చైనా అనుసరిస్తున్న కఠినమైన జీరో కోవిడ్ పాలసీని ప్రజలు వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున బహిరంగంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నిరసకారులను అరెస్టు చేసి నిసనలను కట్టడి చేసేలా ఉక్కుపాదం మోపాలనుకుంది. సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎక్కువ అవ్వడంతో చైనా ప్రభుత్వం ఇక గత్యంతరం లేని స్థితిలో వెనక్కి తగ్గి ఆంక్షలు సడలించింది. ఆ తర్వాత నాటి నిరసనలు కారణంగా అరెస్టు అయినా ఆందోళకారులను ఒక్కోక్కరిని నెమ్మదిగా విడుదల చేసింది.
ఐతే యాంగ్ జింగ్ అనే 25 ఏళ్ల మహిళ డిసెంబర్ 4న నిరసనల్లో పాల్గొనడంతో అరెస్టయ్యింది. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆమె నిర్బంధించబడి సుమారు 9 రోజుల అయ్యిందని ఆమె తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఆ యువతి జైలులో ఎలా ఉందోనని ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అంతేగాదు సదరు యువతి రూమ్‌మేట్‌ని ఆమె మాత్రమే ఎందుకు నిర్బంధంలో ఉందని యువతి తల్లి ప్రశ్నించగా...ఆమె నిరసనలో పాల్గొన్నప్పుడూ తన ఐడింటిటీని చూపించలేదని తెలిపింది.
దీంతో పోలీసుల బృందం తన రూమ్ వద్దకు వచ్చి ఫోన్, ల్యాప్‌టాప్‌ని తీసుకువెళ్లారని ఆ యువతి స్నేహితురాలు ఆమె తల్లితో చెప్పింది. ఆ యువతి తల్లి ఆమె కూతురు కోసం డిసెంబర్ 8న ఒక లాయర్ వెంట బెట్టుకుని ఆమె కేసును టేకప్ చేసిన పోలీస్ అధికారిని కలిసేందుకు అవకాశం లేదని ఆమె వాపోయింది. కనీసం ఆమె గురించి సమాచారం కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది.
(చదవండి: ఆంక్షలను ఎత్తివేశాక..చైనాలో ఘోరంగా పెరుగుతున్న కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment