Mohan Babu Son Of India Trailer Released Video Goes Viral - Sakshi
Sakshi News home page

Son Of India Trailer: సన్‌ ఆఫ్‌ ఇండియా ట్రైలర్‌ చూశారా?

Published Fri, Feb 11 2022 8:08 AM | Last Updated on Fri, Feb 11 2022 10:46 AM

Mohan Babu Son Of India Trailer Released - Sakshi

‘ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది’ అనే మోహన్‌బాబు డైలాగ్‌తో ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ట్రైలర్‌ విడుదలైంది. మంచు మోహన్‌బాబు హీరోగా ‘డైమండ్‌’ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు.

‘ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ, స్వామీ.. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. నేను దాన్నే ఫాలో అవుతున్నా (మోహన్‌బాబు) పోరాటంలో అతని వెనుక ఇండియానే ఉంది (తనికెళ్ల భరణి), నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నీతో పాటు 138 కోట్ల ఇండియన్స్‌కి చాలా డీటైయిల్డ్‌గా చెబుతాను’ (మోహన్‌బాబు) అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ సాగుతుంది. మోహన్‌బాబు హీరోగా నటించడంతో పాటు అదనంగా స్క్రీన్‌ప్లే బాధ్యతను నిర్వర్తించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, ప్రగ్యా జైస్వాల్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement