
RGV Respond On Natti Kumar Cheating Case: నిర్మాత నట్టి కుమార్ తనపై పెట్టిన కేసుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అంతేకాదు తన సినిమా నా ఇష్టం వాయిదా వేసేందుకు నట్టి కుమార్ కారణం కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. కాగా గురువారం ఆర్జీవీపై నట్టి కుమార్ చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్జీవీ వివరణ ఇస్తూ ట్విటర్‌లో వీడియో రిలీజ్ చేశాడు. ‘నట్టి కుమార్ నోటీసులకు నా అడ్వకేట్ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా.
చదవండి: బర్త్‌డే నాడు ఆర్జీవీకి షాకిచ్చిన నిర్మాత
గతంలో చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు మీద ఇలాంటి ఆరోపణలే చేశాడు.. ఇప్పుడు నామీద.. ఇలా తన లైఫ్ అంత ప్రెస్‌మీట్‌లే ఉంటాయి’ అంటూ ఆర్జీవీ మండిపడ్డాడు. అంతేకాదు ‘ఇప్పుడు తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదనో.. రావల్సిన కమీషన్ రాలేదని ఇండస్ట్రీలో కొందరిని ఆయన దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన తాజా చిత్రం నా ఇషం వాయిదాపై కూడా ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ‘నా ఇష్టం సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణం కాదు. దానికి వేరే కారణం ఉంది. లెస్బియన్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం వల్ల చాలా థియేటర్లు మా చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేశాం’ అని చెప్పాడు.
Maa Ishtam postponement reason pic.twitter.com/FUylG5n5Wd
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022
‘అంతేకాని నా సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణంగా కాదు. కాబట్టి నట్టి కుమార్‌ను పెద్దగా పట్టించుకోవాలనుకోవడం లేదు. ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అందుకే ఇకపై ఆయన గురించి ఎక్కడ మాట్లాడేందుకు సిద్ధంగా లేను. చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేది నా న్యాయవాది చూసుకుంటారు’ అని ఆర్జీవీ వివరించాడు. కాగా ఆర్జీవీ తనకు రూ. 5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నిర్మాత నట్టికుమార్ ఏప్రిల్ 7న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధల్ని వర్మ తుంగలో తొక్కినట్లు ఆరోపించాడు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
DANGEROUS film postponement reason pic.twitter.com/lk4Mz3Z7z0
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022