
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్‌తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్‌లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు.
లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్‌లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్‌లో తన ఫేట్‌ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు.
(ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్)
లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్‌లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment