
భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 38 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు తలా మూడు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కోపంతో ఊగిపోయారు.
ఏం జరిగిందంటే?
ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. మూడో బంతికి డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా కుల్దీప్ సంధించాడు. ఈ క్రమంలో బంతి క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు రోహిత్, విరాట్ ఎల్బీకీ అప్పీలు చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు.
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, స్లిప్‌లో ఉన్న కోహ్లితో చర్చలు జరిపి రివ్యూ తీసుకోనేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్ కుల్దీప్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తిరష్కరించి బౌలింగ్ వేసేందుకు తన స్ధానానికి వెళ్లిపోయాడు. దీంతో కుల్దీప్‌పై రోహిత్, కోహ్లి కోపంతో ఊగిపోయారు. అయితే తర్వాతి రిప్లేలో బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ICC Rankings: నెం1 ర్యాంక్‌ను కోల్పోయిన సిరాజ్.. టాప్ ర్యాంక్ ఎవరిదంటే?
— javed ansari (@javedan00643948) March 22, 2023
Comments
Please login to add a commentAdd a comment