వాటికన్ సిటీ: ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనానికి దూరంగా గడపాలని క్రిస్మస్ వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పోప్ ప్రసంగం వినేందుకు సోమవారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చికి వేల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ‘నేటికీ మానవుడి జీవితం నిరాశ నిస్పృహలతో నిండి ఉంది. కొందరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతుంటే మరికొందరు ఓ పూట రొట్టె ముక్క కోసం ఇబ్బంది పడుతున్నారు..’అని పోప్ వ్యాఖ్యానించారు. ఇటు జీసస్ జన్మస్థలంగా భావించే బెత్లెహాంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment