పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా.. అఫిషియల్‌ సినిమా ప్రకటన | Its Official, Rana Daggubati Joins Cast Of Rajinikanth Next Thalaivar 170 Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rana Daggubati: పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా.. అఫిషియల్‌ ప్రకటన

Oct 3 2023 12:22 PM | Updated on Oct 3 2023 12:38 PM

Rana Daggubati In Rajinikanth 170 Movie - Sakshi

జైలర్‌ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్‌తో సినిమా అనేసరికి పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలను పెంచేశాయి.

(ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది)

అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్‌ పెట్టకోని  లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.  తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్‌గా లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్‌గా రానా పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్‌ ప్రాజెక్ట్‌లో ఆయన రోల్‌ ఎంటి అనేది ప్రకటించలేదు.

ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్‌, రిత్విక సింగ్‌ వంటి యంగ్‌ హీరోయిన్స్‌తో పాటు  మలయాళ నటి మంజు వారియర్‌ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement