yakkai
-
డిసెంబర్లో తెరపైకి యాక్కై
యాక్కై చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కుళందై వేలప్పన్ తెలిపారు. యువ నటుడు కృష్ణ, స్వాతి జంటగా నటించిన చిత్రం యాక్కై. ప్రకాశ్‌రాజ్, జోకర్ చిత్రం ఫేమ్ గరు సోమసుందరం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ ఫిలిం పతాకంపై ముత్తుకుమార్ నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ యాక్షన్, సెంటిమెంట్, లవ్, రొమాన్స, కామెడీ వీటిలో ఏ అంశాలతో కూడిన కథ అరుునా దానికి మరింత మెరుగులు దిద్దేది సంగీతం అని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానన్నారు. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని యువన్‌శంకర్‌రాజా తమ యాకై ్క చిత్రానికి అందిస్తున్నారని తెలిపారు. ఆయన సంగీతంలో నటుడు ధనుష్ పాడిన పాట ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తోందన్నారు. ప్రస్తుతం యువన్‌శంకర్‌రాజా నేపథ్య సంగీతాన్ని సమకూర్చుతున్నారని తెలిపారు.యాక్కై చిత్రానికి ఆయన సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు కుళందై వేలప్పన్ వెల్లడించారు. -
యాక్కై గీతాలావిష్కరణ
నటుడిగా కృష్ణ ఎదుగుదల ఎనలేని సంతోషాన్నిస్తోందని ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ పేర్కొన్నారు. యువ నటుడు కృష్ణ నటిస్తున్న తాజా చిత్రం యాక్కై. నటి స్వాతి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ పిక్చర్స్ పతాకంపై నవ నిర్మాత ముత్తుకుమారన్ నిర్మిస్తున్నారు. కుళందై వేలప్పన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రిథమిక్ మాస్టర్ యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు విష్ణువర్ధన్ ఆవిష్కరించగా మరో దర్శకుడు కరు పళనీయప్పన్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా కరు పళనీయప్పన్ మాట్లాడుతూ చక్కని అర్థవంతమైన చిత్రాలు తమిళంలో తక్కువగానే వస్తున్నాయన్నారు.మంచి కథ,కథనాలతో కూడిన అలాంటి చిత్రాలు విజయం సాధిస్తున్నాయని పేర్కొన్నారు.అలాంటి చిత్రాల వరుసలో ఈ యాక్కై చిత్రం చేరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దర్శకుడు విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఒక్కో చిత్రంతో తన నటనను మెరుగుపరచుకుంటూ మంచి నటుడిగా ఎదుగుతున్న కృష్ణను చూస్తే ఎనలేని సంతోషం కలుగుతోందన్నారు. ఆ యాక్కై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలందిస్తున్నట్లు పేర్కొన్నారు. తన మనసుకు హత్తుకున్న చిత్రాల్లో యాక్కై ఒకటని సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా అన్నారు. తాను యూ 1 రికార్డ్స్ సంస్థను నెలకొల్పిన తరువాత సంగీతాన్ని అందించిన తొలి చిత్రం యాక్కై కావడం విశేషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడు పీఎల్.తేనప్పన్, పట్టియల్ శేఖర్, నటుడు కృష్ణ,నటి స్వాతి, నటుడు శరవణన్ పాల్గొన్నారు.