గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్‌.. సంబరాలు రద్దు | In Republic Day celebrations No Cultural Activities | Sakshi
Sakshi News home page

గణతంత్రంపై కరోనా ఎఫెక్ట్‌.. సాంస్కృతిక సంబరాలు రద్దు

Published Fri, Jan 22 2021 1:24 PM | Last Updated on Fri, Jan 22 2021 1:26 PM

In Republic Day celebrations No Cultural Activities - Sakshi

చెన్నై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై ఇంకా తొలగలేదు. కేసుల నమోదు కొనసాగుతుండడంతో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు మొదలైనా నిబంధనలు... తగు జాగ్రత్తలతో ప్రజలు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. సంబరంగా కాకుండా నామమాత్రంగా వేడుకలు నిర్వహించాలని పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరేడ్‌ గ్రౌండ్‌లో కాకుండా నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌లో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలనే యోచనలో ఉంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంది.

అట్టహాసంగా వేడుకలు వద్దని.. ర్యాలీలు నిషేధమని ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని వేడుకలపై ఆంక్షలు విధించింది. సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండానే జెండా వందనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్వాతంత్ర్య సమరయోధులను వారి ఇళ్లకే వెళ్లి సన్మానించాలని తెలిపింది. విద్యార్థులు, వయోధికులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా టీవీ, రేడియో, సోషల్‌ మీడియాలో గణతంత్ర వేడుకలు వీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement