
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోనోక్లోనల్ యాంటీబాడీ ఉస్టెకినుమాబ్ బయోసిమిలర్ కోసం ప్రత్యేక హక్కులను తమ అనుబంధ కంపెనీ క్యూరాటెక్ బయాలాజిక్స్ పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది.
స్టెలారా (ఉస్టెకినుమాబ్) ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన బీఎఫ్‌ఐ–751ని వాణిజ్యీకరించడానికి యూఎస్‌కు చెందిన బయోఫ్యాక్చురాతో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పేగుల్లో వచ్చే వ్యాధులు, సొరియాసిస్, కీళ్ల వాతం వంటి రోగాల చికిత్సకు ఈ ఔషధం వాడతారు.
ఒప్పందం ప్రకారం యూఎస్, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇతర పాక్షిక నియంత్ర, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో సహా అన్ని ప్రధాన నియంత్రిత మార్కెట్లలో బీఎఫ్‌ఐ–751ని వాణిజ్యీకరించడానికి క్యూరాటెక్‌కు ప్రత్యేక లైసెన్స్ హక్కులు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment