష్టం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శాకాహారులు మాంసకృత్తుల కోసం ప్రత్యామ్నాయంగా వాడే పప్పుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ పప్పుధాన్యాలు తీసుకోకపోతే గుండెకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను కోల్పోతాం. హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే ప్రోటీన్ కొరత ఏర్పడి కీళ్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఫైబర్లు అందవు:
జీర్ణక్రియ, గట్ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గట్ సంబంధిత సమస్యలు అధికమవ్వుతాయి. కొలొరెక్టల్ కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిజానికి పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్లు గట్ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అలాంటిది వాటిని అస్సలు తీసుకోకపోవడమంటే.. ఆరోగ్యాన్ని కోల్పోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఐరన్ లోపం:
పప్పుధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. ఎప్పుడైతే వీటిని తీసుకోమో అప్పటి నుంచి శరీరంలో రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా సులభంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలేట్లు రక్తహీనతను నివారించగా, మెగ్నీషియం, పొటాషియ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
పర్యావరణానికి కూడా నష్టమే..
ఈ పప్పుధాన్యాలు మానవులకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మంచివి. వాటి నత్రజని-స్థిరీకరణ సామర్థ్యం నేలను సారవంతంగా ఉంచుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే ఈ పప్పుధాన్యాల పంటలకు తక్కువ నీరు చాలు. అంతేగాదు రైతులు వనరులు అధికంగా అవసరమయ్యే పంటలు, జంతువుల పెంపకంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల అధిక నీరు వినియోగం కోసం భూమిపై అధిక ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఆహార ఉత్పత్తి తగ్గుతుంది పర్యావరణ నష్టం మరింత పెరుగుతుంది.
చెడు ఆహారపు అవాట్లు ఎక్కువ అవుతాయి..
ఎప్పుడైతే పప్పుధాన్యాలు లేవో అప్పుడు ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఎడిక్ట్ అవుతారు. ఇవి రుచికరంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మొదలవుతుందో పోషకాహారం లోపం ఏర్పడి వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఎక్కవ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
రక్తంలో చక్కెర అధికమవుతుంది:
డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి కీలకమైన ఆహారంగా మారుతాయి. డయాబెటిస్ రోగులు పప్పుధాన్యాలు తీసుకోకపోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచే మార్గాన్ని కోల్పోవడం జరగుతుంది. జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.
చూడటానికి చిన్నగా ఉండే ఈ పప్పుధాన్యాలు శక్తిమంతమైనవి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడం లేదా దరిచేరనీయవు. ఇవి మానవ ఆరోగ్యాన్ని కాపాడి, ఆకలిని నియంత్రించే అద్భుతమైన పోషకాలని కలగి ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి లేని ప్రపంచమంటే అనారోగ్యకరమైన జీవనం లేదా ప్రాణాపాయకరమైన జీవనంగా పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మ కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..!
Comments
Please login to add a commentAdd a comment