ఈ స్టార్స్‌కివే చివరి చిత్రాలు? | This is the final pictures of Stars? | Sakshi
Sakshi News home page

ఈ స్టార్స్‌కివే చివరి చిత్రాలు?

Published Sat, Mar 3 2018 1:33 AM | Last Updated on Sat, Mar 3 2018 12:17 PM

This is the final pictures of Stars? - Sakshi

కమలహాసన్‌ రజనీకాంత్‌,త్రిష,అనుష్క,నయనతార

తమిళసినిమా: కోలీవుడ్‌లో దిగ్గజాలెవరంటే వచ్చే సమాధానం కమల్, రజనీ అనే. నాలుగు దశాబ్దాలకు పైగా సూపర్‌స్టార్స్‌గా ఏలుతున్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకేసారి రాజకీయాలపై దృష్టి పెడుతుండడం సంచలనం రేకెత్తిస్తోంది. కమలహాసన్‌ ఇప్పటికే రాజకీయపార్టీని నెలకొల్పారు. రజనీ పార్టీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇద్దరూ రాజకీయపరమైన గ్రౌండ్‌ వర్క్‌లో ముమ్మరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, కమలహాసన్‌లిద్దరూ తమ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రజలను ఆకట్టుకునే ఒక మంచి రాజకీయ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ చిత్రం అవసరం. కమల్‌కు అలాంటి చిత్రంగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2, రజనీకాంత్‌కు కార్తీక్‌సుబ్బరాజ్‌లో నటించనున్న చిత్రం అమిరాయంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ఇవే ఈ ఇద్దరికీ చివరి చిత్రాలనే ప్రచారం జోరందుకుంది. అయితే కమల్‌ ఇకపై తాను రాజకీయ నాయకుడినేనని ప్రత్యక్షంగానే వెల్లడించారు. రజనీకాంత్‌ మాత్రం ఈ విషయం గురించి నోరు మెదపడం లేదు. పోతే కమల్, రజనీలకు స్వారూప్యం ఏమిటంటే కమల్‌ నటించిన విశ్వరూపం–2, శభాష్‌నాయుడు, రజనీకాంత్‌ నటించిన 2.ఓ, కాలా చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిలో కమల్‌ విశ్వరూపం–2, రజనీ కాలా చిత్రాలను ఓకే సమయంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక చివరి చిత్రాలుగా చెప్పబడుతున్న కమల్‌ ఇండియన్‌–2, రజనీ కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించే చిత్రాలు ప్రారంభం కావలసి ఉంది.  ఇక అసలు విషయానికి వస్తే వీరిద్దరి నూతన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అదృష్టం దక్కేదెవరికన్నదే. ఈ చిత్రాల్లో నటించేందుకు ప్రముఖ నటీమణులు పోటీ పడుతున్నారని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇండియన్‌–2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా అగ్రనటి నయనతార నటించే అవకాశాలు ఉన్నాయనేది ప్రచారంలో ఉంది. ఇంతకు ముందు విశ్వరూపం చిత్రంలో నటించిన పూజాకుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది. మరి కమల్, శంకర్‌ దృష్టిలో ఎవరున్నారో తెలియాలంటే ఇంకా కొద్ది కాలం ఆగాల్సిందే. ఇక రజనీకాంత్‌కు జంటగా నటించేదెవరన్నదే ఆసక్తిగా మారింది. రజనీకాంత్‌ లింగా చిత్రం వరకూ ప్రముఖ హీరోయిన్లతోనే నటించారు. కబాలి, తాజా చిత్రం కాలా చిత్రంలో రాధికా ఆప్తే, ఈశ్వరిరావు లాంటి అంతగా పాపులర్‌ కానీ నటీమణులతోనే నటించారన్నది గమనార్హం. అలాంటిది తాజా చిత్రం కోసం అగ్రనటీమణుల్లో ఒకరిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందని సమాచారం. ఆ పట్టికలో నయనతార, అనుష్క, త్రిషలలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారని, అదేవిధంగా బాలీవుడ్‌ భామలు కంగణారావత్, రాధికాఆప్తే, దీపికాపదుకునేల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది.

చెన్నై చిన్నదాని కోరిక  నెరవేరేనా?
మరో విషయం ఏమిటంటే చెన్నై చిన్నది త్రిష కమల్‌ నుంచి, విజయ్, విక్రమ్, అజిత్‌ల నుంచి వర్థ్ధమాన నటుడు విజయ్‌సేతుపతిల వరకూ నటించేశారు. అయితే నటిగా దశాబ్దం దాటినా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించాలన్నది త్రిష చిరకాల ఆశ. ఈ విషయాన్ని పలు వేదికలపై త్రిషనే స్వయంగా చెప్పింది. రజనీ తాజా చిత్రంలో ఎంపిక చేసే హీరోయిన్ల పట్టికలో తన పేరు చోటుచేసుకోవడంతో త్రిష మనసులో చిన్న ఆశ కలుగుతోందట. మరి అనుష్క, నయనతారలను దాటి ఆ అవకాశం త్రిష వరకూ వస్తుందా? అన్నది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement