Son Of India Movie
-
సన్ అఫ్ ఇండియా సినిమా డిజాస్టర్ కి కారణం అదే
-
ఓటీటీలో 'సన్ ఆఫ్ ఇండియా' స్ట్రీమింగ్.. ఎక్కడంటే ?
Son of India OTT Release Date: విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సన్ ఆఫ్ ఇండియా. దేశభక్తి ప్రధానంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమాలో మోహన్ బాబు లుక్స్, సంభాషణలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం (మే 17) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, సర్వేష్ మురారి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఈ మూవీకి మోహన్ బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్ బాబు భావోద్వేగం -
సన్ ఆఫ్ ఇండియా
-
ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్
‘‘దర్శకునిగా నా రెండో సినిమా ‘సన్నాఫ్ ఇండియా’. ద్వితీయ చిత్రానికే మోహన్‌బాబు, ఇళయరాజాగార్ల వంటి వారితో పని చేయడం నా అదృష్టం. అలాగే మోహన్‌బాబుగారు అడగ్గానే ఆయన పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. మంచు మోహన్‌బాబు లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ.. ‘‘కరోనా టైమ్‌లో మోహన్‌బాబుగారిని కలిసి, చిన్న ప్రయోగం చేద్దాం అని ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పడంతో ఓకే చెప్పేశారు. చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే.. విష్ణుగారు కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఒప్పుకున్నారు. ఓటీటీ కోసమని ఈ సినిమా తీశాం. ఫైనల్ ఔట్పుట్ చూశాక థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని మోహన్‌బాబుగారు చెప్పడంతో ఇప్పుడు విడుదల చేస్తున్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ప్రశ్నించే విధంగా విరూపాక్ష పాత్ర (మోహన్‌బాబు) ఉంటుంది. ఈ మూవీలో హీరో ప్రైవేట్ జైలుని నడుపుతుండటం కొత్త ఆలోచన. సినిమాని కమర్షియల్‌గా కాకుండా ప్రయోగాత్మకంగా తీశాను. ‘పుణ్యభూమి నా దేశం, రాయలసీమ రామన్నచౌదరి’ లాంటి పవర్ఫుల్ డైలాగులు ఈ సినిమా క్లైమాక్స్‌లో చెప్పారు మోహన్‌బాబుగారు. ఈ చిత్రం ప్రారంభం, క్లైమాక్స్ ఎవరూ మిస్ కావొద్దు. చదవండి: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్ నా ధైర్యం మోహన్‌బాబుగారే.. ఈ చిత్రంలోని డైలాగుల వల్ల ఎలాంటి వివాదాలు వచ్చినా ఆయన చూసుకుంటారు. ఇది మోహన్‌బాబుగారి విలువను తగ్గించే చిత్రమైతే కాదు. మా సినిమా ప్రివ్యూ చూసిన వారు ‘ఇంత సాహసం ఎందుకు చేశారు?’ అంటూనే ‘సినిమా చాలా బాగుంది’ అని అభినందించారు.. ఈ అభినందనలు 18న ప్రేక్షకుల నుంచి వస్తే చాలా హ్యాపీ. ఇండస్ట్రీలో సక్సెస్ అనేదానిపైనే మా తర్వాతి చిత్రాలు ఆధారపడి ఉంటాయి.. ప్రతి దర్శకుడి జీవితం శుక్రవారంతో ముడిపడి ఉంటుంది. ఆ శుక్రవారం తాము హీరో అవుతామా? లేదా? అని ప్రతి డైరెక్టర్ ఎదురు చూస్తుంటాడు. మోహన్‌బాబుగారు, మంచు లక్ష్మీ నటిస్తున్న చిత్రానికి కథ ఇచ్చాను. మోహన్‌బాబుగారి కోసం మరో కమర్షియల్ కథ సిద్ధం చేశాను’’ అన్నారు. -
ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం నుంచి టాలీవుడ్ పెద్ద ఎవరనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది చర్చ కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు తాజా టిక్కెట్ల రేట్ల సమస్య విషయంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దన్న మోహన్ బాబు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చదవండి: మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్ ‘తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్ బాబు. ఇండస్ట్రీలో గొప్ప హీరోలున్నారు, గొప్ప విలన్లు ఉన్నారు. గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అన్నీ కలిసిన ఒకే వ్యక్తి మోహన్ బాబు. ఆయనకు ఆయనే సాటి. రైతు కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నాయకుడు మోహన్ బాబు’ అంటూ నరేశ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి అంటూ కొనియాడాడు. దీంతో నరేష్ వ్యాఖ్యలు టాలీవుడ్ చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య -
రాజకీయాలకు గుడ్‌బై, ఈ జన్మకు వద్దనుకుంటున్నాను
‘‘ఎలాంటి తప్పు చేయని ఓ సాధారణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే కారణంగా జైలుకి వెళతాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడ్డారు? అతను జైలు నుంచి ఎలా బయట పడ్డాడు? తనలాగే ఏ నేరం చేయకుండా జైలులో మగ్గిపోతున్న వారికి ఎలా అండగా నిలిచాడు? అనే కథాంశంతో ‘సన్నాఫ్ ఇండియా’ ఉంటుంది’’ అని హీరో మంచు మోహన్‌బాబు అన్నారు. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో మోహన్‌బాబు లీడ్రోల్లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ► ‘సన్నాఫ్ ఇండియా’ మొదలు పెట్టి దాదాపు మూడేళ్లు అయింది. ఈ సినిమా కథని ‘డైమండ్’ రత్నబాబు చెప్పినప్పుడు ఒక విభిన్న కథ, చాలా బాగుందనిపించింది. మా గురువుగారు(దాసరి నారాయణరావు) కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు.. నేను కూడా చూద్దామని ఈ చిత్రం చేశాను. మా మూవీ సూపర్ హిట్ అవుతుందని చెప్పను. కానీ ప్రేక్షకులు చాలా మంచి సినిమా అని అంటారు. మా చిత్రం యువతరంతో పాటు అందరికీ నచ్చుతుంది. ► ‘సన్నాఫ్ ఇండియా’ ని తొలుత ఓటీటీ కోసం తీశాం. కథకు అవసరం మేరకు ఇద్దరు అమ్మాయిల మధ్య ముద్దు సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. వీటిని విష్ణు ఒప్పుకోలేదు. కానీ, కథకు ఉన్న ప్రాధాన్యత మేరకు పెట్టాల్సి వచ్చింది. ► ‘రాయలసీమ వాళ్లకు భాష తెలియదు’ అనే మాటలు నా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్నాను. నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగు భాష పుట్టింది తిరుపతిలోనే. ఆయా ప్రాంతాల్లో యాసలు వేరు ఉండొచ్చు కానీ భాష ఒక్కటే. భారతదేశంలో విలన్‌గా ఎక్కువ మేనరిజమ్స్ చూపించిన వ్యక్తి నేనే. ఈ విషయంలో నటులు అమ్రిష్ పురిగారు నన్ను అభినందించారు. ► ఈ మూవీలో నాది చాలా వైవిధ్యమైన పాత్ర. డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అందరూ అభినందించేలా ఉంటాయి. నా పాత్రని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ► సమాజంలో హత్యలు, మానభంగాలు చేసేవాళ్లను సమాధి చేయాలి. సొసైటీలో ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్, బస్‌లు, విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్ జైళ్లు కూడా ఉంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నాం. ► నేను డైరెక్షన్ చేయడానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.. సినిమా తీసేటప్పుడు షూటింగ్‌కి సమయానికి రానివారిని ఎక్కడ కొట్టాల్సి వస్తుందేమోఅని భయంగా ఉంది. నా జీవితంపై రాస్తున్న పుస్తకం పూర్తి కావొచ్చింది. నా బయోపిక్‌తో సినిమా చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. లక్ష్మి–నేను కలిసి చేస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. విష్ణుతో కూడా ఓ మూవీ చేస్తా. తిరుపతిలో నాలుగున్నర కోట్లతో సాయిబాబా గుడి నిర్మిస్తున్నాం. ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతుంది. ► ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదు. ఈ జన్మకు వద్దనుకుంటున్నాను. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుగార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ పనులతో బిజీగా ఉన్నాను. ► ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్‌ఫాస్ట్‌కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే కానీ మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్‌గారితో జరిగిన భేటీ గురించి కానీ ఎలాంటి చర్చ జరగలేదు. అప్పుడప్పుడూ కలుద్దాం అనుకున్నాం. అంతే.. దానిపై రకరకాలుగా వార్తలు సృష్టించారు. నానీకి శుభాకాంక్షలు చెబుతూ విష్ణు చేసిన ట్వీట్‌ను కూడా తప్పుబట్టారు. -
పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చాం: మోహన్‌బాబు
‘‘సినిమా నా ఊపిరి’ అని మా గురువు (దాసరి నారాయణరావు)గారు అన్నారు. నా కుటుంబానికి సినిమా ఊపిరి. పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చాం. నటుడిగా, నిర్మాతగా సంపాదించినదాన్ని విద్యా సంస్థల్లో పెట్టాం. అంచలంచెలుగా ఎదిగి అది ఓ యూనివర్సిటీ అయింది. ఇంతకంటే విజయాల గురించి చెప్పదలచుకోలేదు’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంకా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘1982లో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ను స్థాపించి, నేనే నిర్మాతగా, హీరోగా ఓ సినిమా తీయాలని ఏ ధైర్యంతో అనుకున్నానో అనుకున్నాను. అప్పటి టాప్ రైటర్ ఎమ్డీ సుందర్‌గారు ఓ 50 కథలు చెప్పారు.. నచ్చలేదు. అప్పుడు కన్నడంలో రాజ్‌కుమార్‌గారి ‘అనబలం జనబలం’ సినిమా కథ విని, ఓకే అన్నాను.. ‘ఈ సినిమాకు నేనే కథ ఇచ్చాను. అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. ఆలోచించండి’ అని సుందర్‌గారు అన్నారు. అయినా చేస్తానని రిస్క్ తీసుకున్నాను.. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇళ్లు అమ్ముకుని వెళ్లాల్సిందే. అది హిట్ అయింది. ఆది శేషగిరిరావు (నటుడు కృష్ణ సోదరుడు)గారు ‘సినిమా చూశాను.. ఓ పెద్ద సినిమా చెబుతాను. ఆ సినిమాపై వెయ్’ అన్నారు. నా సినిమాయే హిట్టయింది. ఆ సినిమా పేరు ఇప్పుడు అనవసరం. ఓ పెద్ద సినిమాకు పోటీగా నా సినిమాను విడుదల చేసి, రిస్క్ చేశాను. నా రిస్క్ చేసే తత్వమే నన్ను నిలబెట్టింది. జీవితంలో రిస్క్ చేయకపోతే ముందుకు సాగలేం. ఇక డైమండ్ రత్నబాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పగానే విష్ణుకు ఫోన్ చేసి, సినిమా తీద్దాం అన్నాను. ప్రతి విషయానికి ఆలోచించమనే విష్ణు ఏమీ అనకుండా, వెంటనే ‘సన్ ఆఫ్ ఇండియా’ లోగో వేసి పంపాడు. అయితే ఈ సినిమా కాస్త రిస్కే అన్నాడు విష్ణు. ఇందులో ఫ్యామిలీయే కాదు... రాజకీయ అంశాలను ప్రస్తావించాం. ఈ చిత్రంలో ప్రైవేట్ జైలు అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రయత్నించాం. రిస్క్ తీసుకుని సినిమా చేశాం. ఒకవేళ ఫ్లాప్ అయితే మేం అసమర్థులం కాదు. రిస్క్ తీసుకున్నాం’’ అన్నారు. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘రాయలసీమ రామన్నచౌదరి’ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయి, ఇండస్ట్రీకి వచ్చాను. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ఓ సందేశం ఇద్దామని అనుకున్నాం’’ అన్నారు.‘‘సన్ ఆఫ్ ఇండియా’ ఓ కొత్త ప్రయత్నం’’ అన్నారు మంచు విష్ణు. ఇంకా ఈ వేడుకలో మంచు లక్ష్మీ, నటులు పోసాని కృష్ణమురళి, అలీ, సునీల్, దర్శకులు కోదండ రామి రెడ్డి, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎస్. గోపాల్‌రెడ్డి, దర్శకుడు బి. గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ చూశారా?
‘ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది’ అనే మోహన్‌బాబు డైలాగ్‌తో ‘సన్ ఆఫ్ ఇండియా’ ట్రైలర్ విడుదలైంది. మంచు మోహన్‌బాబు హీరోగా ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ, స్వామీ.. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. నేను దాన్నే ఫాలో అవుతున్నా (మోహన్‌బాబు) పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది (తనికెళ్ల భరణి), నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీతో పాటు 138 కోట్ల ఇండియన్స్‌కి చాలా డీటైయిల్డ్‌గా చెబుతాను’ (మోహన్‌బాబు) అనే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. మోహన్‌బాబు హీరోగా నటించడంతో పాటు అదనంగా స్క్రీన్‌ప్లే బాధ్యతను నిర్వర్తించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
రిలీజ్‌కు రెడీ అయిన 'సన్ ఆఫ్ ఇండియా', ఫిబ్రవరి 18న..
సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫిబ్రవరి 25న, 'రాధేశ్యామ్' మార్చి 11న, 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న, 'ఆచార్య' ఏప్రిల్ 29న, 'ఎఫ్ 3' ఏప్రిల్ 28న, 'సర్కారువారి పాట' మే 12న, 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న రిలీజవుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మోహన్ బాబు హీరోగా నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేశభక్తి ఇతడి రక్తంలో ఉందని పేర్కొంటూ మోహన్‌బాబు రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. ఇళయరాజా సంగీతం అందించారు. Patriotism in his blood #SonofIndia🇮🇳 Grand Release in Theaters on 18th February⚡️ 🎶Maestro #Ilaiyaraaja Musical🎵on @adityamusic Proudly produced by @iVishnuManchu & Directed by @ratnababuwriter@24framesfactory #SreeLakshmiPrasannaPictures #SOI🇮🇳 #SonofIndiaFromFeb18th 🔥 pic.twitter.com/MaVukQlWVo — Mohan Babu M (@themohanbabu) February 2, 2022 -
Son Of India: ‘జయ జయ మహావీర’ సాంగ్ వచ్చేసింది
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. -
‘సన్ ఆఫ్ ఇండియా’ రేపు తొలి రిలికల్ సాంగ్
మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 15న ఈ చిత్రంలోని ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మోహన్‌బాబు. ఆ ప్రకటన సారాంశం ఈ విధంగా... ‘నా కెరీర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్ 15న ‘పెదరాయుడు’ రిలీజైన సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత ఈ జూన్ 15న ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కావడం శుభసూచికంగా భావిస్తున్నాను. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు నా కొడుకు విష్ణువర్ధన్ బాబు నిర్మాత కావడం సంతోషదాయకం. ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన శుభ తరుణాన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని మ్యాస్ట్రో ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ గళంతో సాగే లిరికల్ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. శ్రీరాముడికి సంబంధించిన ఈ గత్యాన్ని ఆ మర్యాదా పురుషోత్తముడైన ఆయనకే అంకితమిస్తున్నాను’అని మోహన్‌బాబు పేర్కొన్నారు. -
అప్పుడు నేను, ఇప్పుడు నా కొడుకు..: మోహన్‌బాబు
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు మోహన్‌బాబు. జూన్ 15వ తేదీన సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. తన కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన పెదరాయుడు చిత్రం విడుదలైన రోజే ఈ సాంగ్ రిలీజ్ కాబోతుందన్నాడు. "1995 సంవత్సరం నాటికి తెలుగు సినీ పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు.. ఆ 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరీర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు. 1995 జూన్ 15న పెదరాయుడు రిలీజైన 26 సంవత్సరాల తర్వాత 2021 జూన్ 15న సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కావడం శుభసూచకం.. అప్పుడు పెదరాయుడు చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియాకు నా కొడుకు విష్ణువర్ధన్‌బాబు కావడం సంతోషకరం. పెదరాయుడు రిలీజ్ అయిన శుభతరుణాన సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు రఘువీర గద్యం మ్యాస్ట్రో ఇళయరాజాగారి సంగీత సారధ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాటను శ్రీరాముడికి అంకితమిస్తున్నాను" అని మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. #SonofIndia is coming with 1st Lyrical video song on 15th June the day #CollectionKing Dr. M. MohanBabu Garu’s #Pedarayudu movie released and created box-office history. @themohanbabu pic.twitter.com/d9wnf09Gdp — BARaju's Team (@baraju_SuperHit) June 13, 2021 చదవండి: Son Of India: చిరు పరిచయం, మోహన్‌బాబు డైలాగులతో రచ్చ! -
డైలాగ్ కింగ్‌కి మెగా వాయిస్
మంచు మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం హీరో సూర్య సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌కు ప్రముఖ నటులు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ‘‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’’ అని మోహన్‌బాబు పాత్రను పరిచయం చేశారు చిరంజీవి. ఇంకా మోహన్‌బాబు చెప్పిన ‘నేను చీకట్లో ఉండే వెలుతుర్ని, వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ డైలాగ్స్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘టీజర్‌కు చిరంజీవి అంకుల్ వాయిస్ ఓవర్ అయితే బాగుంటుందని విష్ణు అన్నాడు. చిరంజీవికి ఫోన్ చేసి అడిగితే, ‘వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపు’ అన్నాడు. ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ నేను అడిగిన మూడు రోజులకే నాకు చెప్పకుండా తనే థియేటర్ బుక్ చేసి డబ్బింగ్ చెప్పి, పంపాలనుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసి విష్ణుబాబును పంపాను. ‘నిన్ను (విష్ణును ఉద్దేశిస్తూ) ఎవరు రమ్మన్నారు. డబ్బింగ్ పూర్తి చేసి మీ నాన్నకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను’ అని విష్ణుతో చిరంజీవి అన్నాడు. నేను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించినందుకు చిరంజీవికి ధన్యవాదాలు. అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్యకు ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో వస్తాం’’ అని అన్నారు. -
Son Of India: మోహన్‌బాబు సినిమాకు 'చిరు' వాయిస్ ఓవర్!
చాలా కాలం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '‘సన్ ఆఫ్ ఇండియా'. ఇది దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని టైటిల్ చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రిలీజ్ చేశాడు. "మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. అతడి రూటే సెపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ ఉంటాడో? ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు" అని మోహన్ బాబు గురించి క్లారిటీ ఇచ్చేశాడు చిరు. టీజర్లో ఎన్నో గెటప్పుల్లో కనిపించిన ఈ విలక్షణ నటుడు మరోసారి తన డైలాగులకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. 'నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని', 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అని చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నాడు. Thank you 🙏❤️. https://t.co/XCo4Jha2CR @KChiruTweets @Suriya_offl @iVishnuManchu #SonofIndia pic.twitter.com/LBD1A8szzw— Mohan Babu M (@themohanbabu) June 4, 2021 చదవండి: ఎన్.టి.ఆర్ తర్వాత డైలాగులను బాగా పలుకుతారన్న పేరు ఆ ఒక్కరికే ఉంది -
రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మోహన్ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజుకి లక్షలాది పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుంది. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలో మొదటి డోస్ తీసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తాజాగా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.