ఒక్కరు కాదు.. వందమంది రజనీలు | Rajinikanth Fans In Rajini Getup For His 70th Birthday | Sakshi
Sakshi News home page

ఒక్కరు కాదు.. వందమంది రజనీలు

Published Sat, Dec 12 2020 8:43 PM | Last Updated on Sat, Dec 12 2020 8:46 PM

Rajinikanth Fans In Rajini Getup For His 70th Birthday - Sakshi

రజనీ వేషధారణలో అభిమానులు

సాక్షి, చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. శనివారం పదుల సంఖ్యలో అభిమానులు రజనీ వేషధారణలో పోయస్​ గార్డెన్‌లోని ఆయన ఇంటిముందుకు చేరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోబో, భాషా, నరసింహ ఇలా హిట్‌ సినిమాలలోని రజనీ వేషాలను వారు ధరించారు. కొందరు పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. సూపర్‌ స్టార్‌ రాజకీయరంగ ప‍్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుకుంటున్నారు. కాగా, డిసెంబర్‌ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు తలైవర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement