ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్, జైలర్ రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే తెరపైకి వచ్చాయి. భోళాశంకర్ భారీ డిజాస్టర్ కాగా, జైలర్ సూపర్ హిట్ కొట్టింది.
(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి)
‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. జైలర్ విజయంలో అనిరుధ్ కూడా ఒక కారణమని, ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజీఎం సూపర్ అని రజనీ తెలిపాడు. సినిమా రీరికార్డింగ్‌కి ముందు చూసినప్పుడు అంతగా బెటర్ అనిపించలేదు కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత జైలర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని ఆయన తెలిపాడు. ఒక రకంగా జైలర్‌ను అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కాపాడిందని రజనీకాంత్ పరోక్షంగా ఒప్పుకున్నాడు.
అలాంటి పరిస్థితి మనది కాదు: చిరంజీవి
ఒక సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలా ఉండాలో తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడాలి అని మెగాస్టార్ అన్నారు. అభిమానుల కోసం నేను ఎప్పుడూ డ్యాన్స్‌లు, ఫైట్‌లు చేయాలని ఉంటుంది. నా నుంచి వారు కూడా అదే ఆశిస్తారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారు. కొందరు నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్‌లు సొంతం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది.
(ఇదీ చదవండి: ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో తెలుగు నటి గాయత్రి)
కానీ.. అలా చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు. అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక- నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి. కానీ ఒక సీన్లో విషయం లేకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారు.' అని చిరంజీవి అన్నారు. ఇప్పుడా కామెంట్లను జైలర్ సినిమాకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు. జైలర్ సినిమాను ఉద్దేశించే మెగాస్టార్ ఆ కామెంట్లు చేశాడని కొందరు అంటుండగా.. ఉన్న విషయమే ఆయన చెప్పాడని మరికొందరు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment