సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో టీమిండియా ఆటగాళ్లు కుల్దీప్‌యాదవ్, వాషింగ్టన్ సుందర్ సందడి చేశారు. ముంబైలోని రజనీకాంత్ నివాసంలో వీరిద్దరూ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాతో తొలి వన్డే అనంతరం వీరిద్దరూ రజనీ నివాసానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కాగా వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సూపర్ స్టార్ స్టేడియంకు కూడా వచ్చారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మెరకు ఆయన అక్కడకు విచ్చేశారు. ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్‌తో కలిసి రజని మ్యాచ్‌ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తేడాతో భారత్ ముందంజ వేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్. . 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజాలు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బౌలింగ్‌లో మహ్మద్ షమీ, సిరాజ్ తలా 3 వికెట్లతో ఆసీస్‌ను కట్టడి చేయగా.. జడేజా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు
చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
IND Vs AUS: అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్ విజయంపై గురి
Comments
Please login to add a commentAdd a comment