
సాక్షి, చెన్నై: కంటికి తగిలిన గాయంతో 66 ఏళ్లపాటు కరుణానిధి కళ్లజోడును ధరించాల్సి వచ్చింది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో 1952లో తిరుప్పత్తూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, గాయాన్ని లెక్కచేయకుండా దాల్మియాపురం పేరును కళ్లకుడిగా మార్చాలని నినదిస్తూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆరు నెలలు కారాగార జీవితాన్ని అనుభవించారు.
ఈ పరిణామాలతో కంటికి తగిలిన గాయం మరింత తీవ్రమైంది. వైద్యులు చికిత్స చేయగా.. అప్పటి నుంచి కళ్లజోడు ధరిస్తూ వచ్చారు. 66 ఏళ్లపాటు కరుణానిధి నల్ల కళ్లజోడు ధరించారు. తొలినాళ్లలో సాధారణ కళ్లజోడు ఉపయోగించినా, తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసిన కళ్లజోడు ఉపయోగించారు.
2010 నుంచి కుర్చీకే పరిమితం
2010లో కరుణకు ఆరోగ్య సమస్యలు తలెత్తి కొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. తర్వాత నడక కష్టతరంగా మారింది. దీంతో అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కు పరిమితం అయ్యారు. విదేశాల నుంచి కరుణ కోసం ప్రత్యేక సదుపాయంతో కూడిన వీల్‌చైర్‌ను దిగుమతి చేశారు. ఈ వీల్‌చైర్‌లోనే ఆయన ప్రజల్లోకి వచ్చేవారు.
Comments
Please login to add a commentAdd a comment