సాక్షి, హైదరాబాద్ : సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, మీడియా అటెన్షన్, సీబీఐ దర్యాప్తుపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై స్పందించాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. (దిశ ఎన్‌కౌంటర్: పోస్టర్ రిలీజ్)
‘ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్ అవుతుందనిపిస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్ వాళ్లందరూ టింబక్టుకు మకాం మార్చాలి. అని ట్వీట్ చేశారు. (టింబక్టు అనేది నైజీర్ నదికి సమీపంలోని మలి అనే దేశంలోని ఓ నగరం). అయితే మరో ట్వీట్ చేసిన వర్మ.. ‘కరోనా సోకిన భారత్‌కు వ్యాక్సిన్ లేదు. అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదు’. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.
When KANGANA will become CM. ARNAB GOSWAMI will become PM ,SHIV SENA will disappear , MUMBAI POLICE will be replaced by REPUBLIC TV and CONGRESS will escape to ITALY —- GOD
— Ram Gopal Varma (@RGVzoomin) September 9, 2020
కాగా రామ్ గోపాపాల్ వర్మ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒక్కో భాగం రెండు గంటలుంటుంది. ముందు రెండు భాగాల్లో వేరే నటులు నటించబోతుండగా చివరి భాగంలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నారు. (వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు)
చదవండి : కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment