వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!
గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్‌లో క్షమాపణలు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పలు ట్వీట్స్ పై వర్మ క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి. ఎలాంటి ఉద్దేశం లేకుండా గణేషుడుపై ట్విటర్ లో పెట్టిన అన్ని ట్విట్స్ ఎవరినైనా బాధిస్తే అందుకు నా క్షమాపణులు తెలుపుతున్నానని వర్మ ట్విటర్ లో వెల్లడించారు.
వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే