వినాయకుడి విగ్రహం చోరీ
నల్లబెల్లి : పురాతన కాలం నాటి వినాయకుడి విగ్రహం చోరీకి గురైన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసులు, గ్రా మస్తుల కథనం ప్రకారం.. గుండ్లపహాడ్ గ్రా మానికి చెందిన పడాల పురుషోత్తమరావు ఇం టి వెనుకాల వ్యవసాయ భూమిలో 8 ఏళ్ల క్రి తం వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన కాలం నాటి వినాయక విగ్రహం బయటపడిం ది. గ్రామస్తుల నిర్ణయం మేరకు పురుషోత్తమరావు వ్యవసాయ భూమిలోనే విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి స్థానికులతోపాటు పలు గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం గ్రామస్తులంతా సమావేశమై ఈ విగ్రహాన్ని గ్రామంలోని శివాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పున ప్రతిషా్ఠపన చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం పురుషోత్తమరావు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం తిరిగి గుండ్లపహాడ్ చేరుకున్నాడు. బుధవారం పూజలు చేసేందుకు దేవాలయానికి వెళ్లగా వినాయక విగ్రహం కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. సర్పం చ్ పడాల భాగ్యశ్రీరమణరావు, గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై మేరుగు రాజమౌళి తెలిపారు.