tamilanadu government
-
గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్.. సంబరాలు రద్దు
చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. సంబరంగా కాకుండా నామమాత్రంగా వేడుకలు నిర్వహించాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో కాకుండా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది. అట్టహాసంగా వేడుకలు వద్దని.. ర్యాలీలు నిషేధమని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని వేడుకలపై ఆంక్షలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్వాతంత్ర్య సమరయోధులను వారి ఇళ్లకే వెళ్లి సన్మానించాలని తెలిపింది. విద్యార్థులు, వయోధికులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా టీవీ, రేడియో, సోషల్ మీడియాలో గణతంత్ర వేడుకలు వీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఆ హోర్డింగులకు మా అనుమతి అక్కర్లేదు
సాక్షి, చెన్నై : ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లను స్వాగతిస్తూ బ్యానర్లు పెట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. అంతేకాక, ఇలాంటి విషయాల్లో తమ అనుమతి అవసరం లేదని వ్యాఖ్యానించింది. వివరాల్లోకెళితే.. అక్టోబరు 11, 12 తేదీల్లో ఇరు దేశాల నాయకుల మధ్య తమిళనాడులోని పర్యాటక పట్టణమైన మామళ్లపురంలో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ పట్టణం చెన్నై విమానాశ్రయం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేస్తామని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే ఇంతకు ముందు బ్యానర్లు, ప్లెక్సీలను మద్రాస్ హైకోర్టు నిషేధించింది. 20 రోజుల క్రితం ప్లెక్సీ కారణంగా ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెక్సీలు, బ్యానర్లు కట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తొలగించి దాదాపు 650 మందిపై అధికారులు కేసులు పెట్టారు. (చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్) ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ హైకోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశారు. అగ్రశ్రేణి ప్రముఖుల పర్యటనల సందర్భంగా వారి గౌరవార్ధం హోర్డింగులు ద్వారా స్వాగతించడం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంప్రదాయమని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయని పిటిషన్లో పేర్కొన్నారు. అందువలన తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.సత్యనారాయణన్, జస్టిస్ శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ పైన పేర్కొన్న విధంగా స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు హోర్డింగులు పెట్టకుండా మాత్రమే నిషేధించామని ప్రభుత్వానికి కాదని తెలిపింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష డీఎమ్‌కే వ్యతిరేకిస్తోంది. దీని వెనుక రహస్య ఎజెండా ఉందని, దీన్ని సాకుగా చూపి భారీ సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని డీఎంకే నేత స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. -
డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించం
సాక్షి, చెన్నై: బోనస్, వేతన సవరణలపై ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చెన్నై నగర ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారు. రవాణా సంస్థ ఉద్యోగులు ఉదయం నుంచి సమ్మెకు పిలుపునివ్వటంతో నగరవ్యాప్తంగా తిరిగే 4000 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్యాలయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండులలో పడిగాపులు కాస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే అదనుగా ఆటోవాలాలు అందినకాడికి దండుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించమని రవాణా సంస్థ ఉద్యోగులు కరాఖండిగా చెప్పటంతో ప్రయణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమే
-
జమిలి ఎన్నికలు మంచి నిర్ణయమే
సాక్షి, చెన్నై: ఒకే దేశం ఒకే ఎన్నికలు మంచి నిర్ణయమేనని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దీని వలన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి తమ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఇప్పటివరకు తమిళనాట విద్యావిధానం చాలా బాగుందని రజనీ కాంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలని ఆశిద్దామని పేర్కొన్నారు. 8 వేస్ గ్రీన్ కారిడార్ అభివృద్ధికి మంచి మార్గమని తెలిపారు. అయితే రైతులకు, భూమి కోల్పొయే వారికి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరారు. తనను స్ఫూర్తిగా తీసుకొని దొరికిన యాభై వేల రూపాయలను పోలీసులకు అందించిన మహ్మద్ యాసిన్‌ను రజనీ అభినందించారు. అదేవిధంగా ఏడేళ్ల యాసిన్‌కు అతను చదువుకునేంత వరకు విద్యాబ్యాసం చేయిస్తానని హామీ ఇచ్చారు. -
బస్ ఛార్జీలు తగ్గించండి: జీవీ ప్రకాశ్
చెన్నై : తమిళనాడులో సౌత్ హీరోలు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వగా, ఇక ప్రకాశ్ రాజ్, విశాల్ వంటి వారు కూడా రాజకీయాలపై స్పందిస్తున్నారు. అవసరం అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కూడా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై స్పందించారు. పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ అతడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. బస్సు ఛార్జీల ధరల పెంపుపై ఇప్పటికే సామాన్య ప్రజలతో పాటు విపక్షాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్... బస్సు ఛార్జీల పెంపుపై ప్రభుత్వం మరోసారి సమీక్ష నిర్వహించాలని కోరారు. ధరల పెంపు సామాన్య ప్రజలతో పాటు పేదలపై పెను భారం పడుతోందంటూ అతడు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా తమిళనాడు ప్రభుత్వం ఒక్కసారిగా బస్సు ఛార్జీలను 67శాతం పెంచేసిన విషయం విదితమే. -
తమిళ సర్కార్‌కు నోటీసులు
సాక్షి,చెన్నై: దివంగత సీఎం జయలలిత పోయెస్‌గార్డెన్ నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చాలన్న పళనిస్వామి సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయ మేనకోడలు దీప దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీప పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ కే రవిచంద్రబాబు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం జయ ఆస్తులు తనకు, తన సోదరుడు జే దీపక్‌కు చెందుతాయని ఈ పిటిషన్లో దీప పేర్కొన్నారు. జయ ఆస్తులపై తన హక్కులో జోక్యం చేసుకోరాదాని కోరుతూ ఆగస్టు 22న ప్రభుత్వానికి తాను లేఖ ద్వారా విజ్ఞప్తి చేశానని, దీనిపై సంబంధిత అధికారులను తన ఆస్తులు తనకు సంక్రమించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించాలని కోర్టును కోరింది. 2016, డిసెంబర్ 5న జయలలిత మరణించిన క్రమంలో పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం సహా ఆమె యావదాస్తికి తాను, తన సోదరుడు న్యాయపరంగా వారసులవుతామని దీప పేర్కొన్నారు. -
16 ఐటమ్స్‌తో అమ్మా బేబీ కేర్ కిట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నవజాత శిశువులకు.... అమ్మా బేబీ కేర్ కిట్ పేరుతో ముఖ్యమంత్రి జయలలిత మరో పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.67 కోట్లు ఖర్చు కానుంది. ఈ విషయాన్ని జయలలిత మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. వెయ్యి రూపాయల విలువ చేసే ఈ కిట్‌లో పుట్టిన బిడ్డకు కావల్సిన 16 వస్తువులు ఉంటాయి. ఇందులో టవల్, బేబీ డ్రస్, బేబీ బెడ్, ప్రొటక్షన్ నెట్, న్యాప్కిన్, బేబీ ఆయిల్, షాంపు, సాచెట్, సోప్ బాక్స్, సోప్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయ్తో పాటు తల్లికి హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో పాటు సోప్ ఉంటుంది. కాగా జయలలితకు తమిళనాడు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ వాటర్ బాటిళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు సగటు జీవి ఏకైక వినోద సాధనమైన సినిమాను నిరుపేదలకు సైతం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో వారికి అందుబాటు ధరల్లో అమ్మ థియేటర్లను ప్రవేశపెడుతోంది. అలాగే నాణ్యమైన, సరసమైన ధరలకు రైతులకు 'అమ్మ సీడ్స్' పేరుతో విత్తనాలను అందుబాటులోకి తేనుంది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఈ కేసులోని ఏడుగురు దోషులను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది దేశంపై జరిగిన దాడిగా కేంద్రం పేర్కొంది. ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వారిని విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతక వైఖరి అవలంభించకూడదని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
రాజీవ్ హంతకుల విడుదలకు నిర్ణయం
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మర్నాడే తమిళనాడు ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయ లబ్దిపొందేందుకు తహతహలాడుతున్న ఏఐఏడిఎంకే పార్టీకి రాజీవ్ హంతకులు వరంలా కలిసొచ్చారని పరిశీలకులంటున్నారు. మరణశిక్ష అమలులో తీవ్రమైన జాప్యం జరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. రాజీవ్ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంతో పాటు.. ఇప్పటికే 23ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన దరమిలా.. రెమిషన్ ఇచ్చి విడుదల చేసే నిర్ణయాధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే స్పందించిన డిఎంకే, ఎండిఎంకే, సిపిఐలు వారిని వెంటనే విడుల చేయాలని డిమాండ్ చేశాయి. శ్రీలంకలో తమిళుల అణచివేత నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తమిళ సెంటిమెంటును ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మలచుకోడానికి వేగంగా పావులు కదిపిన జయలలిత ప్రభుత్వం.. ఆఘమేఘాల మీద వారి విడుదలకు ఆదేశించింది.