సాక్షి, చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బుధవారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ చెకప్ కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శ్వాస నాళాల (ట్రాకియోటమీ) సంబంధిత చికిత్స కోసం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి గతకొంతకాలంగా చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. ఈ చికిత్స ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకోసారి ట్రాకియోటమీ ట్యూబ్స్ (శ్యాస నాళాలు) మార్చాల్సి ఉంటుందని, ఈ చికిత్స కోసమే ఆయన ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment