Manchu Mohan Babu, Takes Second Dose Of Covid Vaccine: రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మోహన్‌ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి - Sakshi
Sakshi News home page

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న మోహన్‌ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి

Published Sun, Apr 25 2021 11:49 AM | Last Updated on Sun, Apr 25 2021 2:36 PM

Manchu Mohan babu Completed Second Dose Corona Vaccine - Sakshi

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజుకి లక్షలాది పాజిటివ్‌ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానుంది. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలో మొదటి డోస్‌ తీసుకున్న కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తాజాగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.

కాగా, మోహన్‌ బాబు ప్రస్తుతం సన్నాఫ్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement