Parvati devi
-
న్యూయార్క్లో చోళ్ల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం
చెన్నై: చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్లోని బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు. ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, నెక్లెస్లు, ఆర్మ్బ్యాండ్లు, వస్త్రాలతో రూపొందించి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
సర్వోత్తమం సుబ్రహ్మణ్య షష్టి
లోకసంరక్షణార్ధం తారకుడనే రాక్షసుని సంహరించడానికి దేవతల కోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్టి నాడు జన్మించాడు సుబ్రహ్మణ్య స్వామి. దీనికే ‘సుబ్రహ్మణ్య షష్టి‘ లేదా ‘స్కంద షష్టి‘ అని పేరు. సుబ్రహ్మణ్యస్వామి పేర్లు ►కుమారస్వామి నామాలు, వాటి వివరణ ►షణ్ముఖుడు –– ఆరు ముఖాలు కలవాడు. ►స్కందుడు పార్వతీదేవి పిలిచిన పేరు. ►కార్తికేయుడు కృత్తికానక్షత్రాన జన్మించినందుకు ►వేలాయుధుడు శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు. ►శరవణుడు –శరవణం (రెల్లు వనం) లో జన్మించాడు కాబట్టి. ►సేనాపతి – దేవతలకు సేనాధిపతి. ►స్వామినాథుడు ––శివునకు ప్రణవ మంత్ర అర్ధాన్ని చెప్పినాడు కనుక. ►సుబ్రహ్మణ్యుడు –బ్రహ్మజ్ఞానం కలిగినవాడు. ►మురుగన్ ఈ తమిళ నామానికి ‘అందమైన వాడు‘ అని అర్థం. తారకాసుర సంహారం కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకాసురుని సంహరించేందుకు ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొంది దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు. సుబ్రహ్మణ్య కావడి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నానమారించి పాలు, పంచదారలతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలు చేస్తారు. భక్తులు కావడులతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడు రాష్ట్రంలో విశేషంగా ఆచరణలో ఉంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం స్కంద షష్టి నాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో ‘శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి‘ కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షిస్తే అవివాహిత యువతీ యువకులకు ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయని, సత్సంతానం కలుగుతుందని పెద్దల మాట. నేడు పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా శిరఃస్నానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు లేదా పాలు నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామి విజయ గాథలు చదవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీర్తనలు ఆలాపించాలి. దగ్గరలోని స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి. రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి. పూజ ఫలితం విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్పించినా సత్సంతానప్రాప్తి, వారి కుటుంబంలోనూ, రాబోయో తరాలవారికి కూడా వంశవృద్ధి జరుగుతుందని విశ్వాసం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. స్కంద షష్ఠినాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి దేశం నలుమూలలా దేవాలయాలున్నాయి. వాటిలో తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయ పుష్కరిణికి సమీపంలోని ఆలయం, మోపిదేవిలో, మంగళగిరి వద్ద గల నవులూరులోనూ, వరంగల్ జిల్లా పరకాలలోని ఆలయం, హైదరాబాద్ పద్మారావు నగర్లోని ఆలయాలు సుప్రసిద్ధమైనవి. ఇక తమిళనాట గల ఆలయాల సంగతి సరేసరి. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. భక్తులకు స్వామి అనుగ్రహం లభించాలని కోరుకుందాం. – కృష్ణకార్తీక జాతకంలో సర్పదోషం, నాగదోషం, కాలసర్పదోషం ఉన్న వారు దోష పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. రాహుకేతు దోషాన్నే కాలసర్పదోషంగా పరిగణించి ఈ రెండు గ్రహాలకు పూజలు చేయడం పరిపాటి. జాతకంలో గ్రహాలన్నీ లగ్నంతో సహా రాహు కేతుగ్రహాల మధ్య ఉంటే కాలసర్పదోషంగా చెబుతారు. మరలా ఇందులో అధోముఖ కాలసర్ప, ఊర్థ్వముఖ కాలసర్పదోషమని రకాలుంటాయి. సర్పానికి రాహువును నోరుగా, కేతువును తోకగా భావిస్తారు. అందువల్ల ఈ రెండింటి మధ్య జాతక చక్రంలో గ్రహాలు ఎంత శుభస్థితిలో ఉన్నా, ఉచ్చంలో ఉన్నా ఆ శుభ ఫలాలు జీవితంలో కనిపించవని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ దోష నివారణకు రాహు కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ పూజలకు కాళహస్తి, మోపిదేవి, చిన కాకాని, కర్ణాటకలో కుక్కి ప్రశస్తం. సుబ్రహ్మణ్య షష్ఠినాడు ఈ దోష నివారణ పూజలు మరింత సత్ఫలితాలు ఇస్తాయి. స్వామిని సర్పరూపంలో పూజించి నాగులను చంపిన పాపాలు, వాటి పట్ల చేసిన దోషాలు పోవాలని ప్రార్థించాలి. సుబ్బారాయుని గుడిలోనే కాక గ్రామాలలో ఉన్న పాముల పుట్టల దగ్గర కూడా పూజలు చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారం ఉంది. – గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
మాతృదేవతాౖయె నమః
ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాతృత్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో... తలచుకోగానే బొమ్మకట్టే కొందరు మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి, తన బిడ్డ ప్రాణం కోసం పతి అయిన పరమ శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాతృమూర్తి. తాను నలుగుపిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన పోరాటంలో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి భోరున విలపించింది. తొందరపడి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ప్రాణనాథుడైన పరమేశ్వరుడినే ఒక సాధారణ స్త్రీలా తూలనాడిన సిసలైన తల్లి ఆమె. ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అసలైన అమ్మ. ఆ బిడ్డడే అందరి తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య. సీతాదేవి: శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగుకుని వాల్మీకి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది. యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్సల్యాలతో యశోదా కృష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా కృష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతోపాటు ప్రేమ, వాత్సల్యాలను, మమతానురాగాలను కూడా రంగరించి కృష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించిపోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి... ఇలా అతని బాల్యక్రీడలతో, అల్లరిచేష్టలతో మాతృత్వాన్ని తనివి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న దేవకీదేవి కూడా స్మరణీయురాలే.. కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై తీవ్ర వేదనను అనుభవించిన మాతృమూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పితృవాక్య పరిపాలనకు లోటు రాకూడదన్న సదాశయంతో, సయమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి. సుమిత్రాదేవి: భర్త దశరథుడు కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును ఏళ్లతరబడి మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నతోపాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ... అతడిని వారించకుండా రాముడిని కూడా తన కుమారుడిలాగే భావించి అతడి పితృవాక్యపరిపాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహృదయురాలు సుమిత్రాదేవి. కైక: పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామచంద్రుడిని పెంచింది. అనుక్షణం రాముడినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరువాత ఎంతో పశ్చాత్తాప పడ్డ కైక కూడా గుర్తుచేసుకోదగిన తల్లే. వకుళమాత: శ్రీకృష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని వాపోయిన యశోదమ్మకు మరుజన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళమాతగా జన్మించగా తాను శ్రీనివాసుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందుకున్నాడు కృష్ణుడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని వాత్సల్యంతో ఆదరించి తనలోని మాతృత్వభావనను పరిపూర్ణం చేసుకున్న మాతృమూర్తి వకుళమాత. అనసూయ: ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని నిలబడ్డారు. అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది అసూయ. అప్పుడు కపటయతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘సాధ్వీ! మాకొక నియమమున్నది – అది నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేది లేదు!’’ అని అన్నారు. అనసూయ ‘అలాగా! సరే!’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే పసిపాపలైపోయారు. అనసూయకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో నిద్రలోకి జారిపోయారు. ముగ్గుర్నీ ఉయ్యాల తొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. బ్రహ్మాండమే వీళ్ళకు ఉయ్యాలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’ అంటూ జోలపాడింది. ఆ పాటకు మైమరచిపోయిన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు. మాతృమూర్తులందరికీ అభివందనం. -
కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి
కంచి అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్ (కాళీ కోష్టమ్) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట. గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కిందిభాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది. సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఆది దంపతులని ఎందుకు పేరు?
శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది. శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట. బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో... తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరుగాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే. ఇన్ని నియమాలెందుకు? సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కావు. ప్రతి పండుగ వెనుకా వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి ఈ నియమాలు. అభిషేకం: శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సున కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు.శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ... జాగరణ అవదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. నమకం, చమకం చదువుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, శివనామస్మరణ అనేక పాపాలను ప్రక్షాళన చేస్తుంది. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
వినాయకుని పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు...
నివృత్తం వినాయకుడికి పెళ్లీడు వచ్చింది. అయినా ఆయన పెళ్లి గురించే తలవడం లేదు. దాంతో దేవతలందరూ కలిసి వినాయకుని పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకొమ్మని చెప్పారు. దానికి వినాయకుడు... తప్పకుండా చేసుకుంటాను కానీ అందంలోనూ, గుణగణాల్లోనూ నా తల్లి పార్వతికి సమానమైన అమ్మాయిని తీసుకుని రమ్మని అడిగాడు. దాంతో దేవతలందరూ అలాంటి అమ్మాయి వేటలో పడ్డారు. కానీ పార్వతీదేవిలాంటి అమ్మాయి ఎంతకీ దొరకలేదు. ప్రతివారిలోనూ ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంది. అప్పట్నుంచీ ఈ మాట పుట్టుకొచ్చింది. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అవాంతరాలు ఎదురవుతుంటే ‘వినాయకుని పెళ్లికి వేయి విఘ్నాలన్నట్టుగా తయారైంది పరిస్థితి’ అనడం రివాజుగా మారింది!