‘‘దర్శకునిగా నా రెండో సినిమా ‘సన్నాఫ్ ఇండియా’. ద్వితీయ చిత్రానికే మోహన్‌బాబు, ఇళయరాజాగార్ల వంటి వారితో పని చేయడం నా అదృష్టం. అలాగే మోహన్‌బాబుగారు అడగ్గానే ఆయన పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. మంచు మోహన్‌బాబు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. విష్ణు మంచు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ.. ‘‘కరోనా టైమ్‌లో మోహన్‌బాబుగారిని కలిసి, చిన్న ప్రయోగం చేద్దాం అని ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పడంతో ఓకే చెప్పేశారు.
చదవండి: తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే..
విష్ణుగారు కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఒప్పుకున్నారు. ఓటీటీ కోసమని ఈ సినిమా తీశాం. ఫైనల్ ఔట్‌పుట్ చూశాక థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని మోహన్‌బాబుగారు చెప్పడంతో ఇప్పుడు విడుదల చేస్తున్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ప్రశ్నించే విధంగా విరూపాక్ష పాత్ర (మోహన్‌బాబు) ఉంటుంది. ఈ మూవీలో హీరో ప్రైవేట్ జైలుని నడుపుతుండటం కొత్త ఆలోచన. సినిమాని కమర్షియల్‌గా కాకుండా ప్రయోగాత్మకంగా తీశాను. ‘పుణ్యభూమి నా దేశం, రాయలసీమ రామన్నచౌదరి’ లాంటి పవర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమా క్లైమాక్స్‌లో చెప్పారు మోహన్‌బాబుగారు. ఈ చిత్రం ప్రారంభం, క్లైమాక్స్ ఎవరూ మిస్ కావొద్దు.
చదవండి: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్
నా ధైర్యం మోహన్‌బాబుగారే.. ఈ చిత్రంలోని డైలాగుల వల్ల ఎలాంటి వివాదాలు వచ్చినా ఆయన చూసుకుంటారు. ఇది మోహన్‌బాబుగారి విలువను తగ్గించే చిత్రమైతే కాదు. మా సినిమా ప్రివ్యూ చూసిన వారు ‘ఇంత సాహసం ఎందుకు చేశారు?’ అంటూనే ‘సినిమా చాలా బాగుంది’ అని అభినందించారు.. ఈ అభినందనలు 18న ప్రేక్షకుల నుంచి వస్తే చాలా హ్యాపీ. ఇండస్ట్రీలో సక్సెస్ అనేదానిపైనే మా తర్వాతి చిత్రాలు ఆధారపడి ఉంటాయి.. ప్రతి దర్శకుడి జీవితం శుక్రవారంతో ముడిపడి ఉంటుంది. ఆ శుక్రవారం తాము హీరో అవుతామా? లేదా? అని ప్రతి డైరెక్టర్ ఎదురు చూస్తుంటాడు. మోహన్‌బాబుగారు, మంచు లక్ష్మీ నటిస్తున్న చిత్రానికి కథ ఇచ్చాను. మోహన్‌బాబుగారి కోసం మరో కమర్షియల్ కథ సిద్ధం చేశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment