అక్కినేని అభిమానులకు ఆర్‌జీవీ సర్‌ప్రైజ్‌ | Ram Gopal Varma Shares Nagarjuna Akkineni And Father Sudigundalu Movie Clip | Sakshi
Sakshi News home page

RGV: అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్

Published Thu, Mar 18 2021 11:57 AM | Last Updated on Thu, Mar 18 2021 3:29 PM

Ram Gopal Varma Shares Nagarjuna Akkineni And Father Sudigundalu Movie Clip - Sakshi

తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాల నటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున అక్కినేని. అలా ఇప్పడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరో ఎదిగారు ఆయన. అలాగే నిర్మాతగాను ఆయన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అక్కినేని అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. నాగార్జున బాల నటుడిగా పరిచయం అవుతూ తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మొదటిసారిగా ‘సుడిగుండాలు’ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తాజాగా ఆర్‌జీవీ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి ‘సుడిగుండాలు సన్నివేశం.. చంద్రశేఖరం ఆయన కుమారుడిని స్కూలుకి కారులో తీసుకేళ్లారు’ అంటూ ఆర్‌జీవీ ఈ వీడియోను పంచుకున్నాడు. కాగా నాగార్జున ‘వెలుగు నీడలు’ అనే చిత్రంలో కూడా బాల నటుడిగా నటించారు. ఈ ఇందులో కూడా అక్కినేనికి కొడుకుగా కనిపించారు. అయితే నాగార్జున-అక్కినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘రావుగారిల్లు’, ‘ఇద్దరు ఇద్ద‌రే’, ‘శ్రీరామ‌దాసు’, ‘మ‌నం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  

చదవండి: 
సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. 
అందుకే సౌందర్య ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు : ఆమని
ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్‌ రొమాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement