ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది.
మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.
కమిటీలో అనురాగ్ ఠాకూర్, అనిల్ బలూనీ, సంబిత్ పాత్రా, శ్రీకాంత్ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment