సాక్షి,చెన్నై: దివంగత సీఎం జయలలిత పోయెస్‌గార్డెన్ నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చాలన్న పళనిస్వామి సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయ మేనకోడలు దీప దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీప పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ కే రవిచంద్రబాబు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం జయ ఆస్తులు తనకు, తన సోదరుడు జే దీపక్‌కు చెందుతాయని ఈ పిటిషన్‌లో దీప పేర్కొన్నారు.
జయ ఆస్తులపై తన హక్కులో జోక్యం చేసుకోరాదాని కోరుతూ ఆగస్టు 22న ప్రభుత్వానికి తాను లేఖ ద్వారా విజ్ఞప్తి చేశానని, దీనిపై సంబంధిత అధికారులను తన ఆస్తులు తనకు సంక్రమించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించాలని కోర్టును కోరింది. 2016, డిసెంబర్ 5న జయలలిత మరణించిన క్రమంలో పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం సహా ఆమె యావదాస్తికి తాను, తన సోదరుడు న్యాయపరంగా వారసులవుతామని దీప పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment