బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్‌లు ప్రముఖ పాడ్‌కాస్ట్ సంస్థ స్పాటిఫై నుంచి వైదొలగిన విషయం విదితమే. అయితే, ఆ తదనంతరం వారు ప్రారంభించిన ‘ఆర్కిటైప్స్’ పాడ్‌కాస్ట్ కోసం మేఘన్ చేసినట్టు చెబుతున్న ఇంటర్వ్యూలు ఆమె చేసినవి కాదని ఒక రిపోర్టులో వెల్లడయ్యింది.
షోలోని కొన్ని ఇంటర్వ్యూలను డచెస్ సిబ్బంది చేశారని పాడ్‌న్యూస్ తెలిపింది. ప్రశ్నలు అడుగుతున్న ఆమె వాయిస్ ఆడియోను ఇంటర్య్యూ మధ్యలో క్లిప్ చేశారని ఆరోపించారు. కాగా స్పాటిఫై, ఆర్కివెల్ పరస్పరం విడిపోవడానికి అంగీకరించాక వారు కలిసి చేసిన సిరీస్ గురించి గర్వపడుతున్నామని ఆ సంస్థలు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేఘన్‌పై ఆరోపణలతో కూడిన ఈ వార్త వెలువడింది.
హ్యారీ, మేఘన్ ప్రారంభించిన ఆర్కివెల్ మీడియా సంస్థ 2020లో $20 మిలియన్ల డీల్‌కు సంబంధించిన పూర్తి చెల్లింపును అందుకునేందుకు తగినంత కంటెంట్‌ను ఉత్పత్తి చేయలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మేఘన్ మరొక ప్లాట్‌ఫారమ్‌లో ‘ఆర్కిటైప్స్’ ప్రేక్షకుల కోసం మరింత కంటెంట్‌ను అందిస్తున్నారని ఆర్కివెల్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఈ విషయంలో స్పోర్ట్స్ రైటర్, పాడ్‌కాస్టర్ బిల్ సిమన్స్ ఈ జంటపై విరుచుకుపడ్డాడు.
తాను ఒకసారి హ్యారీని పాడ్‌కాస్ట్ విషయమై కలిశానని తెలిపాడు. ఈ పాడ్‌కాస్ట్ ఆడియోలో డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి వచ్చిన వ్యాఖ్యల మధ్య యారో వివరణలు, వ్యాఖ్యలు జతచేశారు. అవి అల్లినవి, డైలీ మెయిల్ నవంబర్‌లో నివేదించినవని తేలింది. రాజ దంపతులు రెండు సంవత్సరాల క్రితం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత బయటకు వచ్చేశారు.
అప్పటికి కేవలం 12 ఎపిసోడ్‌లు మాత్రమే రూపొందాయి. జమీలా జమీల్, సెరెనా విలియమ్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్‌తో సహా పలువురు అతిథులతో సంభాషణలతో పాటు నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడే నిపుణులు, విద్యావేత్తలు, రచయితల క్లిప్‌లు ఉన్నాయి. నిపుణుల ఆడియో క్లిప్‌లు మేఘన్ ఆడియో మధ్య జత చేసి ఉన్నాయి. దీంతో ఆమె స్వయంగా కొందరితోనైనా మాట్లాడారా? లేదా అందరితో మాట్లాడారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు.
ఇది కూడా చదవండి: లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్
Comments
Please login to add a commentAdd a comment