యాక్కై గీతాలావిష్కరణ | Yakkai movie audio released | Sakshi
Sakshi News home page

యాక్కై గీతాలావిష్కరణ

Published Fri, Oct 14 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

యాక్కై గీతాలావిష్కరణ

యాక్కై గీతాలావిష్కరణ

నటుడిగా కృష్ణ ఎదుగుదల ఎనలేని సంతోషాన్నిస్తోందని ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ పేర్కొన్నారు. యువ నటుడు కృష్ణ నటిస్తున్న తాజా చిత్రం యాక్కై. నటి స్వాతి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ పిక్చర్స్ పతాకంపై నవ నిర్మాత ముత్తుకుమారన్ నిర్మిస్తున్నారు. కుళందై వేలప్పన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రిథమిక్ మాస్టర్ యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని సత్యం సినీ థియేటర్‌లో జరిగింది.
 
 చిత్ర ఆడియోను దర్శకుడు విష్ణువర్ధన్ ఆవిష్కరించగా మరో దర్శకుడు కరు పళనీయప్పన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా కరు పళనీయప్పన్ మాట్లాడుతూ చక్కని అర్థవంతమైన చిత్రాలు తమిళంలో తక్కువగానే వస్తున్నాయన్నారు.మంచి కథ,కథనాలతో కూడిన అలాంటి చిత్రాలు విజయం సాధిస్తున్నాయని పేర్కొన్నారు.అలాంటి చిత్రాల వరుసలో ఈ యాక్కై చిత్రం చేరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దర్శకుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఒక్కో చిత్రంతో తన నటనను మెరుగుపరచుకుంటూ మంచి నటుడిగా ఎదుగుతున్న కృష్ణను చూస్తే ఎనలేని సంతోషం కలుగుతోందన్నారు.
 
 ఆ యాక్కై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలందిస్తున్నట్లు పేర్కొన్నారు. తన మనసుకు హత్తుకున్న చిత్రాల్లో యాక్కై ఒకటని సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా అన్నారు. తాను యూ 1 రికార్డ్స్ సంస్థను నెలకొల్పిన తరువాత సంగీతాన్ని అందించిన తొలి చిత్రం యాక్కై కావడం విశేషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు పీఎల్.తేనప్పన్, పట్టియల్ శేఖర్, నటుడు కృష్ణ,నటి స్వాతి, నటుడు శరవణన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement