సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
కొత్త ఛానల్
ప్రపంచంలోని వేర్వేరు చోట్ల వేర్వేరు వైరస్ సంక్రమణలు జరుగుతున్నట్టుగా తరచుగా వస్తున్న వార్తలను చూస్తుంటే– నేనను కోవడం, మనకు త్వరలోనే వాతావరణ ఛానల్ మాదిరిగా వైరస్ ఛానల్ రావొచ్చు.
– రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు
అవును కదా!
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరగనున్న సమయంలోనే కోవిడ్ కేసులు పెరుగు తుండటం మరీ కాకతాళీయంగా లేదా? దీనివెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉండాలి!
– శివమ్ విజ్, జర్నలిస్ట్
పుస్తకాలే స్నేహితులు
2021లో నా స్నేహితులు పుస్తకాలే. అవి స్ఫూర్తి దాయకం, సుసంపన్నం. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సాహచర్యం ఇవ్వగలవు. మానవజాతి అత్యు త్తమ సృష్టి పుస్తకాలు. వాటితో స్నేహం చేయండి. ఈ కఠిన సంవత్సరాన్ని తట్టుకుని నిలబడిన అందరికీ అభినందనలు. మీ కలలను నెర వేర్చుకోండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– పాల్కీ శర్మ, జర్నలిస్ట్
దునియా మనదే
2022 సంవత్సరానికి నా ఆకాంక్ష ఏమిటంటే– రానున్న ఐదేళ్లలో ఇండియా కూడా ట్రిలియన్ డాలర్ టెక్ కంపెనీని నిర్మించగలదని మన స్టార్టప్ కంపెనీలు నిజంగా విశ్వసించ గలగడం. తరువాతి టిక్‌టాక్, ఎథరీయమ్ ఇండియా నుంచి రాలేవని అనుకోవడానికి ఏ కారణమూ కనబడటం లేదు.
– రాజన్ బజాజ్, ఆంట్రప్రెన్యూర్
గోల్ 2022
2022 సంవత్సరంలో ప్రతిచోటా విస్తృతమైన టీకా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సుమారు 86 దేశాలు 2021 కోసం విధించుకున్న 40 శాతం టీకా లక్ష్యాన్ని చేరుకోలేదు. కాబట్టి, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉన్న టీకాలు విస్తారంగా ప్రపంచమంతటా అందుబాటులోకి రావాలి.
– గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్
కనబడటం లేదా?
ఒమిక్రాన్ వేవ్ ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. అమెరికాలో ఒకేరోజు ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో 2,08,000 కేసులు; యూకేలో 1,89,000 కేసులు వచ్చాయి. అయినా ఇండియాలో చాలామంది మేధావులు విదేశీ టీకాలైన ఫైజర్, మోడెర్నాలను ఇక్కడికి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ, ఇక్కడి టీకాల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపుతున్నారు.
– రిషి బాగ్రీ, రాజకీయ పరిశీలకుడు
శుభాకాంక్ష
మంచీ చెడూ రెండింటికీ కారణమైన 2021 సంవత్సరం అంతం అవుతోంది. కొత్త సంవత్సరం ప్రపంచంలోని అందరికీ పూర్తి శాంతి, స్నేహ సంతోషాలను తేవాలని కోరుకుంటున్నా. శాంతి ప్రేమలే ఈ ప్రపంచాన్ని పాలించాలి.
– ఫాతిమా కోశర్, వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment