Mohan Babu Congratulates Chiranjeevi For Winning IFFI 2022 Award, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Mohan Babu: చిరంజీవికి మోహన్‌ బాబు శుభాకాంక్షలు

Published Wed, Nov 23 2022 12:06 PM | Last Updated on Wed, Nov 23 2022 1:02 PM

Mohan Babu Congratulate Chiranjeevi for Winning IFFI 2022 Award  - Sakshi

విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు మెగాస్టార్‌ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ 2022’ (IFFI)పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘మై డియర్‌ చిరంజీవి గోవాలో జరుగుతున్న ఇఫి వేడుకలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోబోతున్నందుకు అభినందనలు. షిర్డి సాయిబాబా ఆశీస్సులతో మీరు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు.

చదవండి: వైష్ణవిని హీరోయిన్‌గా పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్‌ నెగిటివిటీ: దర్శకుడు

దీనికి చిరంజీవి ‘థ్యాంక్యూ మిత్రమా’ అంటూ మోహన్‌ బాబు ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. కాగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ - 2022 అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ కూడా చిరు నటనను ప్రశంసిస్తూ తెలుగులో ట్వీట్‌ చేసి చిరును అభినందించిన సంగతి తెలిసిందే. అలాగే మంచు విష్ణు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఇలాంటి గౌరవం లభిస్తున్నందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. ఇది మన తెలుగు చిత్ర సీమకు ఎంతో గర్వకారణం’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. 
Congratulations to my dear @KChiruTweets on being honored at @IFFIGoa. Wishing you many more laurels with the blessings of Sri Shirdi Sai Baba

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement