సాక్షి, ముంబై : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్‌లతో డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 2.0 ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుందని సమాచారం. అయితే ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌ల థగ్స్ ఆఫ్ హిందుస్ధాన్ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహలు జరుపుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమీర్ ఖాన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
రజనీ 2.0తో తన సినిమా తలపడనుందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమీర్ బదులిస్తూ 2.0 తన సినిమాతో లేదా మరో సినిమాతో తలపడబోదని చెప్పారు. ఆ రోజు 2.0 మూవీ విడుదల కాబోదని సంకేతాలు పంపారు. రజనీకాంత్ వంటి పెద్దస్టార్ మూవీ తమ చిత్రాలతో పాటు విడుదలైతే తమకు ఇబ్బంది అవుతుందని వ్యాఖ్యానించారు. రజనీని తాను చాలా గౌరవిస్తానని ఈ సందర్భంగా ఆమీర్ చెప్పుకొచ్చారు. దీపావళి రోజు తన భార్య బర్త్‌డే కూడా కావడంతో అదే రోజు మూవీని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment