తిరుపతి కల్చరల్: ఇటీవల విడుదలై విశేషాదరణ పొందిన ‘మామ మంచు అల్లుడు కంచు’ సక్సెస్ మీట్‌ను శనివారం తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మోహన్‌బాబు యువసేన రాష్ట్ర నేత ఎం.సునీల్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో స్విమ్స్‌కు ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు సక్సెట్ మీట్ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి హీరో మోహన్‌బాబు, అల్లరి నరేష్, హీరోయిన్ పూర్ణ, రమ్యకృష్ణ, మీనా, ఆలీ, బ్రహ్మానందం, నిర్మాత మంచు విష్ణు, చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా మంచు లక్ష్మీ, మంచు మనోజ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అభిమానులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
నేడు తిరుపతికి ‘మామ మంచు అల్లుడు కంచు’ యూనిట్
Published Tue, Jan 19 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement
Advertisement