అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50 ఏళ్లు
స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నాగార్జున
చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కి తీసుకురావడానికి నాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వర్ రావు తీవ్రంగా శ్రమించారు. కొండలు, గుట్టలు ఉన్న అడవి ప్రాంతాన్ని కొని స్టూడియోని నెలకొల్పాడు. అదే అన్నపూర్ణ స్టూడియో. ఈ స్టూడియో నెలకొల్పి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కినేని తనయుడు, హీరో నాగార్జున ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశాడు.
రోడ్లే లేని ప్రాంతం
హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ స్థాపించేందుకు.. ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు నాగేశ్వర రావు ముందుకువచ్చారు. 1976లో అప్పటి ప్రభుత్వం అక్కినేనికి 22 ఎకరాల భూమికి తక్కువ ధరకు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్కినేని నాగేశ్వర రావు అతి కష్టపడి స్టూడియో నిర్మించారు. దానికి తన భార్య పేరు మీద 'అన్నపూర్ణ స్టూడియో' అని పెట్టారు.
ఆ స్టూడియో నిర్మించే సమయంలో అక్కడికి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా సరిగా లేదట. కొండలు,గుట్టలు ఉన్న ప్రాంతం కొని ఏం చేస్తాడని అంతా ఏఎన్నార్‌ని హేళన చేశారట. కానీ అక్కినేని మాత్రం పట్టుపట్టి మరీ స్టూడియోని నిర్మించారట. తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ స్టూడియోకి తన భార్య పేరే పెట్టాలనుకున్నాడట. అందుకే ఆ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియో అని నామకరణం చేశారు.
‘అమ్మ అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన విజయం వెనుక అమ్మగారు ఉన్నారని ఎప్పుడూ నమ్మేవాడు. అందుకే ఆమె పేరును స్టూడియోకి పెట్టి.. ప్రాణంగా చూసుకున్నాడు. ఎక్కువ సమయం ఆ స్టూడియోలోనే గడిపేవారు. అందుకే అన్నపూర్ణ స్టూడికి వచ్చినప్పుడల్లా..అమ్మానాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు.
సంక్రాంతి ఆనవాయితీ
ఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోని మరింత డెవలప్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నారు. వందలాది మంది టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు, డైరెక్టర్లకు ఉపాధి పొందుతున్నారు. 1976 సంక్రాంతికి ఈ స్టూడియో స్థాపించారట. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి ఏఎన్నార్ తన సతీమణితో అక్కడికి వచ్చి.. అక్కడి ఎంప్లాస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడట. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తుందట. ‘అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికీ ఇంత చక్కగా రన్ అవుతుందంటే కారణం ఇక్కడి ఉద్యోగులు. వారు ఎంప్లాస్ కారు అన్నపూర్ణ ఫ్యామిలీ. వారంతా ఈ స్టూడియో కోసం చాలా కష్టపడతారు. నాన్నగారి మొదలుపెట్టన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. సంక్రాంతి పండక్కి మేమంతా ఇక్కడి ఎంప్లాస్‌తో కలిసి టిఫిన్ చేస్తాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు నాగార్జున.
Comments
Please login to add a commentAdd a comment