
సాక్షి, చెన్నై: ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.
ఇప్పటివరకు తమిళనాట విద్యావిధానం చాలా బాగుందని రజనీ కాంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దామని పేర్కొన్నారు. 8 వేస్ గ్రీన్ కారిడార్ అభివృద్ధికి మంచి మార్గమని తెలిపారు. అయితే రైతులకు, భూమి కోల్పొయే వారికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్ యాసిన్‌ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్‌కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు.