Subaskaran
-
స్టార్ డైరెక్టర్ దెబ్బతో 'లైకా ప్రొడక్షన్స్' క్లోజ్..!
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. తమిళ, హిందీ, మలయాళంలో చాలా సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ప్రస్తుతం తీరని నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నిర్మాణ సంస్థను పూర్తిగా షట్‌డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో విజయ్ 'కత్తి' సినిమాతో లైకా ప్రొడక్షన్స్‌ను సుభాస్కరన్ ప్రారంభించారు. కేవలం పదేళ్ల జర్నీలో మొదట మంచి విజయాలను అందుకున్న నిర్మాతగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం.. అవి బాక్సాఫీస్ వద్ద తీరని నష్టాన్ని మిగల్చడం వల్ల ఆయన చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం.ముఖ్యంగా టాప్ డైరెక్టర్ శంకర్ వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీగా నష్టపోయిందని కథనాలు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన భారతీయుడు-2 (రూ.300 కోట్లు), రోబో 2.O (రూ. 570 కోట్ల) బడ్జెట్ పెట్టారు. 2018 నుంచి ఈ చిత్రాలను తెరకెక్కించడంలో జాప్యం ఏర్పడింది. దీంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయి. ఆపై రెండు పార్ట్‌లుగా తీయడం వల్ల బడ్జెట్ దాటిపోయింది. ఈ రెండు సినిమాలు విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. భారతీయుడు-2 సినిమా అయితే ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌తో ఓటీటీ డీల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు భారతీయుడు పార్ట్-3 కొనుగోలు చేసే వారు ఎవరూ లేకపోవడంతో కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. అలా శంకర్ కొట్టిన దెబ్బతో లైకా భారీగా నష్టపోయినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.రజినీకాంత్ మూవీ ‘లాల్ సలామ్’తో పాటు అజిత్ ‘విడాముయర్చి’ కూడా లైకాను ముంచేశాయి. ‘విడాముయర్చి’ సినిమా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టి తీయడంతో ఆ సంస్థపై కాపీ రైట్ కేసు పడింది. దీంతో సెటిల్మెంట్ కోసం భారీగానే డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపై సినిమా కూడా పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. ఇలా వరుస దెబ్బలతో లైకా కోలుకోలేకపోయింది. ఇలా లైకా నష్టాల్లో పలు సినిమాల ప్రభావం ఉన్నప్పటికీ శంకర్ తెరకెక్కించిన చిత్రాలే ఎక్కువ దెబ్బ కొట్టాయిని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే లైకా రిలీజ్ చేయాల్సిన మోహన్‌లాల్ ‘ఎల్-2 ఎంపురన్’ మూవీని కూడా మరో సంస్థలకు అప్పగించేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ హక్కులను దిల్‌రాజు కొనుగోలు చేశారు. ఈ మూవీ తర్వాత లైకా అధినేత సుభాస్కరన్ చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పేసి.. తన చేతిలో ఉన్న సినిమాలను వేరే సంస్థలకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయనకు విదేశాల్లో భారీ వ్యాపారాలు ఉండటం వల్లే లైకాను ఇంతవరకు నడపగలిగారని తెలుస్తోంది. ఇప్పుడు దీనిని షట్‌డౌన్ చేసి విదేశాల్లోనే తన వ్యాపారాలను చూసుకోవాలని ఆయన ఉన్నారట. అయితే, ఈ వార్తలు రెండురోజులుగా వైరల్ అవుతున్నప్పటికీ వారి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. -
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్‌తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్‌గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్‌గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్‌లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్‌తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్‌తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్‌లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్‌లో తన ఫేట్‌ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది.