Rajanikath
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
భారతీయ చిత్ర పరిశ్రమలో తమదైన క్రేజ్, ఇమేజ్ను సొంతం చేసుకున్నారు హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి నటించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. దాదాపు 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ ఒకే స్టూడియోలో కలిసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రజినీ–కమల్ కలిసి ఒకే సినిమాలో నటించడం లేదు. కానీ, వారి వారి చిత్రాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో ఇలా కలిశారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ చిత్రీకరణ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. ఈ స్టూడియో ఆవరణలోనే రజినీకాంత్ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ‘తలైవర్ 170’ షూటింగ్ జరుగుతోంది. ‘తలైవర్ 170’ షూటింగ్ స్పాట్‌కి వెళ్లి రజినీకాంత్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు కమల్‌హాసన్. 21 సంవత్సరాల తర్వాత ఒకే స్టూడియోలో వీరిద్దరి మూవీస్ షూటింగ్స్ జరుపుకోవటం, అక్కడ వీరు కలుసుకోవడంతో గత స్మృతులను నెమరువేసుకున్నారు. 2002లో రజినీకాంత్ ‘బాబా’, కమల్‌హాసన్ ‘పంచ తంత్రం’ చిత్రాల షూటింగ్స్ ఒకే చోట జరిగినప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. -
రజనీకాంత్ 'జైలర్'కు మెగాస్టార్ చిరంజీవి చురకలు
ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్, జైలర్ రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే తెరపైకి వచ్చాయి. భోళాశంకర్ భారీ డిజాస్టర్ కాగా, జైలర్ సూపర్ హిట్ కొట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు అనిరుధ్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. జైలర్ విజయంలో అనిరుధ్ కూడా ఒక కారణమని, ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజీఎం సూపర్ అని రజనీ తెలిపాడు. సినిమా రీరికార్డింగ్‌కి ముందు చూసినప్పుడు అంతగా బెటర్ అనిపించలేదు కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత జైలర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని ఆయన తెలిపాడు. ఒక రకంగా జైలర్‌ను అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కాపాడిందని రజనీకాంత్ పరోక్షంగా ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితి మనది కాదు: చిరంజీవి ఒక సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలా ఉండాలో తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడాలి అని మెగాస్టార్ అన్నారు. అభిమానుల కోసం నేను ఎప్పుడూ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయాలని ఉంటుంది. నా నుంచి వారు కూడా అదే ఆశిస్తారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారు. కొందరు నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది. (ఇదీ చదవండి: ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో తెలుగు నటి గాయత్రి) కానీ.. అలా చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు. అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక- నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి. కానీ ఒక సీన్లో విషయం లేకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారు.' అని చిరంజీవి అన్నారు. ఇప్పుడా కామెంట్లను జైలర్ సినిమాకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు. జైలర్ సినిమాను ఉద్దేశించే మెగాస్టార్ ఆ కామెంట్లు చేశాడని కొందరు అంటుండగా.. ఉన్న విషయమే ఆయన చెప్పాడని మరికొందరు అంటున్నారు. -
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్‌తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్‌గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్‌గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్‌లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్‌తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
రజనీకాంత్, సిల్క్ స్మిత మధ్య జరిగింది ఏంటి.. ఇందులో నిజమెంత?
ఒకప్పుడు వెండితెరను ఏలిన సౌందర్య రాశి సిల్క్ స్మిత.. ఆమె మరణించి ఇప్పటకి సరిగ్గా 27 ఏళ్లు పూర్తి అయ్యాయి. సిల్క్ స్మిత 80వ దశకంలో తన పెద్ద కళ్లతో, మనోహరమైన చిరునవ్వుతో, ఆవేశపూరితమైన అందంతో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచాన్ని తుఫానుగా మార్చేసిందని చెప్పవచ్చు. 80, 90 దశకాల్లో స్మిత పాటలు లేని సినిమాలు చాలా అరుదు. సిల్క్ స్మిత తన 17 ఏళ్ల నట జీవితంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది. సినిమా కథ కంటే ఎక్కువగా స్మిత నిజ జీవితంలో ఎక్కువ కష్టాలు ఉండేవి. నిర్మాతగా మారి సినిమాలు కూడా ఆమె తీశారు. కానీ ఆ రంగంలో పరాజయాలు అందుకోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడం.. ప్రేమ వ్యవహారం దెబ్బతినడంతో తట్టుకోలేకపోయారు. 1996లో (అప్పటికి 35 ఏళ్ల వయసు) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆమె మరణానికి పూర్తి కారణాలు ఇప్పటికీ తెలియవు. గ్లామరస్లో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు సౌత్ ఇండియాలో పాపులారిటీ విషయంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లతో పోటీ పడింది సిల్క్ స్మిత. అప్పట్లో ఈ నటిపై చాలా గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నటి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రేమలో ఉందనే వార్త అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. సిల్క్ స్మిత 80వ దశకంలో కమల్‌హాసన్‌తో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రలు చేయడంలో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు. సిల్క్ అనేక బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించింది. సిల్క్ శరీరంపై సిగరెట్ మచ్చలు రజనీకాంత్, సిల్క్ 1983లో జీత్ హమారీ, 1983లో తంగా మగాన్, పాయుమ్ పులిలో కలిసి పనిచేశారు. అదే సమయంలో, ఈ చిత్రాలలో సిల్క్ యొక్క ఆకర్షణీయమైన డ్యాన్స్ అప్పట్లో పలు వివాదాలకు దారితీసింది. రజినీ, సిల్క్ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్‌తో కాల్చాడని కూడా ఆనాడు భారీగానే రూమర్స్ వచ్చాయి. అప్పట్లో వారిద్దరి గురించే ప్రతి సినిమా సెట్లో పలురకాలుగా చర్చించుకునే వారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియరాలేదు. వారిద్దరూ కలిసి పలు రొమాంటిక్ సాంగ్స్‌లలో నటించినందుకే ఈ రూమర్స్ వచ్చాయని మరికొందరు చెప్పుకునేవారు. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న మరణించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత విశాల్ 'మార్క్ ఆంటోని' చిత్రంలో స్మిత మాదిరి తమిళ నటి విష్ణుప్రియా గాంధీ కనిపించింది. మేకప్ సాయంతో ఆమెను అచ్చూ సిల్క్ మాదిరే తెరపై చూపించారు. దీంతో ఆమెకు సంబంధించిన పాత విషయాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రజనీకాంత్ జూదంలో ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడా..?
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్కు, కారుతో సత్కరించారు చిత్ర నిర్మాత కళానిధి మారన్. అలాగే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు కూడా ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. జైలర్ సక్సెస్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీ కూడా కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చాను. ఇప్పుడిప్పుడే ధనవంతుడయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ స్పీచ్‌పై కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా క్రిటిక్ బిస్మీ ఇలా స్పందించాడు. రజనీకాంత్ ప్రసంగం ఒక కోణంలో సరైనదేనని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కళానిధి మారన్‌కు మరో కోణంలో ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగించి ఉంటాయని బిస్మి చెప్పాడు. రజనీ సూపర్‌స్టార్ అయినప్పటికీ చాలా ఏళ్లుగా అంబాసిడర్ కారునే వాడేవారు. పదేళ్ల క్రితం వరకు ఆయన అంబాసిడర్ కారునే వాడేవాడని ఆయన తెలిపాడు తర్వాత ఆయన ఇన్నోవా కారుకు మారారని తెలిపాడు. రజనీ తర్వాత వచ్చిన నటీనటులంతా విలాసవంతమైన కార్లలో వస్తుంటే, రజనీ మాత్రం సినిమా షూట్లకు వెళ్లి తిరిగి వచ్చేది సాధారణమైన కారులోనే అని ఆయన తెలిపాడు. రజనీ కాంత్ అప్పట్లో తలచుకుని ఉండుంటే ఎన్నో లగ్జరీ కార్లను కొని ఉండవచ్చు. కానీ అతను సింపుల్‌గానే ఉండాలని ఎందుకు అనుకున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న.. ఎన్నో ఏళ్లుగా అంబాసిడర్ కారు వాడుతున్న రజనీ ఈ మధ్యే ఇన్నోవా కారుకు మారాడని గుర్తుచేశాడు. అందువల్లే కళానిధి మారన్ ఇచ్చిన గిఫ్ట్‌ను ధనవంతుల కారుగా ఆయన చెప్పి ఉండవచ్చు అని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!) ఒక విజయవంతమైన నటుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. లెక్కలేనన్ని కోట్లు సంపాదించాడు. ఎంతో ధనవంతుడైన రజనీ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చెప్పడం కష్టం అనే రేంజ్‌కు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతలా లేదని కోలీవుడ్‌లో టాక్. ఇప్పటికే రజనీకాంత్‌తో పాటు ఆయన భార్యపై పలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినికిడి. జూదగాడు ఓడిపోయాడు ఇదిలా ఉంటే, రజనీ విలాసవంతమైన కార్లు నడపలేదు కానీ జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అని బిస్మీ చెప్పాడు. సినిమాకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడి ఇక్కడ సంపాదించిన డబ్బంతా రజనీ పోగొట్టుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించడం కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బంతా అక్కడ పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని రజనీ గడుపుతున్నాడని తెలిపాడు. అలాంటప్పుడు నేడు కళానిధి మారన్ ఇచ్చిన లగ్జరీ కారు ఆయనకు ఇప్పటి పరిస్థితిల్లో గొప్పగానే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం రజనీ వద్ద ఎలాంటి లగ్జరీ కారు లేనందునే కళానిధి మారన్ ఈ కానుకను ఇచ్చాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ గురించి బిస్మీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. లాస్ వెగాస్‌లో ఆయన జూదం ఆడుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట ఉన్నాయి. అప్పట్లో ప్రధాన నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇదే విషయంపై పలు కథనాలను కూడా ప్రచురించింది. -
'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నెల్సన్ కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. కాగా ఈనెల 10న విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ జైలర్ చిత్రం ఇంత సంచలన విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఒక మంచి చిత్రాన్ని చేయాలన్న భావనతోనే చిత్ర షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర ఘన విజయానికి కారణం కథ, రజనీకాంత్ ఫీవర్, స్లాంగ్, అభిమానుల ఆదరణే ముఖ్యకారణమన్నారు. (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) చిత్ర విడుదలకు మూడు రోజుల ముందు రజనీకాంత్ చూశారన్నారు. అప్పుడు మీరు ఊహించిన విధంగా చిత్రం వచ్చిందా అని ఆయన్ని అడిగానని, అందుకు ఆయన ఊహించిన దానికంటే పదిరెట్లు బాగా వచ్చిందని చెప్పారన్నారు. చిత్రం బాగా వస్తుందని తెలుసు కానీ, ఇంత బాగా వస్తుందని ఊహించలేదన్నారు. ఆ ప్రశంసే ఆనందాన్నిచ్చిందన్నారు. ఇప్పటి సంతృప్తే అప్పుడే కలిగిందనే అభిప్రాయాన్ని నెల్సన్ వ్యక్తం చేశారు. చిత్రం బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే పెరిగిందని అయినా సన్ పిక్చర్స్ నిర్వాహకులు కాదనకుండా ఖర్చు చేశారని చెప్పారు. నిర్మాత కళానిధి చిత్రం ప్రారంభించినప్పటి నుంచి చాలా సపోర్టుగా ఉన్నారన్నారు. జైలర్ చిత్రం ఏడు రోజుల్లో రూ.375.40 కోట్లు వసూలు చేసిందని నిర్మాతల వర్గం గురువారం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారన్నారు. -
రజనీకాంత్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో టీమిండియా ఆటగాళ్లు కుల్దీప్యాదవ్, వాషింగ్టన్ సుందర్ సందడి చేశారు. ముంబైలోని రజనీకాంత్ నివాసంలో వీరిద్దరూ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే అనంతరం వీరిద్దరూ రజనీ నివాసానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సూపర్ స్టార్ స్టేడియంకు కూడా వచ్చారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మెరకు ఆయన అక్కడకు విచ్చేశారు. ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్‌తో కలిసి రజని మ్యాచ్‌ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తేడాతో భారత్ ముందంజ వేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. . 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజాలు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బౌలింగ్‌లో మహ్మద్ షమీ, సిరాజ్ తలా 3 వికెట్లతో ఆసీస్‌ను కట్టడి చేయగా.. జడేజా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ IND Vs AUS: అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్ విజయంపై గురి -
రాష్ట్రపతి కోవింద్,ప్రధాని మోదీని కలిసిన రజనీకాంత్
-
ధనుష్ ఓ సెన్సేషన్
-
ఫ్యాన్స్‌తో రజనీకాంత్ భేటీ..
సాక్షి, చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన అభిమాన సంఘం మక్కల్‌మండ్రం కార్యదర్శులతో సోమవారం భేటీ కానున్నారు. రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ వచ్చిన రజనీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. సినిమాలపై దృష్టి పెట్టారు. అన్నాత్తై షూటింగ్ ముగించారు. ఇటీవల వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యతకు దారి తీసింది. జిల్లాల వారీగా నేతలకు శనివారం ఆహ్వానాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 9 గంటలకు రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశం జరగనుంది. -
అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. 2020 సంవత్సరానికిగాను తనను అత్యుత్తమ పురస్కారానికి ఎంపిక చేయడంపై తలైవా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనగురువు, సోదరుడుతోపాటు సినీ పరిశ్రమలోని పెద్దా చిన్నా, కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతలతోపాటు, స్నేహితులు, అభిమానులు అందరికీ పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. (రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు) ముఖ్యంగా తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జ్యూరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు రాజ్ బహదూర్, తనలోని నటనా నైపుణ్యాన్ని గుర్తించిన బస్ డ్రైవర్, తన ఉన్నతికి కారణమైన సోదరుడు రావు గైక్వాడ్‌తో పాటు తనను రజనీకాంత్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువు కే బాలచందర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన దర్శకులు,నిర్మాతలు, టెక్నీషియన్లు, మీడియాకు, తమిళ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డు అంకితమని రజనీ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, తన సహ నటుడు కమల్‌హాసన్, ఇతర రాజకీయ నాయకులు, హితులు, సన్నిహితులందరికీ ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతీసంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకి ఈ అవార్డును ఇవ్వాలన్న జ్యూరీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించిందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, ఇతర రంగ ప్రముఖుల నుంచి ఆయనకు అభినందనల వెల్లువ కురుస్తోంది. భారతీయ సినిమా పితామహుడుగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో 1963లో ఈ అవార్డును ప్రారంభించారు. అయితే దివంగత పాపులర్ నటుడు శివాజీ గణేషన్, దర్శకుడు కె.బాలచందర్ తర్వాత ఈప్రతిష్టాత్మక అవార్డును పొందిన తమిళ సినీ రంగానికి చెందిన మూడవ వ్యక్తిగా రజనీకాంత్ నిలిచారు. My heart is so full! 😊 @rajinikanth sir♥️#DadasahebPhalkeAward pic.twitter.com/YrNbq26rZM — Nivetha Thomas (@i_nivethathomas) April 1, 2021 -
రజనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను బ్యాడ్ న్యూస్. రజనీకాంత్ రాబోయే తమిళ చిత్రం 'అన్నాట్టే' మరోసారి కరోనావైరస్ మహమ్మారి సెగ తగిలింది. కరోనా, లాక్డౌన్ ఆంక్షలతో దీర్ఘకాలంగా వాయిదా పడి, ఇటీవలే తిరిగి ప్రారంభమైన షూటింగ్‌కు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ సెట్లో కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో అన్నాట్టే షూటింగ్ నిలిపివేశారు. యూనిట్లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రజనీకాంత్‌కు సమీపంగా మెలిగిన సాంకేతిక సిబ్బందికి కరోనా సోకిందని, దీంతో ముందు జాగ్రత్తగా, షూటింగ్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కారణంగా రజనీ గురువారం చెన్నైకి తిరిగి వెళ్లనున్నారని భావిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇచ్చిన అనంతరం రజనీకాంత్, నయనతార తదితరులు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లనున్నారు. (రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!) గత వారం రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి షూటింగ్ నిమిత్తం చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 14 న షూటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ 45 రోజులు ఉండాల్సి ఉంది. ఇటీవలి కాలంలో రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యం, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. అన్నాట్టే షూటింగ్లో 40శాతం మిగిలి ఉందని, తాను రాజకీయాల్లోకి రాకముందే దీన్ని పూర్తి చేస్తానని రజనీకాంత్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా అన్నాట్టే తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా తెరకెక్కుతోంది. సిరుతై శివ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్భు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నాట్టే షూటింగ్ నిరవధికంగా నిలిచిపోగా, సుమారు తొమ్మిది నెలల తరువాత, వారం క్రితం షూట్ తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మరోసారి కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన రేపింది. -
ఒక్కరు కాదు.. వందమంది రజనీలు
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. శనివారం పదుల సంఖ్యలో అభిమానులు రజనీ వేషధారణలో పోయస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిముందుకు చేరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోబో, భాషా, నరసింహ ఇలా హిట్ సినిమాలలోని రజనీ వేషాలను వారు ధరించారు. కొందరు పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. సూపర్ స్టార్ రాజకీయరంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుకుంటున్నారు. కాగా, డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు తలైవర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
హ్యపీ బర్త్‌డే సూపర్‌స్టార్: మోదీ
నేడు సూపర్‌స్టార్ రజనీకాంత్ 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లో నేరుగా రంగ ప్రవేశం చేయనున్నట్లు గతవారం పేర్కొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్ 70వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే మక్కల్ మన్రం( రజనీ అభిమాన సంఘం) నిర్వాహకులు భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి చేరుకొని బ్యానర్లు, రజనీ ఫోటోతో ప్రింట్ చేసిన టీ షర్టులను ధరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్.. కాగా రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ప్రధాని.. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీ.. రజనీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతంగా జీవించాలని, రాజకీయాల్లో విజయాలు సాధించాలని కోరుకుటున్నాను. మీ ప్రత్యేక శైలి ద్వారా ఎన్నో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. అని పేర్కొన్నారు. చదవండి: కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన Dear @rajinikanth Ji, wishing you a Happy Birthday! May you lead a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 12, 2020 ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా శుక్రవారమే రజనీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది (2021) జరగనున్నాయి. ఈ క్రమంలో రజనీ రాజకీయ ప్రవేశం విషయం కేవలం సినిమా రంగంలోనే కాకుండా తమిళనాడు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపులో రజనీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రార్ధిస్తూ మక్కల్ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. చదవండి: రజనీ పార్టీ చిహ్నంగా సైకిల్ గుర్తు!? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Dearest Friend @rajinikanth Happy 70th Birthday & Wish you a wonderful life ahead.Wish you All Success in ur endeavor in politics.U have won millions of hearts through Ur unique style & I trust U will also tread Ur unique path in serving those millions! Stay Blessed!Lots of love! pic.twitter.com/hnCK7Adkgw — Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2020 -
నీకేం కాదు కన్నా.. ధైర్యంగా ఉండు..
చెన్నై: ‘నీకేం కాదు.. ధైర్యంగా ఉండు. అనారోగ్యం నుంచి త్వరలోనే కోలుకుంటావు. కుటుంబ సమేతంగా మా ఇంటికి రండి. నేను నిన్ను చూస్తాను’ ఈ మాటల్ని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన అభిమానిలో ధైర్యాన్ని నింపటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బాషాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారంతా ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూడాలని ఎన్నాళ్లుగానో ఆశిస్తున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కూడా కరోనా కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంట్లోనే ఉంటూ త్వరలోనే ప్రారంభించనున్న రాజకీయ పార్టీ గురించి సుదీర్ఘ చర్చల్లో మునిగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రజనీకాంత్ వీరాభిమానుల్లో ఒకరైన మురళి అనే అతను కరోనా వ్యాధితో ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇతనికి యూరిన్ సమస్య కూడా ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. (చదవండి: రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?) ఇలాంటి పరిస్థితుల్లో మురళి తన ట్విట్టర్లో రజినీకాంత్ గురించి ‘2021లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి అత్యుత్తమ నాయకుడు గాను, ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక గురువుగా రాజ మార్గాన్ని ఏర్పరచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రూ. 25 వేల ఆదాయం వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. నీ సారథ్యంలో నడిచి సేవలు అందించలేకపోతున్నానని బాధపడుతున్నాను’ అని పేర్కొన్నాడు. తన అభిమాని∙గురించి తెలిసిన రజనీకాంత్ అతనికి ఒక వీడియోను పంపారు. అందులో ‘మురళి నేను రజనీకాంత్‌ని మాట్లాడుతున్నాను. నీకేం కాదు కన్నా. ధైర్యంగా ఉండు. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తావు. ఆ తర్వాత దయచేసి కుటుంబంతో సహా మా ఇంటికి రావాలి. నేను మిమ్మల్ని చూస్తాను’ అంటూ రజనీకాంత్ తన అభిమానికి ధైర్యం చెప్పారు. -
నీ కోసం నిరీక్షణ
కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముఖ్య తారాగణంగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఇదే సినిమా తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో రీమేక్ అయింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు తమిళ అనువాదాన్ని చూడబోతున్నారు. తమిళ వెర్షన్‌ని అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతిలో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి అన్ని పాటలను కొత్తగా పొందుపరచారు. సామాజిక మాధ్యమం ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటుగా ఐదు భాషల్లో అనువదించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణసంస్థ వెల్లడించింది. తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్‌ను పెట్టారు. నిర్మాత బామారాజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 30 నిమిషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం’’ అని అన్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
రజనీ 169 ఫిక్స్?
ఈ మధ్య కాలంలో రజనీ సినిమాలు చేస్తున్న స్పీడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం, అది పూర్తయ్యేలోపే నెక్ట్స్ సినిమాకు ముహూర్తం పెట్టడం చేస్తున్నారాయన. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేసిన ‘దర్బార్’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈలోపు దర్శకుడు శివతో ఓ సినిమా కమిట్ అయ్యారు రజనీ. అది ఆయన కెరీర్లో 168వ సినిమా. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇక రజనీ 169వ సినిమాను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్ మీనన్ చెప్పిన కథకు రజనీ ఇంప్రెస్ అయ్యారట. వేల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గణేశ్ ఈ సినిమాను నిర్మిస్తారట. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లేలోగా వీౖలైనన్ని సినిమాలు చేస్తాను అని ఓ సందర్భంలో చెప్పారు రజనీ. అందుకే ఈ స్పీడ్ అయ్యుండాలి. -
మోదీ ప్రమాణ స్వీకారానికి సూపర్‌స్టార్
సాక్షి, తమిళనాడు: దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నర్రేంద మోదీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిష్మా గల నాయకుడు మోదీ అని వర్ణించారు. మోదీ గెలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని ఆయన కోరారు. ఈనెల 30న రెండోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతున్నానని రజనీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పరాజయం పాలైనంత మాత్రానా రాహుల్ రాజీనామా చేస్తాననటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమన్నారు. అధికార పక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని అన్నారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కూటమి కట్టిన బీజేపీ బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. రజనీతో మరో తమిళ నటుడు, మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిని మోదీ స్వయంగా ఆహ్వానించారు. దీనిపై కమల్ ఇప్పటివరకూ స్పందిచలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ.. ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. -
తలైవా మానియా..బంపర్ ఆఫర్
ఫస్ట్ డే..ఫస్ట్ షో..ఎలాగైనా చూసెయ్యాలి...ఇదీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోరిక. మరి అలాంటిది ఎప్పటినుంచో ఉత్కంఠగా చూస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ల గ్రేట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా థియేటర్లను పలకరిస్తోంటే.. ఇక ఆ సందడే వేరు. ఆఫీసులకు సెలవుపెట్టి మరీ మూవీకి చెక్కెయ్యాల్సిందే. అదీ తలైవా మానియా. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరుకు చెందిన ఒక స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో బాస్ అంటే వీడేరా అంటూ..ఉద్యోగులు థియేటర్లకు పరుగులు తీయడంలో అతిశయోక్తి ఏముంది... విషయం ఏమిటంటే... కోయంబత్తూరులోని గెట్ సెట్ గో అనే సంస్థ తన ఉద్యోగులకు 2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప్రకటించేసింది. పనినుంచి మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పనిలో పనిగా తలైవా, పద్మవిభూషణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్.. శంకర్ సర్, ప్రతినాయకుడుగా ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్తోపాటు, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసలు కురిపించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజవుతోంది. ముఖ్యంగా దేశీయంగా బాహుబలి-2 రికార్డులను తిరగరాస్తూ వేల థియేటర్లను రోబో చిట్టి పలకరిస్తున్న సంగతి తెలిసిందే. -
ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమే
-
జమిలి ఎన్నికలు మంచి నిర్ణయమే
సాక్షి, చెన్నై: ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటివరకు తమిళనాట విద్యావిధానం చాలా బాగుందని రజనీ కాంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దామని పేర్కొన్నారు. 8 వేస్ గ్రీన్ కారిడార్ అభివృద్ధికి మంచి మార్గమని తెలిపారు. అయితే రైతులకు, భూమి కోల్పొయే వారికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్ యాసిన్‌ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్‌కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు. -
మరో 100 కోట్లతో ఫినిషింగ్ టచ్‌లు...
ఇనుములో బంగారం మొలిచెనే!రోబో తర్వాత వస్తున్న సీక్వెల్ 2.0.అద్భుతంగా ఉండటానికి శంకర్ చేస్తున్నప్రయత్నం మేలిమి బంగారం.ఎప్పుడో దీపావళికి రావాల్సింది.ఉయ్ ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద బ్లాస్ట్. పండగ ఎప్పుడు వస్తుందా అని లుగులు ఎప్పుడు చిమ్ముతుందా అనిశంకరాభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కొందరు డైరెక్టర్లతో చిక్కే.ఉదాహరణకు శంకర్ ‘విజువల్ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్లా కనిపించకూడదు. అవి కథలో భాగం అయిపోవాలి. ప్రేక్షకుడు కథను ఎంజాయ్ చేయాలి’ అంటారు.చిన్నమాటే.కాని దాని బరువు వందల మంది విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ మీద పడుతుంది.శంకర్ తాజా చిత్రం ‘2.ఓ’ లో ఒక అడవి సన్నివేశం ఉంది. అడవినంతా తెర మీద సృష్టించాలి. అడవి కనిపించిన వెంటనే ప్రేక్షకుడు ‘ఆహా... విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయి’ అని అనుకుంటే సినిమా ఓడిపోయినట్టు. ఆ అడవిలో మమేకమైపోయి ఇప్పుడేం జరుగుతుందా అని ఉత్సుకతతో ఉంటే సినిమా గెలిచినట్టు. అడవిలోని ఆకునూ తీగనూ లతనూ మట్టినీ మానునూ పువ్వునూ చాలా సహజంగా విజువల్ ఎఫెక్ట్స్ కాదు అన్నంత బాగా సృష్టించాల్సిన భారం టీమ్ మీద ఉంటుంది.‘2.ఓ’ ఆలస్యానికి బహుశా కారణం ఇదే అయి ఉండవచ్చు. పర్ఫెక్షనిజమే దాని విడుదలకు అడ్డంకి అవుతుండవచ్చు. ఆలస్యం అమృతం అమృతం అంటారు శంకర్.ఆ అమృతం మరింత మధురంగా మారడానికి మరో వంద కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారని కథనం. మరో వందకోట్లు.ఆల్రెడీ ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. ఈ వంద కోట్లతో కలిపి 500 కోట్లు కావచ్చు. భారతదేశంలో ఇంత ఖరీదైన బడ్జెట్‌తో తయారయ్యే చిత్రం ఇదే. ‘బాహుబలి’ రికార్డును ఇది చెరిపేయవచ్చు. కాని ప్రేక్షకుడు కోరుకునేది అదే కదా. ఒక రికార్డు చెరిపే స్థాయిలో మరో రికార్డు సిద్ధం అవుతుండాలి. ఒక గొప్ప సినిమా వచ్చాక మరింత గొప్ప సినిమా సిద్ధమవుతూ ఉండాలి. ‘2.ఓ’ మరింత గొప్ప సినిమా కాబోతున్నదనే సూచనలు కనిపిస్తున్నాయి. సెట్లో కళ్లద్దాలతో... సెట్లో డైరెక్టర్ కళ్లద్దాలతో ఉండటం మామూలే– సైట్ ఉంటే. శంకర్‌కు సైట్ లేదు. కాని ఆయన ‘2.ఓ’ సెట్లో ఎప్పుడూ చాలా శక్తివంతమైన కళ్లద్దాలను పెట్టుకుని ఉంటాడు. అవేమిటో తెలుసా? త్రీడీ కళ్లద్దాలు. హాలీవుడ్ వాళ్లను మించిపోవాలనుకున్నారు శంకర్. హాలీవుడ్లో సినిమాలు 2డిలో తీసి త్రీడిలో కన్వర్ట్ చేస్తుంటారు. కాని ‘2.ఓ’ను డైరెక్ట్‌గా త్రీడీలో చిత్రీకరిస్తున్నారు. షాట్ అయ్యాక మానిటర్ మీద ఆ షాట్ ఎలా వచ్చిందో చూడాలంటే త్రీడీ కళ్లద్దాలు ఉండాలి. శంకర్ ఆ కళ్లద్దాలు పెట్టుకుని షాట్‌ను గమనించుకుని అది ఓకే అయ్యిందనుకున్నాకే నెక్ట్స్ షాట్‌కు వెళతారు. లేదంటే రీషాటే. ఇంత టెక్నికల్ వ్యవహారం నిమగ్నమై ఉన్నందువల్లే ఇప్పటికే మనకు కనుల విందు చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమవుతున్నదో ఏమో. స్క్రిప్ట్‌కు తాళం ‘రోబో’ హిట్ అయ్యాక దానికి సీక్వెల్ తీయాలని 2012లోనే అనుకున్నారు శంకర్. దానికి అవసరమైన కథను రూపకల్పన చేయడానికి తమిళంలో సాహిత్యకారునిగా పేరు గడించిన జయమోహన్‌ను ఎంచుకున్నారు. ‘రోబో’కు పని చేసిన డైలాగ్ రైటర్ మదన్ కార్కె (గీత రచయిత వైరముత్తు కుమారుడు) ఇందులోని టెక్నికల్ డైలాగ్స్ విషయంలో జయమోహన్‌కు సాయం పట్టాడు. ‘నా ఇమేజినేషన్‌కు తగినట్టుగా కథ హ్యూజ్‌గా వైల్డ్‌గా ఎదిగిపోయింది’ అంటారు శంకర్. భారీ సినిమాలకు మహా భారీ ప్రొడ్యూసర్ అయితేనే కరెక్ట్. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పారిశ్రామిక వేత్త, ‘లైకా’ మొబైల్స్ ద్వారా 21 దేశాలలో ఐదు వేల కోట్ల వ్యాపార లావాదేవీలకు ఎదిగిన అల్లిరాజా సుబస్కరన్ దీనికి నిర్మాతగా ముందుకు వచ్చాడు. ఈయన లైకా ప్రొడక్షన్స్ ఇంతకు ముందు విజయ్‌తో ‘కత్తి’ (తెలుగులో ఖైదీ నం.150) వంటి సూపర్ హిట్‌ను సాధించి ఉంది. హీరోగా రజనీకాంత్ ముందే సిద్ధం. కాని విలన్‌గా చాలా పేర్లే వినిపించాయి. ఆర్నాల్డ్ ష్వాస్నెగర్ను, ఆమిర్ ఖాన్‌ను, విక్రమ్‌ను వీరందరినీ దాటి ఆ అద్భుతమైన అవకాశం అక్షయ్ కుమార్‌కు చేరింది. హీరోయిన్గా అమీ జాక్సన్‌ను తీసుకున్నారు. అంతా సిద్ధం అయ్యాక స్క్రిప్ట్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని లాక్ చేశారు శంకర్. ఆయనలోని సుగుణమో దుర్గుణమో ఒకసారి స్క్రిప్ట్‌కు లాక్ చేశాక ఏది రాసుకున్నారో అదే తీయాలి... ఏమైనా ఎంత ఖర్చయినా. ‘ఐ’ సినిమాలో ‘పూలనే కునుకేయమంటా’ పాటను చైనాలో పూలు వికసించే కాలంలో తీయాలని శంకర్ నిర్ణయించుకుని అందుకోసం ఆరు నెలలు వేచి ఉండి వెళ్లి తీశారు. స్డూడియోలో తీసి ఉంటే ఒక వంతు ఖర్చయ్యే పాటకు చైనాలో తీయడం వల్ల పది వంతులు ఖర్చయ్యింది. ఇలాంటి తాళ రాక్షసుడు కనుకనే అలాంటి ఎన్నో సీన్లు ‘2.ఓ’ లో రాసుకున్నాడు కనుకనే వాటన్నింటినీ అనుకున్నట్టుగా తీయడంలో సినిమా విడుదలకు ఆలస్యమవుతున్నదేమో. మరో వంద కోట్లు సినిమా 2017 దీపావళికి వస్తుందని ఆశించారు. జనవరి 1, 2018కి వస్తుందని ఆశించారు. వేసవి సెలవుల్లో గ్యారంటీ అని కూడా అన్నారు. ఆడియో లాంచ్ అయ్యింది. ట్రైలర్ బయటకు వదలకపోయినా ‘కట్’ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయినా విడుదల గురించి హీరో గాని దర్శకుడు కాని ఏమీ మాట్లాడటం లేదు. ఈలోపు రజనీ కాంత్ ‘కబాలి’, ‘కాలా’ తీసుకున్నారు. దర్శకుడు కార్తి సుబ్బరాజ్‌తో మరో సినిమా కూడా చేస్తున్నారు. వీటి ముందు మొదలైన ‘2.ఓ’ మాత్రం విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో వంద కోట్లు విడుదల చేస్తున్నారని వార్త. అయితే ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయడానికే అయి ఉంటుందని ట్రేడ్ పండితుల పరిశీలన. ‘2.ఓ’ ను ప్రపంచ వ్యాప్తంగా 13 భాషలలో ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ అన్ని భాషలకు డబ్బింగ్ పనులు జరగాలి. భారీ క్లయిమాక్స్‌కు తగినట్టుగా ఎఫెక్ట్స్ కోసం మరిన్ని నిధులు అవసరమయ్యాయేమో తెలియదు. ఈ విషయం అటుంచితే ఈ సినిమా కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో థియేటర్లు త్రీడీకి అనువుగా అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఇవన్నీ ముగిశాకే సినిమాను పకడ్బందీగా విడుదల చేయాలని వేచి ఉన్నారో ఏమో తెలియదు. షోలే అవుతుందా? భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘షోలే’ను 1973లో మొదలెట్టి మూడేళ్ల పాటు తీశారు. దీని చిత్రీకరణ సమయంలోనే ఒక్కో హీరో రెండు మూడు సినిమాలు చేశారు. అందరూ ఆ సమయంలో ఇంత ఆలస్యమా అన్నవారే. కాని ఒక మంచి సినిమా అన్ని విధాలా పూర్తవ్వడానికి అంత సమయం తీసుకుంటుంది మరి. ‘2.ఓ’ విషయంలో కూడా ఇదే పునరావృతం అవుతున్నట్టుంది. శంకర్ అభిమానులు, రజనీ అభిమానులు, కమర్షియల్ సినిమా అభిమానులు ‘2.ఓ’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాసులతో కలెక్షన్లతో ఆ వత్తులను వెలిగించాలనుకుంటున్నారు. భూనభోనాంతరాలు దిమ్మెరపోయే వెలుగు ‘2.ఓ’ విడుదలతో సాక్షాత్కరిస్తుందని ఆశిద్దాం. భారీ చిత్రీకరణ ‘2.ఓ’ చిత్రీకరణ సరిగ్గా 2015 డిసెంబర్లో మొదలైంది. అయితే ఇది స్టూడియోల్లో తీసే సినిమా కాదు. భారీ మైదానాలు కావాలి. అందుకే చెన్నై పూనమలై రోడ్‌లోని 160 ఎకరాల ఇ.వి.పి. థీమ్ పార్క్‌ను లీజుకు తీసుకుని దానినే ప్రధాన స్టూడియోగా మలుచుకున్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కూడా 45 రోజులు షూట్ చేశారు. వంద రోజులు షూట్ చేస్తే సాధారణంగా ఒక సినిమా పూర్తయిపోతుంది. కాని వంద రోజుల చిత్రీకరణ తర్వాత సినిమా సగమైనట్టుగా శంకర్ ప్రకటించారు. నూట యాభై రోజుల చిత్రీకరణ తర్వాత మూడు వంతుల సినిమా పూర్తయినట్టు చెప్పారు. 2017 అక్టోబర్‌కు చిత్రీకరణ అధికారికంగా ముగిసింది. కాని అసలు కథ అప్పుడే మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని చోట్ల సగం సెట్లు వేసి మిగిలిన భాగాలను స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా పూర్తి చేశారు. కొన్నిసార్లు అసలు ఏ సెట్ లేకుండా తీసి తెర మీదే సెట్‌ను పూర్తిగా సృష్టించారు. ఉదాహరణకు ఇందులో ఒక పాటను అమి జాక్సన్, రజనీల మీద ఉక్రయిన్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా అక్కడకు వెళ్లి లొకేషన్లను చూసుకుని వచ్చారు కూడా. కాని రజనీకాంత్ అనారోగ్యం వల్ల ఆ పని జరగలేదు. కాని శంకర్ ఉక్రయిన్ అని ఫిక్స్ అయ్యారు కదా. పాట మొత్తం ఉక్రయిన్‌లో తీసినట్టుగానే స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆ ల్యాండ్ స్కేప్స్‌ను సృష్టించారు. దీనికంతా సమయం పడుతుంది. ఈ సమయం వల్లే సినిమా ఆలస్యం అవుతున్నట్టుంది. – వెస్లీ గోపాల్ -
‘ఇంకా ఆ ఘడియ రాలేదు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఈ వేడుకకు వచ్చిన వారంతా ఏ విషయంపై ఎదురుచూస్తున్నారో ఊహించగలను, నేనేం చేసేది.. ఇంకా ఆ సమయం రాలేదు’ అని నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కాలా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన అనేక విషయాలను నర్మగర్భంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం ఇంకా జాప్యం జరగనున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘‘గత నాలుగు దశాబ్దాలుగా నా పనైపోయిందని కొందరు హేళన చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రజలు, ఆ దేవుడు నేను ముందుకు సాగేలా చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు, ఆక్షేపణలు చేసినా నా మార్గంలో నేను పయనిస్తూనే ఉంటా. దక్షిణాదిన నదుల అనుసంధానం నా కల. ఒకవేళ ఈ కల నెరవేరకపోయినా ఫరవాలేదు. మన ఆలోచనలే బలం, మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలు తుడిచివేయండి, అపుడే జీవితం బాగుంటుంది. సినిమాల పరంగా అనేక విషయాలు మాట్లాడాను, అయితే అందరూ మరో విషయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి’’అని రజనీ ప్రసంగం ముగించారు. -
కాలా రిలీజ్ వాయిదా?
హాటైన సమ్మర్లో దీటైన ‘కాలా’ రౌడీయిజాన్నీ థియేటర్స్‌లో కూల్‌గా ఏంజాయ్ చేద్దామనుకున్న అభిమానుల ఆశలకు బ్రేక్ పడింది. ‘కాలా’ చిత్రం విడుదల వాయిదా పడిందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్.పా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో ధనుష్ నిర్మించారు. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బంద్ కారణంగా ‘కాలా’ చిత్రం రిలీజ్ వాయిదా వేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రంజాన్‌కు రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘కాలా’ రంజాన్‌కు థియేటర్స్‌లోకి వస్తే సల్మాన్‌ఖాన్‌తో బాక్సాఫీస్ వద్ద ఢీ తప్పదు. రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘రేస్ 3’ చిత్రాన్ని కూడా రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. ‘కాలా’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో? వెయిట్ అండ్ సీ. -
2.0తో తలపడటంపై అమీర్..
సాక్షి, ముంబై : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్లతో డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 2.0 ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుందని సమాచారం. అయితే ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ల థగ్స్ ఆఫ్ హిందుస్ధాన్ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహలు జరుపుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. రజనీ 2.0తో తన సినిమా తలపడనుందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమీర్ బదులిస్తూ 2.0 తన సినిమాతో లేదా మరో సినిమాతో తలపడబోదని చెప్పారు. ఆ రోజు 2.0 మూవీ విడుదల కాబోదని సంకేతాలు పంపారు. రజనీకాంత్ వంటి పెద్దస్టార్ మూవీ తమ చిత్రాలతో పాటు విడుదలైతే తమకు ఇబ్బంది అవుతుందని వ్యాఖ్యానించారు. రజనీని తాను చాలా గౌరవిస్తానని ఈ సందర్భంగా ఆమీర్ చెప్పుకొచ్చారు. దీపావళి రోజు తన భార్య బర్త్‌డే కూడా కావడంతో అదే రోజు మూవీని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.