కరుణానిధితో రజనీకాంత్‌ భేటీ | rajanikanth meets karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణానిధితో రజనీ భేటీ

Published Wed, Jan 3 2018 8:16 PM | Last Updated on Wed, Jan 3 2018 8:24 PM

rajanikanth meets karunanidhi - Sakshi

సాక్షి, చెన‍్నై: తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బుధవారం రాత్రి డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్ళిన ఆయనకు స్టాలిన్‌, కనిమెళి తదితర నేతలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కరుణానిధి ఆరోగ‍్యంపై రజనీకాంత్‌ ఆరా తీశారు. రజనీకాంత్‌ వస‍్తున్నట్లు సమాచారంతో కరుణానిధి నివాసానికి డీఎంకే కార‍్యకర‍్తలు తండోపతండాలుగా చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా రజనీ అభిమానులు, డీఎంకే కార‍్యకర‍్తలతో కిటకిటలాడింది. కరుణానిధితో రజనీ కాంత్‌ 20 నిముషాలపాటు భేటీ అయ్యారు.

రాజకీయ ప్రకటన తర్వాత రజనీకాంత్‌ డీఎంకే అధినేతను కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర‍్చనీయాంశమైంది. అయితే తాను కరుణానిధిని మర్యాద పూర‍్వకంగానే కలిశానని రజనీకాంత్‌ ఈ సందర‍్బంగా మీడియాతో చెప్పారు. రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న నేపథ్యంలో కరుణానిధి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానన్నారు. అలాగే కరుణానిధికి కొత‍్త సంవత‍్సర శుభాకాంక్షలు చెప్పానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement