Senior Actor Naresh Intresting Comments At Mohan Babu Son Of India Pre Release Event - Sakshi
Sakshi News home page

Actor Naresh: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే

Published Tue, Feb 15 2022 12:45 PM | Last Updated on Tue, Feb 15 2022 1:41 PM

Senior Actors Naresh Intresting Comments At Son Of India Pre Release Event - Sakshi

మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం నుంచి టాలీవుడ్‌ పెద్ద ఎవరనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది చర్చ కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు తాజా టిక్కెట్ల రేట్ల సమస్య విషయంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సీనియర్‌ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేష్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన మోహన్‌ బాబు సన్నాఫ్‌ ఇండియా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దన్న మోహన్‌ బాబు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

చదవండి: మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్‌

‘తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్‌ బాబు. ఇండస్ట్రీలో గొప్ప హీరోలున్నారు, గొప్ప విలన్లు ఉన్నారు. గొప్ప క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అన్నీ కలిసిన ఒకే వ్యక్తి మోహన్‌ బాబు. ఆయనకు ఆయనే సాటి. రైతు కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నాయకుడు మోహన్‌ బాబు’ అంటూ నరేశ్‌ వ్యాఖ్యానించాడు. అలాగే ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి అంటూ కొనియాడాడు. దీంతో  నరేష్‌ వ్యాఖ్యలు టాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారాయి.  

చదవండి: ప్రపోజ్‌ చేస్తే జోక్‌ చేశాడనుకున్నా: హీరో నిఖిల్‌ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement