
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. తాజాగా సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ సింగర్ రాహుల్ నంబియార్ ఆలపించగా, మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని పాట రూపంలో మలిచారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ పాటను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షేర్ చేస్తూ ‘భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment